translateexpand_more

Rcb Ipl 2026 Win News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu01 Jun, 03:34 pm
చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంలో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో అతను 16 మ్యాచ్‌లలో 226 పరుగులు చేయడంతో పాటు 14 వికెట్లు కూడా పడగొట్టాడు. తాజా విజయంతో కృణాల్ పాండ్యా ఖాతాలో ఐదో ఐపీఎల్ ట్రోఫీ చేరింది. గతంలో అతను ముంబై ఇండియన్స్ తరపున మూడు సార్లు (2017, 2019, 2020) టైటిల్స్ గెలవగా, ఇప్పుడు ఆర్‌సీబీ తరపున రెండు సార్లు (2025, 2026) కప్‌లు అందుకున్నాడు. విరాట్ కోహ్లీ సరదా కామెంట్.. ఆర్‌సీబీ విజయ సంబరాల్లో కృణాల్ పాండ్యా తన ఐదు వేళ్లను చూపిస్తూ, తాను ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచానని సైగ చేశాడు. పక్కనే ఉన్న విరాట్ కోహ్లీ దీనిని గమనించి, కృనాల్‌ను సరదాగా ఆటపట్టించాడు. ‘నువ్వు ఇప్పుడు పక్కా ఆర్‌సీబీ ఆటగాడివి.. కాబట్టి ఆ ఐదు వేళ్లు పక్కన పెట్టి, ఆర్‌సీబీ తరపున గెలిచిన రెండు టైటిళ్లను మాత్రమే చూపించు’ అంటూ విరాట్ కోహ్లీ కాస్త నువ్వుతూనే కోపంగా అన్నాడు. కోహ్లీ మాటలకు కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ నవ్వులు ఆపుకోలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు, ట్రోఫీ పక్కన కూర్చోవడానికి జితేశ్ శర్మ కేవలం విరాట్ కోహ్లీ కోసమే వెతకడం ఆర్‌సీబీ ఆటగాళ్ల మధ్య ఉన్న బాండింగ్‌ను చూపిస్తోంది. కృనాల్ పాండ్యా ఏమన్నాడంటే? ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలవడంపై కృనాల్ పాండ్యా జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశాడు. ‘క్రికెట్‌లో ట్రోఫీలు గెలవడమే నాకు అన్నిటికంటే పెద్ద ప్రేరణ. ఛాంపియన్‌షిప్ కప్‌ను చేతిలోకి తీసుకోవడంలో ఉండే కిక్కే వేరు.’ ‘వ్యక్తిగత ప్రదర్శనలు, మ్యాచ్‌లు గెలవడం ఆనందాన్ని

NTV Telugu01 Jun, 10:53 am
విన్నింగ్ షాట్ తర్వాత విరాట్ కోహ్లీ వింత సెలబ్రేషన్.. ఆ సైగకు అర్థం ఏమిటి..? వీడియో వైరల్

ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును గెలిపించి, రెండోసారి ట్రోఫీని అందించిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన ఒక వింత సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. మ్యాచ్‌ను గెలిపించే పరుగులను కొట్టిన వెంటనే, కోహ్లీ స్టేడియంలోని స్టాండ్స్ వైపు చూస్తూ, ఎవరినో చూపిస్తూ చేతులతో ఒక వింత సంకేతాన్ని చూపించాడు. కోహ్లీ కావాలనే ఈ సైగ చేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నా, దాని అసలు అర్థం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. ఈ వీడియో బయటకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో అభిమానులు దీనిపై రకరకాలుగా స్పందించడం మొదలుపెట్టారు. "కోహ్లీ చేసిన ఈ సెలబ్రేషన్ అర్థం ఏంటో ఎవరైనా చెప్పగలరా?" అని ఒకరు, "నేను ఎప్పుడూ కోహ్లీని ఇలాంటి సైగ చేయడం చూడలేదు, దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి?" అని మరొకరు ట్విట్టర్ (X) వేదికగా ప్రశ్నించారు. మైదానంలో ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా, దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకునే కోహ్లీ, ఈసారి చేసిన సైగ మాత్రం అతని వీరాభిమానులను సైతం అయోమయంలో పడేసింది. ఈ సైగ ఎవరిని ఉద్దేశించి చేశాడు? ఎవరికైనా సమాధానం చెప్పడానికి ఇలా చేశాడా? అనే దానిపై ఇంటర్నెట్‌లో ఎన్నో కథనాలు వస్తున్నాయి. దీనిపై అటు కోహ్లీ గానీ, ఇటు ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ గానీ ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. బెంగళూరు జట్టు చారిత్రాత్మక విజయం సాధించిన ఈ ఆనందంలో, కోహ్లీ చేసిన ఈ రహస్య సెలబ్రేషన్ మ్యాచ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోహ్లీ స్వయంగా దీని గురించి ఎప్పుడు చెప్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.