translateexpand_more

Road Accident Updates News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy03 Jun, 03:44 pm
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మాజీ ఎంపీ మధుయాష్కీ సతీమణికి గాయాలు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ సతీమణి డా. సుచి గౌడ్ కారు ప్రమాదంలో గాయపడ్డారు. అమెరికాలో ఈ కారు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ సతీమణి డా. సుచి కారు ప్రమాదంలో గాయపడ్డారు. అమెరికాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. మధుయాష్కీ దంపతులు తమ కుమార్తె డా. గగనను ఎండీ కోర్సులో చేర్పించారు. అనంతరం వారిద్దరూ వేర్వేరు కార్లలో న్యూయార్క్‌కు వెళ్తుండగా డా. సుచి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వర్షం కారణంగా ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో డా. సుచి గౌడ్‌కు పక్కటెముకలు విరిగాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మధుయాష్కీ గౌడ్‌ను ఫోన్‌లో పరామర్శించారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం 2026.. సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో

Road Accident Updates News Keyword | Telugu Digital