
ఓటీటీ వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న నటి నేహల్ వదోలియా మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ ప్రముఖ క్రికెటర్ తనకు సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలతో ఆ క్రికెటర్ ఎవరనే దానిపై ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.ఇటీవల ‘సునో ఇండియా పాడ్‌కాస్ట్’లో పాల్గొన్న నేహల్‌ను.. "ఏదైనా క్రికెటర్ మీకు ఎప్పుడైనా డైరెక్ట్ మెసేజ్ చేశారా?" అని అడగ్గా, ఆమె నవ్వుతూ "పేరు చెప్పేయమంటారా?" అని బదులిచ్చారు. ఆ తర్వాత "అతను అంత పాప్యులర్ కాదు, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందినవాడు. అతనికి విడాకులు కూడా అయ్యాయి" అని కొన్ని క్లూస్ ఇచ్చారు.ఎలాంటి మెసేజ్‌లు పంపేవాడని ప్రశ్నించగా.. తన సోషల్ మీడియా స్టోరీస్‌కు తరచూ రియాక్ట్ అయ్యేవాడని, తన అందాన్ని పొగుడుతూ 'హాట్','బ్యూటిఫుల్','ప్రెట్టీ' వంటి మెసేజ్‌లు పంపేవాడని నేహల్ వివరించారు. అయితే, తనకు ఆ సంభాషణ కొనసాగించడం ఇష్టం లేకపోవడంతో స్పందించలేదని తెలిపారు. "నేను మెసేజ్ చేస్తే అతను మళ్లీ మొదలుపెడతాడు. అందుకే నాకు మాట్లాడటం ఇష్టం లేదు" అని చెప్పిన నేహల్, చివరికి ఆ క్రికెటర్‌ను బ్లాక్ చేసినట్లు వెల్లడించారు.ఈ పాడ్‌కాస్ట్ క్లిప్‌లు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ మిస్టరీ ఆటగాడు ఎవరనేది కనిపెట్టే పనిలో పడ్డారు. కొందరు షిమ్రాన్ హెట్‌మెయర్, తుషార్ దేశ్‌పాండే పేర్లను ప్రస్తావించగా, మరికొందరు యుజ్వేంద్ర చాహల్ కూడా గతంలో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాడంటూ కామెంట్లు చేస్తున్నారు.నేహల్ ఇలాంటి ఆరోపణలతో వార్తల్లో నిలవడం ఇది మొదటిసారి కాదు. కొద్ది