translateexpand_more

Samarth Singh News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 07:23 am
త్విశా శర్మ కేసు.. కీలక సాక్షిపై సమర్థ్ స్నేహితుల దాడి

భోపాల్, జూన్ 2: నటి త్విశా శర్మ కేసులో కీలక సాక్షి అయిన నీరజ్ దూబేపై దాడి జరిగింది. నిందితుడు సమర్థ్ సింగ్ స్నేహితులు నీరజ్‌పై దాడి చేశారు. మే 30వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. సమర్థ్ సింగ్ ఇంటి సమీపంలో నీరజ్ దూబే సెలూన్ నడుపుతున్నాడు. త్విశా శర్మ కేసులో నీరజ్ కీలక సాక్షిగా మారాడు. దీంతో సమర్థ్ స్నేహితులు నీరజ్‌ను టార్గెట్ చేశారు.

కోర్టులో సాక్ష్యం చెప్పొద్దంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. మే 30వ తేదీన నీరజ్‌ తన సెలూన్ సమీపంలో ఉండగా ఐదుగురు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వచ్చీరాగానే నీరజ్‌ను చుట్టుముట్టి బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఎదురు తిరిగిన నీరజ్‌పై దాడికి దిగారు. ‘నువ్వు ఎందుకు ఈ కేసులో కీలక సాక్షిగా మారావు?’ అని ప్రశ్నించారు. కోర్టులో సమర్థ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దని బెదిరించారు.

నీరజ్‌ను విచక్షణా రహితంగా కొట్టి అక్కడినుంచి వెళ్లిపోయారు. దాడి జరిగిన వెంటనే నీరజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని నీరజ్‌కు భరోసా ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనపై నీరజ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా ప్రాణాలు పోతాయేమోనని చాలా భయపడ్డాను. నాకు రక్షణ కల్పించమని, న్యాయం చేయమని పోలీసులను కోరాను’ అని అన్నాడు.

ఇవి కూడా చదవండి

టీమిండియాలోకి వైభవ్ ఎంపికపై హడావిడి వద్దు: సంజయ్ మంజ్రేకర్

2028 డిసెంబర్‌లో మళ్లీ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం: కేటీఆర్

Samarth Singh News Keyword | Telugu Digital