
హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే, అవకాశం వచ్చిన ప్రతిసారీ వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని, నంబర్ వన్ రేసులో దూసుకుపోవాలని నేటితరం తారలు ఆరాటపడుతుంటారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే, అవకాశం వచ్చిన ప్రతిసారీ వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని, నంబర్ వన్ రేసులో దూసుకుపోవాలని నేటితరం తారలు ఆరాటపడుతుంటారు. కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఇలాంటి అరుదైన కోవలోనే నాచురల్ బ్యూటీ సాయి పల్లవి, క్యూట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ముందు వరుసలో నిలుస్తారు. టాలీవుడ్, బాలీవుడ్ అంటూ సాయి పల్లవి ఎంతో బిజీగా గడుపుతుండగా.. అనుపమ కూడా తనదైన శైలిలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అంటే గ్లామర్ ఒలకబోయాలి, పాటలకే పరిమితం కావాలి అనే ఒక మూస ధోరణి ఉంది. అయితే, అనుపమ (Anupama parameswaran) ఈ లెక్కలను పూర్తిగా మార్చేస్తోంది. మొదటినుంచీ ఆమె కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలకే ఓటు వేస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకుంటున్నప్పటికీ, ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనకంటూ పెట్టుకున్న కొన్ని నియమాలను బ్రేక్ చేయకుండా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తన నట ప్రయాణాన్ని ధైర్యంగా కొనసాగిస్తోంది. తాజాగా విడుదలైన మరీచిక సినిమా అనుపమ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ఏకంగా రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో జీవించేసింది. ఒకవైపు అల్ట్రా మోడ్రన్

