translateexpand_more

Special Wishes News

Latest updates from Telugu Digital news sources.

AP7AM03 Jun, 07:12 am
అబ్బాయ్ సినిమాకు బాబాయ్ ఆశీస్సులు.. 'పెద్ది' కోసం పవన్ స్పెషల్ వీడియో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన‌ 'పెద్ది' సినిమాపై అంచనాలు పెరుగుతున్న వేళ.. జనసేన అధినేత, చెర్రీ బాబాయ్ పవన్ కల్యాణ్ ఆ చిత్రానికి తన మద్దతు తెలిపారు. 'పెద్ది' టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన విడుదల చేసిన ఓ ప్రత్యేక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ 'ఎక్స్' ఖాతా ద్వారా విడుదలైన ఈ వీడియోలో రామ్ చరణ్ సినీ ప్రయాణంలోని పలు ముఖ్యమైన సన్నివేశాలను పొందుపరిచారు. రామ్ చరణ్ అనే పేరులోనే శ్రీరామభక్తుడైన హనుమంతుడి లక్షణాలు ఉన్నాయని, ఆయన భక్తి, శక్తి, సమర్పణ భావాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పోలిక అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న 'పెద్ది' చిత్రం రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండగా, పవన్ స్వయంగా వీడియో విడుదల చేయడం ఆ అంచనాలను మరింత పెంచింది. 'పెద్ది' సినిమా మార్గంలో ఎలాంటి అడ్డంకులు ఎదురవకుండా ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలని, ఈ చిత్రం ఘన విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాలని పవన్ కల్యాణ్ తన వీడియోలో ఆకాంక్షించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Special Wishes News Keyword | Telugu Digital