translateexpand_more

Sushmita Sen News

Latest updates from Telugu Digital news sources.

Chitrajyothy02 Jun, 10:12 am
సుస్మితను గోల్డ్ డిగ్గర్ అనడం అన్యాయం

బాలీవుడ్‌ నటి సుస్మితాసేన్‌పై వస్తున్న ఆరోపణలను లలిత్‌ మోదీ తిప్పికొట్టారు. ఆమెను గోల్డ్‌ డిగ్గర్‌ అని కామెంట్‌ చేయడం సరికాదన్నారు. బాలీవుడ్‌ నటి సుస్మితాసేన్‌పై వస్తున్న ఆరోపణలను లలిత్‌ మోదీ తిప్పికొట్టారు. ఆమెను గోల్డ్‌ డిగ్గర్‌ అని కామెంట్‌ చేయడం సరికాదన్నారు. సుస్మితా సేన్‌ డబ్బు కోసం ఆరాటపడే వ్యక్తి అని ఇటీవల ఆమెపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే! దీనిపై ఓ ఇంటర్వ్యూలో లలిత్‌ మోదీ మాట్లాడారు. ‘సుస్మిత నాకు నాకెంతో స్పెషల్‌. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. నేను ఈ స్థాయిలో ఉండటం వెనుక ఆమె సహాయం ఎంతో ఉంది. మేం ఎప్పుడు బయటకు వెళ్లినా దేనికీ నా చేత డబ్బు ఖర్చు చేయనిచ్చేది కాదు. తానే అన్ని బిల్స్‌ పే చేసేది. నేనే ఆమె డబ్బులపై ఆధారపడ్డాను. నిజానికి నేను ఆమెకు కెప్ట్‌ బాయ్‌ఫ్రెండ్‌లా ఉన్నాను. ఆమె మాత్రం ఎవరి దగ్గర ఏదీ ఆశించదు. సుస్మిత సినీరంగం, వ్యాపార రంగంలో కష్టపడి ఎదిగిన మహిళ. నాకు తెలిసిన చాలామంది కంటే ఆమె దగ్గర ఎక్కువ వజ్రాలు ఉన్నాయి. అవన్నీ ఆమె స్వయంగా సంపాదించుకుంది. ఆమెకు డైమండ్‌ స్టోర్స్‌ కూడా ఉన్నాయి. ఆమెను గోల్డ్‌ డిగ్గర్‌ అనిపిలవడం అన్యాయం. ‘ఆమె గోల్డ్‌ డిగ్గర్‌ కాదు.. నేనే డైమండ్‌ డిగ్గర్‌ని’. ఆమె వ్యక్తిత్వం తెలియని చాలామంది ఆమె పై కామెంట్స్‌ చేస్తుంటారు’ అని అన్నారు.

Telugu Cinema02 Jun, 07:12 am
తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్ - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ఒకప్పుడు హీరోయిన్ గా చెలామణి అయిన సుష్మిత సేన్ (Sushmita Sen) ఇప్పుడు వయసు కారణంగా సినిమాల్లో నటించడం లేదు. అడపాదడపా వెబ్ డ్రామాలు చేస్తోంది. త్వరలో 51వ బర్త్ డే జరుపుకోనున్న సుష్మితకి ఇంకా పెళ్లి కాలేదు. ఐతే ఇద్దరి పిల్లలని దత్తత తీసుకొంది. ఇక వ్యాపారవేత్త లలిత్ మోడీని ఆ మధ్య పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి. కానీ వారి బ్రేకప్ వెంటనే జరిగింది. డేటింగ్ పేరుతో లలిత్ డబ్బులు వాడేసింది అనే ఆరోపణలను అతను కొట్టి పారేశారు. ఆమెని గోల్డ్ డిగ్గర్ అని ఆ మధ్య జనం ట్రోల్ చేశారు. గోల్డ్ డిగ్గర్ అంటే ధనవంతులతో ప్రేమాయణాలు సాగించే అమ్మాయిలు. తనకన్నా సుష్మిత ఎక్కువ సంపాదించింది అన్నట్లుగా వివరణ ఇచ్చారు. తాము ఇద్దరం కలిసి ఉన్నప్పుడు తాను ఒక్క రూపాయి కూడా ఆమె కోసం ఖర్చు పెట్టలేదని చెప్పారు లలిత్. సుష్మితకి తాను నగలు, వజ్రాలు బహుమతిగా కూడా ఇవ్వలేదు అని స్పష్టం చేశారు. “సుష్మిత డబ్బుల కోసం డేటింగ్ చేసే మనిషి కాదు. ఆమె కష్టపడి పైకి వచ్చింది. స్వతంత్ర భావాలున్న వ్యక్తి. ఆమెకి ఎన్నో వజ్రాలు, నగలు ఉన్నాయి. అన్నీ ఆమె సంపాదించుకున్నవే,” అని చెప్పారు లలిత్.

AP7AM02 Jun, 02:40 am
సుస్మిత సేన్ తో బంధంపై ఏళ్ల తర్వాత స్పందించిన లలిత్ మోదీ.. సంచలన నిజాలు వెల్లడి

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, విశ్వసుందరి సుస్మితా సేన్ మధ్య 2022లో నడిచిన ప్రేమాయణం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సుస్మితను 'గోల్డ్ డిగ్గర్' (డబ్బు కోసం ఆశపడే వ్యక్తి) అంటూ సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించారు. ఈ ఆరోపణలపై లలిత్ మోదీ ఏళ్ల తర్వాత స్పందించారు. సుస్మితపై వచ్చిన విమర్శలన్నీ అవాస్తవమని, తమ బంధంలో ఖర్చులన్నీ ఆమే భరించేదని స్పష్టం చేశారు.ఇటీవల 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ ఈ విషయాలను పంచుకున్నారు. "ఆమెను గోల్డ్ డిగ్గర్ అనడం చాలా తప్పు. వాస్తవానికి మా ప్రయాణాల్లో ఖర్చులన్నీ ఆమే చూసుకునేది. చెప్పాలంటే.. నేనొక కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా (ఆమె పోషణలో ఉన్న ప్రియుడిలా) ఉండేవాడిని" అని మోదీ అన్నారు. తమలో ఎవరైనా డిగ్గర్ ఉంటే, అది వజ్రాల కోసం వెతికిన తానేనని ఆయన చమత్కరించారు. సుస్మిత తన కంటే ముందే ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఆమెకు సొంతంగా వజ్రాల వ్యాపారం కూడా ఉందని తెలిపారు.2022 జులైలో లలిత్ మోదీ.. సుస్మితతో కలిసి విహారయాత్రల్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఆమెను తన 'బెటర్ హాఫ్' అని ప్రకటించారు. దీంతో సుస్మితపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. లలిత్ మోదీ సంపద కోసమే ఆమె బంధం కొనసాగిస్తోందని ఆరోపణలు గుప్పించారు.అయితే ఆనాటి ట్రోలింగ్‌పై సుస్మిత కూడా ఎంతో హుందాగా స్పందించారు. "నేను బంగారం కంటే లోతుగా తవ్వుతాను. నాకు ఎప్పటినుంచో వజ్రాలంటేనే ఇష్టం. వాటిని ఇప్పటికీ నేనే

Sushmita Sen News Keyword | Telugu Digital