translateexpand_more

Telangana Latest News News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 06:59 am
డిసెంబర్ లో మళ్లీ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యాలయంలో అమరవీరులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల పాలైందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యాలయంలో అమరవీరులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఆపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల పాలైందని వ్యాఖ్యానించారు. లివింగ్ లెజెండ్ కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ వచ్చాక నోరుందని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 'ఎత్తిన జెండా దించనని.. జెండా దించితే రాళ్లతో కొట్టిచంపమని అన్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్' అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 2028 డిసెంబర్‌లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నెత్తురు పారిన చోట సాగు నీళ్లు తీసుకువచ్చింది కేసీఆర్ అని తెలిపారు. లక్షా 65 వేల ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ అని.. అల్పకులు ఏది పడితే అది మాట్లాడతారని మండిపడ్డారు. దేశమంతా కాంగ్రెస్‌ను వదిలించుకుందన్నారు. తెలంగాణను కాంగ్రెస్.. కుక్కలు చింపిన విస్తరిలా చేస్తోందని వ్యాఖ్యానించారు. రైతులు.. అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి వచ్చిందన్నారు. కృష్ణా, గోదావరిని గురువుకు గురుదక్షిణగా రేవంత్ ఇస్తున్నారని ఆరోపించారు. ‘రాహుల్ గాంధీ.. అశోక్‌నగర్ వచ్చి చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? సెక్యూరిటీ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బయటికి వస్తారా.? రైతుబంధు లేదు.. కానీ రాహుల్ గాంధీ బంధు టింగ్ టింగ్ అని వెళ్తోంది. తెలంగాణ తల్లి ఒడ్డాణం, కిరీటం ఎత్తుకుపోతున్నారు’ అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో నేడు పవన్ కల్యాణ్ ప్రెస్‌‌మీట్.. ఆసక్తికర పోస్ట్ అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ప్రజాపాలన: మహేశ్‌ గౌడ్

Telangana Latest News News Keyword | Telugu Digital