translateexpand_more

Uppena Director News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu02 Jun, 12:02 pm
మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. పెద్ది’ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్

Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమా 'పెద్ది'. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. కాగా ఈ సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు చూపిస్తున్న డెడికేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన వ్యక్తిగత జీవితాన్ని, కనీసం నిద్రను కూడా పక్కనపెట్టి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు తన బిజీ షెడ్యూల్ చెప్పి షాక్ ఇచ్చారు. మ్యారేజ్ డే రోజు కూడా .. సినిమా ప్రమోషన్స్ కోసం బుచ్చిబాబు ఎంతలా కష్టపడుతున్నారో ఆయన మాటల్లోనే స్పష్టమైంది. "ఈరోజు నా వెడ్డింగ్ యానివర్సరీ (పెళ్లి రోజు).. కానీ కనీసం ఆ విషయం కూడా గుర్తులేనంత బిజీగా ఉన్నాను. గత మూడు రోజుల నుంచి అసలు తారీఖులను కూడా చూడడం లేదు. నిద్ర కూడా లేకుండా కేవలం 'పెద్ది' ప్రమోషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే మునిగిపోయాను" అని బుచ్చిబాబు వెల్లడించారు. ఒక దర్శకుడికి తన సినిమాపై ఉన్న ప్యాషన్, డెడికేషన్‌కు ఈ సంఘటనే ఒక నిదర్శనమని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. మీరు హిట్ అంటేనే నాకు హ్యాపీ.. తన కష్టమంతా ప్రేక్షకులు ఇచ్చే రిజల్ట్ పైనే ఆధారపడి ఉందంటూ బుచ్చిబాబు భావోద్వేగానికి గురయ్యారు. "నేను ఎంత కష్టపడ్డాను, ఎన్ని రోజులు నిద్ర లేదు అనేది ముఖ్యం కాదు. జూన్ 4న థియేటర్లలో మీరు సినిమా చూసి 'హిట్' అయిందని చెప్తే చాలు.. అదే నాకు అసలైన హ్యాపీనెస్, నా కష్టానికి దక్కే నిజమైన ప్రతిఫలం" అని అన్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'పెద్ది' చిత్రంలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని హై-వోల్టేజ్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గ్లామర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు పవర్‌ఫుల్ రోల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. మరి తన పెళ్లి రోజును సైతం పక్కనపెట్టి బుచ్చిబాబు పడిన కష్టానికి, రామ్ చరణ్ చూపించిన డెడికేషన్‌కు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ రాబోతుందో చూడాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.