
Yash: కన్నడ స్టార్, ‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు యశ్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ వాస్తవానికి ఈ జూన్‌లో విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దీనితో పాటు బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’లోనూ యశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్స్‌తో ఆయన ఎంతో బిజీగా గడుపుతున్నారు. Dancer Pandu: ‘ఢీ’ జోడి డాన్సర్ పండుకు ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాళ్లకు తీవ్ర గాయాలు ఇంతటి బిజీ షెడ్యూల్‌లోనూ యశ్ (Yash)తన అభిమాని పట్ల చూపిన ఆత్మీయత అందరి హృదయాలను గెలుచుకుంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన వీరాభిమాని, శివమొగ్గ జిల్లా యశ్ అభిమాన సంఘం అధ్యక్షుడు అయిన సునీల్‌కు ఆయన స్వయంగా వీడియో కాల్ చేశారు. సునీల్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న యశ్, ధైర్యంగా ఉండాలంటూ అతనిలో కొత్త భరోసాను నింపారు. అభిమాన హీరో స్వయంగా మాట్లాడటంతో ఆ బాధితుడు ఎంతో ఆనందానికి గురయ్యాడు. అంతేకాకుండా, సునీల్ క్యాన్సర్ చికిత్సకు అవసరమైన అన్ని సమయాల్లో తాను అండగా ఉంటానని యశ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్టార్‌డమ్ తలకెక్కిన ఈ రోజుల్లో, ఎంత బిజీగా ఉన్నా సమయం కేటాయించి తన అభిమానికి కొండంత అండగా నిలిచిన యశ్ రియల్ హీరో అనిపించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాల్‌కు సంబంధించిన విషయం సాషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో యశ్ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.