
CM Chandrababu: కాకినాడ జిల్లా తుని పర్యటనలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తుని నియోజకవర్గ ప్రజలు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన యనమల దివ్యకు మంచి మన్ననలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఒకప్పుడు తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేదని, అయితే యనమల రామకృష్ణుడు ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన తర్వాత నియోజకవర్గం కొంత వెనుకబడిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఉద్దేశంతో పొత్తుల అవసరాన్ని ముందుగానే గుర్తించి ప్రకటించిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని చంద్రబాబు అన్నారు. రెండేళ్ల క్రితం ఇదే నెల 12వ తేదీన తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. పవన్ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ, కేవలం బటన్ నొక్కడం ద్వారా నిధులు పంపిణీ చేయడంలో ఒక రకమైన ఆనందం ఉంటుందని అన్నారు చంద్రబాబు. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించేందుకు 33 శాతం సీట్లను కేటాయించి వారిని నాయకత్వ స్థానాలకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య రంగంలో సంస్కరణలపై స్పందిస్తూ, ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా "సంజీవని" ప్రాజెక్టును అమలు చేస్తామని తెలిపారు. అలాగే ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత డాక్టర్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నానికి రైల్వే జోన్ సాధించామని చెప్పారు. సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లపై స్పందించిన సీఎం, చాలామంది టెలివిజన్ సీరియల్స్ చూసి అనవసర టెన్షన్లు తెచ్చుకుంటున్నారని అన్నారు. సెల్‌ఫోన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని 2047 నాటికి దేశానికి ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు, విధ్వంసక