translateexpand_more

Trisha Krishnan News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu03 Jun, 08:51 am
త్రిషకు మెగా ఫ్యామిలీ నుంచి సమ్మర్ స్పెషల్ సర్ ప్రైజ్.. విజయ్ రూమర్ల మధ్య వైరల్ పోస్ట్

Trisha Krishnan:మెగా కోడలు ఉపాసన పంపిన ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్‌ను చూసి త్రిష ఆనందం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విజయ్‌తో వస్తున్న రూమర్లపై ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ తాజాగా రెండు కారణాలతో వార్తల్లో నిలిచారు. ఒకవైపు మెగా ఫ్యామిలీ నుంచి ఆమెకు ప్రత్యేక సమ్మర్ గిఫ్ట్ అందగా, మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో ఆమె పేరు ముడిపెడుతూ వస్తున్న రూమర్ల మధ్య చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. మెగా కోడలు ఉపాసన కొణిదెల నిర్వహిస్తున్న “అత్తమ్మాస్ కిచెన్” నుంచి త్రిషకు ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్ చేరింది. ఇందులో ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చళ్లతో పాటు వివిధ రకాల రుచికరమైన పొడులు ఉన్నాయి. ఈ హ్యాంపర్‌ను చూసిన త్రిష చాలా సంతోషం వ్యక్తం చేశారు. గిఫ్ట్ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన త్రిష, “నిజంగా వేసవి వచ్చినట్లు అనిపిస్తోంది” అంటూ ఉపాసనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు కూడా ఉపాసన ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉండగా, ఇటీవల త్రిష చేసిన మరో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. తన పెంపుడు కుక్క బెడ్‌పై పడుకుని ఉన్న ఫోటోను షేర్ చేసిన ఆమె, “నా విషయాల్లో ముక్కు పెట్టేందుకు నేను అనుమతించేది ఇదొక్కటే” అనే అర్థం వచ్చే క్యాప్షన్‌ను జోడించారు. ఈ పోస్ట్‌ను చాలా మంది నెటిజన్లు ఆమె వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లకు సమాధానంగా భావిస్తున్నారు. గత కొంతకాలంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో త్రిష పేరు ముడిపెడుతూ సోషల్ మీడియాలో పలు ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయాలపై త్రిష ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. తాజాగా చేసిన ఈ పోస్ట్ మాత్రం ట్రోల్స్‌కు పరోక్ష సమాధానంగా కనిపించిందని అభిమానులు చెబుతున్నారు. అలాగే త్రిష ఇటీవల “మ్యాజికల్ మే” పేరుతో కొన్ని ప్రత్యేక ఫోటోలను కూడా పంచుకున్నారు. అందులో ఆమె పుట్టినరోజు వేడుకలు, సెల్ఫీలు, పూల బొకేలు, వ్యక్తిగత క్షణాలు, అలాగే తన పెంపుడు కుక్క ఫోటోలు ఉన్నాయి.

10TV Telugu31 May, 01:49 am
సీఎం అయ్యాక తొలిసారి విజయ్.. త్రిషతో కలిసి ఒకే కార్ లో వచ్చి.. వీడియోలు వైరల్

Vijay Trisha : తమిళనాడు స్టార్ హీరో విజయ్ ఇటీవల సీఎం అయిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ – హీరోయిన్ త్రిష రిలేషన్ షిప్ లో ఉన్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత విజయ్ కి వేరే అమ్మాయితో సంబంధం ఉందని చెప్తూ విడాకుల కేసు వేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది. అప్పుడే విజయ్ – త్రిష కలిసి ఓ పెళ్ళికి హాజరవ్వడంతో వీరి రిలేషన్ బహిర్గతం అయింది. అప్పట్నుంచి రెగ్యులర్ గా విజయ్ – త్రిష గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక విజయ్ ఎన్నికల్లో గెలిచాక త్రిష విజయ్ ఇంటికి వెళ్లడం, సీఎంగా ప్రమాణ స్వీకారం రోజు త్రిష హాజరయి సందడి చేయడం, విజయ్ ఫ్యామిలీతో కలివిడిగా ఉండటంతో వీరి రిలేషన్ షిప్ కి మరింత బలం చేకూరింది. ఇప్పుడు విజయ్ సీఎం అయ్యాక తాజాగా విజయ్ – త్రిష కలిసి ఒకే కార్ లో వచ్చారు. Also See : Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ బర్త్ డే స్పెషల్.. శోభిత బోల్డ్ ఫొటోలు.. నిన్న మే 30న తమిళ్ స్టార్ హీరో అజిత్ తల్లి మరణించారు. ఆమె అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. నిన్న రాత్రి విజయ్, త్రిష కలిసి ఒకే కార్ లో అజిత్ ఇంటికి వెళ్లారు. అజిత్ ఈ ఇద్దర్ని రిసీవ్ చేసుకున్నారు. విజయ్ – త్రిష అజిత్ తల్లికి నివాళులు అర్పించారు. దీంతో విజయ్ – త్రిష కలిసి రావడం, అధికారికంగా రిలేషన్ షిప్ అనౌన్స్ చేయకుండా విజయ్ సీఎంగా ఉండి ఈ ఇద్దరూ ఒకే కార్ లో కలిసి రావడంతో ఈ వీడియోలు వైరల్

10TV Telugu25 May, 10:37 am
Trisha Sentiment for Chiranjeevi Vishwambhara movie Trisha Krishnan: సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ‘చెన్నై చిన్నది’ త్రిష క్రేజ్ సరికొత్త రికార్డులను...

Trisha Sentiment for Chiranjeevi Vishwambhara movie Trisha Krishnan: సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ‘చెన్నై చిన్నది’ త్రిష క్రేజ్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. సీనియర్ స్టార్ హీరోల పక్కన నటిస్తూ, వారందరికీ బ్యాక్...

Sakshi27 May, 03:55 am
త్రిష నలుపు దుస్తులు ధరిస్తే హిట్ పక్కా..ఇదిగో సాక్ష్యం

గత కొద్ది కాలంగా చర్చనీయాంశంగా మారిన నటి త్రిష. ఒక పక్క ఈ బ్యూటీ తమిళంలో అజిత్‌ కు జంటగా నటించిన విడాముయర్చి, కమలహాసన్‌తో కలిసి నటించిన థక్‌ లైఫ్‌ చిత్రాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ అపజయం పాలవడం, ఆ తరువాత నటుడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి ట్రోలింగ్‌లకు గురవడం వంటి విషయాలతో చాలా తలనొప్పికి గురైన త్రిష, ఎప్పుడైతే విజయ్‌ ఎన్నికల్లో గెలవడంతో పాటు పార్టీని ఒంటి చేతితో గెలిపించుకుని ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి త్రిష ఆనందంతో తుళ్లి పడుతున్నారనే చెప్పాలి. అదేవిధంగా నటి మంచి విజయాన్ని చూసి చాలా కాలం కావడంతో విచారంలో ఉన్న త్రిషకు కరుప్పు చిత్రం రూపంలో మంచి విజయం వరించింది. దీంతో ఈ బ్యూటీ రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఇకపోతే ఆమె తన అభిమాని వల్ల ఇంకా సంతోషానికి లోనవుతున్నారప్పుడు. సూర్య, త్రిష జంటగా నటించిన కరుప్పు చిత్రం గత 15వ తేదీన విడుదలై ఘన విజయాన్ని సాధించింది. దీంతో సూర్య అభిమానుల ఆనందం గురించి పక్కన పెడితే త్రిష అభిమానులు తెగ సంబర పడుతున్నాయి. ఆమె అభిమాని ఒకరు త్రిషతో విజయ్‌ నటించిన ఢిల్లీ, అజిత్‌ నటించిన మంగాత్తా, సూర్య నటించిన ఆరు చిత్రాలు ఈ ముగ్గురు హీరోలకు చాలా మైలు రాయిగా నిలిచారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ మూడు చిత్రాల్లోనూ త్రిష నలుపు దుస్తులు ధరించారని, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అందుకేనేమో ఆ మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించి ఉంటాయన్నారు. అందువల్ల త్రిషను కరుప్పు స్టార్‌ ( బ్లాక్‌ స్టార్‌) అని పిలవవచ్చు అని ఆ అభిమాని చేసి పోస్ట్‌ త్రిష వరకు చేరింది. ఆయన పోస్ట్‌ను

Hindustan Times24 May, 07:38 am
Trisha Krishnan celebrates being Vijay, Suriya, Ajith Kumar's co-star in their highest grossers: ‘The common factor’

Trisha Krishnan celebrates her 43rd birthday by turning 2023's highest-grossing Tamil film "Leo" into a viral fan post. She re-shared pictures of Vijay, Ajith, and Suriya from the film with heart emojis, while her Instagram stories were filled with posts about the success of Karuppu. Trisha attended Vijay's swearing-in ceremony as the new chief minister of Tamil Nadu before her birthday on May 4th.

NTV Telugu25 May, 07:32 am
సౌత్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ బ్యూటీ, క్వీన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా మార్మోగిపోతోంది. రెండు దశాబ్దాలుగా...

సౌత్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ బ్యూటీ, క్వీన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా మార్మోగిపోతోంది. రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఏలుతున్న త్రిష.. తాజాగా కోలీవుడ్ (Tami...