translateexpand_more

Vangalapudi Anitha News

Latest updates from Telugu Digital news sources.

AP7AM02 Jun, 01:06 am
టీడీపీ కార్యకర్తలను వేధించిన సీఐపై వేటు తప్పదు

పాయకరావుపేట సర్కిల్ ఇన్‌స్పెపెక్టర్ (సీఐ) సాకేటి శంకర్ రావుపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. సీఐ శంకర్ రావు వ్యవహారశైలి, గతంలో ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఓ పత్రికలో వచ్చిన కథనంపై ఆమె స్పందించారు. సోమవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విషయం వెల్లడించారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సీఐగా శంకర్ రావు పనిచేశారని, ఆ సమయంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, తీవ్రంగా వేధించారని జూన్ 1న ‘ఈనాడు’ పత్రికలో కథనం ప్రచురితమైంది. ప్రస్తుత పాయకరావుపేట ఎమ్మెల్యే గౌతు శిరీష వంటి నేతలను కూడా ఆయన లక్ష్యంగా చేసుకున్నారని ఆ కథనంలో ఆరోపించారు. ఇంతటి వివాదాస్పద నేపథ్యం ఉన్న అధికారిని హోంమంత్రి సొంత నియోజకవర్గమైన పాయకరావుపేటలో నియమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ విమర్శలపై మంత్రి అనిత స్పందిస్తూ ఆ సీఐ వల్ల పలాస ప్రాంత కార్యకర్తలు ఎదుర్కొన్న ఇబ్బందులపై తనకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. "కార్యకర్తలు ఉంటేనే పార్టీ ఉంటుంది. వారిని గౌరవించుకోవడం నా ప్రథమ కర్తవ్యం. కార్యకర్తల వల్లే నేను నా నియోజకవర్గంలో పనిచేయగలుగుతున్నా" అని ఆమె అన్నారు. అధికారుల గత చరిత్రపై కొన్నిసార్లు ముందస్తు సమాచారం ఉండకపోయినా, ఈ విషయంలో మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. మే 2న పాయకరావుపేట సీఐగా శంకర్ రావు బాధ్యతలు చేపట్టడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

Andhra Jyothy31 May, 09:08 am
పోలీసులపై దాడులు సహించం.. నిందితులపై కఠిన చర్యలు

విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై దాడి జరగడం దురదృష్టకరమని హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో ఉన్న హోంగార్డ్ వెంకటరమణను కొంతమంది కత్తితో దాడి చేశారని పేర్కొన్నారు. విశాఖపట్నం, మే31 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై దాడి జరగడం దురదృష్టకరమని హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో ఉన్న హోంగార్డ్ వెంకటరమణను కొంతమంది కత్తితో దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో వెంకటరమణకు గాయాలయ్యాయని చెప్పుకొచ్చారు. షీలానగర్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డు కేవీ రమణను హోంమంత్రి అనిత ఈరోజు (ఆదివారం) పరామర్శించారు. లంకెలపాలెం వద్ద విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై కొంతమంది దాడి చేశారు. ఈ ఘటనలో హోంగార్డు వెంకటరమణకు గాయాలయ్యాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిన గురించి వైద్యులను అడిగి అనిత తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆమె ఆదేశించారు. వెంకటరమణ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. తక్షణమే పోలీసులు స్పందించి ఆస్పత్రిలో ఆయనను చేర్పించారని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో వెంకటరమణ చికిత్స పొందుతున్నారని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశామని.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అనిత చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసులకు ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. అనునిత్యం పోలీసులు ఎంతో కష్టపడి విధులు నిర్వహిస్తున్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

AP7AM01 Jun, 07:25 am
అనకాపల్లి వర్ష బాధితులకు అనిత భరోసా

ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అనాకపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. కేవలం ఒక అధికారిక పర్యటనలా కాకుండా, బాధితులకు భరోసా ఇచ్చేలా సాగిన ఆమె పర్యటన స్థానికుల్లో కొండంత ధైర్యాన్ని నింపింది. మంత్రి అనిత మొదటగా సత్యవరం గ్రామాన్ని సందర్శించారు. అక్కడ గ్రామస్థులు ఆమెకు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్లను పంపిణీ చేశారు. స్థానిక ప్రజలతో ముచ్చటిస్తూ వారి దైనందిన సమస్యలను, సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత శ్రీరాంపురం గ్రామానికి చేరుకుని, బొద్దపాటి వీరస్వామి కుటుంబాన్ని పరామర్శించి వారి యోగక్షేమాలను ఆరా తీశారు. ఇటీవలి భారీ వర్షాల కారణంగా అరట్లకోట గ్రామానికి చెందిన ఎరకయ్య, శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు మరణించారు. వారి కుటుంబ సభ్యులను మంత్రి అనిత వ్యక్తిగతంగా కలిసి, ఓదార్చారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం వారికి పూర్తిగా అండగా ఉంటుందని, తగిన సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు.

AP7AM27 May, 10:21 am
టీడీపీ ఆవిర్భావమే ఒక తిరుగులేని చరిత్ర

రికార్డులు సృష్టించడం తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని, ఆ పార్టీ ఆవిర్భావమే ఒక తిరుగులేని చరిత్ర, సంచలనమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ మహానాడు ద్వారా గ్రామ గ్రామానికి, ప్రతి కార్యకర్త హృదయానికి పార్టీ చేరుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మహానాడును ‘స్త్రీశక్తి’ థీమ్‌తో నిర్వహించడం మహిళల ఆత్మగౌరవం, సాధికారత, భద్రత పట్ల టీడీపీకి ఉన్న సంకల్పానికి నిదర్శనమని అనిత పేర్కొన్నారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే నారా లోకేశ్ 33 శాతం సీట్ల కేటాయింపుపై భారీ ప్రకటన చేశారని గుర్తుచేశారు. ఇదే వేదికపై వైసీపీపై హోంమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "గతంలో ‘జై జగన్’ అనడానికి నిరాకరించి, ‘జై చంద్రబాబు.. జై తెలుగుదేశం’ అన్నందుకు బీసీ కార్యకర్త తోట చంద్రయ్యను గొడ్డలి పార్టీ రౌడీలు నడిరోడ్డుపై గొంతుకోసి చంపారు" అని మండిపడ్డారు. నాటి జగన్ ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే.. నేడు చంద్రబాబు ప్రభుత్వం వారికి అండగా నిలిచిందని, మహానాడు పండుగ వేళ చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగిగా నియమితులయ్యారని అనిత వెల్లడించారు.

Eenadu28 May, 02:42 pm
నారా కుటుంబం ఎప్పుడూ ప్రజల కోసమే అంకితమైంది

నారా కుటుంబం ఎప్పుడూ ఏపీ ప్రజల కోసమే అంకితమైందని హోంమంత్రి అనిత అన్నారు. తెదేపా మహానాడులో ఆమె ప్రసంగించారు. గత వైకాపా పాలనను ఎండగట్టారు. చంద్రబాబు లాంటి విజనరీ లీడర్‌ మంత్రివర్గంలో స్థానం దక్కడం తన అదృష్టమని అనిత అన్నారు. ఇదీ చదవండి: జగన్‌.. ఈసారి మీకు ఆ ఛాన్స్‌ ఇవ్వం: అచ్చెన్నాయుడు

Andhra Jyothy24 May, 05:48 am
మహానాడును విజయవంతం చేద్దాం: హోంమంత్రి అనిత

- Home » Andhra Pradesh » Visakhapatnam » AP Home Minister Vangalapudi Anitha Calls for Grand Success of TDP Mahanadu VK ABN , Publish Date - May 24 , 2026 | 11:18 AM ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడును మరింత విజయ... - క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. - అనకాపల్లి జిల్లా, మే 24 (ఆంధ్రజ్యోతి): ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడును మరింత విజయవంతం చేద్దామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) పిలుపునిచ్చారు.

Eenadu29 May, 11:55 am
మహిళలకు 33 శాతం సీట్లు.. ఏపీ అభివృద్ధికి బ్లూప్రింట్

ఎన్డీయే కూటమి మహిళల్ని ఓటు బ్యాంకులా కాకుండా విజన్‌-2047 లక్ష్య సాధన శక్తిగా చూస్తోందని ఏపీ హోంమంత్రి అన్నారు. మహిళలకు 33 శాతం సీట్ల కేటాయింపు ప్రకటన రాష్ట్రాభివృద్ధికి బ్లూప్రింట్‌ లాంటిదన్నారు. బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ముందడుగు వేసిన ఏకైక పార్టీ తెదేపా అని పేర్కొన్నారు. ఇతర రాజకీయ పార్టీలూ తెదేపాను అనుసరించాలని అనిత కోరారు. ఈ వార్త చదివారా: రాహుల్‌తో షర్మిల భేటీ.. రాజ్యసభ సీటు కోసమేనా?