translateexpand_more

Andhra Pradesh Crime News News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 05:08 am
ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలు

నెల్లూరు, జూన్ 1: నెల్లూరు నగరంలో చైన్ స్నాచర్లు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు ముగ్గురు మహిళల మెడల్లో బంగారు గొలుసులను అపహరించడం తీవ్ర కలకలం రేపింది. జేమ్స్ గార్డెన్, పడరుపల్లి, చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతాల్లో దుండగులు బరితెగించారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలు సాగాయి. మొత్తం 9 సవర్ల బంగారు గొలుసులు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు నవాబుపేట, వేదాయపాలెం, బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చోరీ జరిగిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే రోజు మూడు ప్రాంతాల్లో దుండగులు చోరీకి పాల్పడటం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చైన్ స్నాచర్లను వెంటనే పట్టుకోవాలని వారు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి..

ఐపీఎల్ చరిత్రలోనే వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత

అనకాపల్లి జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన.. పెన్షన్ల పంపిణీ

Read Latest AP News And Telugu News

Andhra Jyothy31 May, 09:08 am
పోలీసులపై దాడులు సహించం.. నిందితులపై కఠిన చర్యలు

విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై దాడి జరగడం దురదృష్టకరమని హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో ఉన్న హోంగార్డ్ వెంకటరమణను కొంతమంది కత్తితో దాడి చేశారని పేర్కొన్నారు. విశాఖపట్నం, మే31 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఉన్న పోలీసుపై దాడి జరగడం దురదృష్టకరమని హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో ఉన్న హోంగార్డ్ వెంకటరమణను కొంతమంది కత్తితో దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలో వెంకటరమణకు గాయాలయ్యాయని చెప్పుకొచ్చారు. షీలానగర్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డు కేవీ రమణను హోంమంత్రి అనిత ఈరోజు (ఆదివారం) పరామర్శించారు. లంకెలపాలెం వద్ద విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై కొంతమంది దాడి చేశారు. ఈ ఘటనలో హోంగార్డు వెంకటరమణకు గాయాలయ్యాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిన గురించి వైద్యులను అడిగి అనిత తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆమె ఆదేశించారు. వెంకటరమణ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడారు. తక్షణమే పోలీసులు స్పందించి ఆస్పత్రిలో ఆయనను చేర్పించారని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో వెంకటరమణ చికిత్స పొందుతున్నారని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశామని.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అనిత చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసులకు ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. అనునిత్యం పోలీసులు ఎంతో కష్టపడి విధులు నిర్వహిస్తున్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

NTV Telugu26 May, 06:15 am
Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్‌ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..

Thopudurthi Rajasekhar Reddy Arrest: అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో జైపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత ఏడాది జనవరి 25న తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు సోమలదొడ్డి గ్రామ సమీపంలోని రైల్వే పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై అప్పట్లో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే తన కుమారుడి మృతికి వైసీపీ నేతలే కారణమని మృతుడి తండ్రి మల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఇక, దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆడియో, వీడియో రికార్డులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని ముంబై ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి వచ్చిన శాస్త్రీయ ఆధారాల ఆధారంగా అరెస్టులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదే సాక్ష్యాధారాలతో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారించారు. తర్వాత ఆయనను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు సమాచారం. మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో మరికొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకోవడంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Andhra Jyothy26 May, 03:17 am
Home » Andhra Pradesh » Ananthapuram » Topudurthi Raja Reddy Detained in Maheshwar Reddy Death Case VK ABN...

Home » Andhra Pradesh » Ananthapuram » Topudurthi Raja Reddy Detained in Maheshwar Reddy Death Case VK ABN , Publish Date - May 26 , 2026 | 08:47 AM రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి...

NTV Telugu27 May, 02:27 am
సుగాలి ప్రీతి కేసుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: సంచలనంగా మారిన సుగాలి ప్రీతి హత్య కేసుపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉందని ఆయన విమర్శించారు. 2017లో పదో తరగతి చదువుతున్న అమాయక బాలిక సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైందని గుర్తు చేసిన జగన్, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అసలు నిందితులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బాధిత కుటుంబం విజ్ఞప్తి మేరకు ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే కుటుంబానికి కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించినట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా తమ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జగన్ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసును పూర్తిగా పక్కన పెట్టిందని విమర్శించారు. సీబీఐ సిబ్బంది, వనరుల కొరత ఉందని చెబుతున్నా, దర్యాప్తుకు అవసరమైన సహకారం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని జగన్ ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో బాధిత కుటుంబానికి వచ్చే పెన్షన్‌ను కూడా నిలిపేశారని తల్లిదండ్రులు చెప్పారని వెల్లడించారు. సిట్ రిపోర్టు, CDFD ల్యాబ్ నివేదికలు, డీఎన్‌ఏ ప్రొఫైల్ వివరాలు వంటి బలమైన ఆధారాలు ఉన్నప్పటికీ సీబీఐ ద్వారా సమగ్ర దర్యాప్తు జరగకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రశ్నించారు వైఎస్‌ జగన్.. న్యాయం కోసం మరోసారి తమను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు

Andhra Jyothy27 May, 03:49 am
విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో కీలక మలుపు.. ఎంట్రీ

విజయవాడలో వెలుగుచూసిన ఈ టెర్రర్ లింక్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటివరకు ఈ కేసులో విజయవాడకు చెందిన ముగ్గురితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ, మే 27 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో వెలుగుచూసిన ఈ టెర్రర్ లింక్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటివరకు ఈ కేసులో విజయవాడకు చెందిన ముగ్గురితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక అంశంగా భావించిన అధికారులు ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఇప్పటికే ఎన్‌ఐఏ అధికారులకు లేఖ రాశారు. అయితే, విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ అధికారులు ఈ టెర్రర్ లింక్స్ కేసుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ కేసును టేకోవర్ చేసి సంబంధిత కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నారు. ఈ కేసులో అరెస్టయిన వ్యక్తుల కాల్ డేటా, ఆన్‌లైన్ కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీలు, ఇతర రాష్ట్రాలతో ఉన్న సంబంధాలపై ఎన్‌ఐఏ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులకు ఇంకా ఎవరితోనైనా సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణతో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక చర్చ కరెంట్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి గొట్టిపాటి

Andhra Jyothy24 May, 10:39 am
బైండోవర్ ఉల్లంఘించిన నిందితుడి అరెస్ట్.. జైలుకు తరలింపు: డీఎస్పీ

- Home » Andhra Pradesh » Krishna » Gudivada Police Arrest Bind Over Violator Pothuraju in First Such Case in Krishna District VVNP ABN , Publish Date - May 24 , 2026 | 04:09 PM కృష్ణాజిల్లా గుడివాడలో బైండోవర్ ఉల్లంఘించిన... - సెక్షన్ 129(ఇ) బీఎన్ఎస్ఎస్ ప్రకారం ఏడాది పాటు బైండోవర్‌లో అతడు ఉన్నారన్నారు. - గుడివాడ, మే 24: కృష్ణాజిల్లాలో బైండోవర్ ఉల్లంఘించిన స్థానిక వాంబే కాలనీకి చెందిన గొల్లపల్లి పోతురాజును అరెస్ట్ చేసి జైలుకు తరలించామని గుడివాడ పట్టణ డీఎస్పీ పి.