translateexpand_more

Andhra Pradesh Minister News

Latest updates from Telugu Digital news sources.

TeluguOne31 May, 10:48 am
రైతు బిడ్డగా మరోసారి నిరూపించిన మంత్రి నిమ్మల రామానాయుడు

7 కిలోమీటర్ల సైకిల్‌పై ప్రయాణించి స్వగ్రామానికి చేరుకున్నారు.. రొయ్యలకు మేత వేసి, పొలంలో దుక్కి దున్ని.. సైకిల్‌పై ప్రయాణించి, తన పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి.. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తన రైతు మనసును చాటుకున్నారు. అధికార హోదా, ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి స్వగ్రామం అగర్తిపాలెంలో వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాలకు విరామం ఉండటంతో పాలకొల్లు నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్‌పై ప్రయాణించి స్వగ్రామానికి చేరుకున్నారు. మార్గమధ్యంలో ప్రజలను కలుసుకుని వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. గ్రామానికి చేరుకున్న అనంతరం తన సొంత రొయ్యల చెరువును సందర్శించిన మంత్రి, మేత వేసి రొయ్యల ఎదుగుదలను పరిశీలించారు. అనంతరం పొలంలోకి వెళ్లి కూలీలతో కలిసి ట్రాక్టర్‌పై దుక్కి దున్నారు. వ్యవసాయ పనుల్లో నేరుగా పాల్గొని రైతులతో మమేకమయ్యారు.మంత్రి నిమ్మల రామానాయుడు సాధారణ రైతులా వ్యవహరించడం స్థానికులను ఆకట్టుకుంది. ప్రజల మధ్య కలిసిమెలిసి వ్యవసాయ పనులు చేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు. సాధారణంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు పర్యటనలకు వచ్చినప్పుడు కాన్వాయ్‌లు, భారీ భద్రతతో హడావుడి కనిపిస్తుంది. కానీ, రామానాయుడు మాత్రం వీటన్నింటికీ భిన్నంగా చాలా సాధారణంగా వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. తన సొంత ఊరి మట్టితో ఉన్న అనుబంధాన్ని చాటుకుంటూ ఆయన చేసిన ఈ పని స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. పొలంలో పనులు చేస్తున్న సమయంలో స్థానిక రైతులు, కూలీలతో మంత్రి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, సాగునీటి లభ్యత, విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి పలు కీలక అంశాలపై వారితో చర్చించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికే తాను ఇలా వచ్చానని ఆయన పేర్కొన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు తీసుకున్న ఈ వినూత్న నిర్ణయంపై సోషల్

AP7AM31 May, 10:02 am
రొయ్యలకు మేత వేసి, పొలంలో దుక్కి దున్ని... సొంతూరులో మంత్రి నిమ్మల... వీడియో ఇదిగో

ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం తన సెలవు దినాన్ని వినూత్నంగా గడిపారు. రాజకీయాలతో నిత్యం బిజీగా ఉండే ఆయన, కాస్త విరామం దొరకడంతో తన సొంతూరులో రైతుగా మారిపోయారు. వ్యవసాయ పనుల్లో పాల్గొని, క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించారు.ఆదివారం తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి సైకిల్‌పై బయలుదేరిన రామానాయుడు, 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సొంతూరు అగర్తిపాలెం చేరుకున్నారు. అక్కడ తన రొయ్యల చెరువులో మేత వేసి, రొయ్యల ఎదుగుదలను పరిశీలించారు. అనంతరం వరి పొలంలోకి దిగి, ట్రాక్టర్‌తో స్వయంగా దుక్కి దున్నారు. కూలీలతో మాట్లాడారు. ఆ తర్వాత, గ్రామస్థులతో కలిసి శ్రమదానంతో అభివృద్ధి చేస్తున్న హిందూ శ్మశానవాటిక పనుల పురోగతిని సమీక్షించారు.తిరిగి పాలకొల్లుకు సైకిల్‌పై పయనం అవుతుండగా, రోడ్డు పక్కన వేస్తున్న జలజీవన్ మిషన్ పైపులైన్‌ను గమనించారు. భవిష్యత్తులో మరమ్మతుల కోసం కొత్తగా మంజూరైన సిమెంట్ రోడ్డును తవ్వాల్సిన అవసరం రాకుండా, పైప్‌లైన్‌ను పక్కగా వేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు.ఈ పర్యటన వివరాలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. "సెలవు రోజున కొద్దిపాటి సమయం దొరకడంతో సొంత వ్యవసాయ పనుల్లో పాల్గొనడం ఎంతో సంతృప్తి, ఆనందం కలిగించింది" అని ఆయన పేర్కొన్నారు.

Andhra Jyothy25 May, 09:25 am
Home » Andhra Pradesh » Kurnool » bc janardhan reddy banaganapalle development works bypass shadi khana suchi ABN...

Home » Andhra Pradesh » Kurnool » bc janardhan reddy banaganapalle development works bypass shadi khana suchi ABN , Publish Date - May 25 , 2026 | 02:55 PM నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగా...