
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభపై తెలంగాణా రాజకీయ, మేధావి వర్గాల నుండి తీవ్ర వ్యక్తిరేకత వ్యక్తం అవుతుంది. పవన్ కళ్యాణ్ సభపై తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తున్న తీరును తీవ్రంగా ఎండగట్టారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నేతృత్వంలో ఈ సభ జరగనుంది.పవన్ కళ్యాణ్ ను విమర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తన స్పందనలో పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ,పవన్ కల్యాణ్ బీజేపీతో చేసుకున్న అవగాహన ప్రకారమే ఇక్కడికి వచ్చి సభలు నిర్వహించి, తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమే అని ఆరోపించారు.తెలంగాణను బీజేపీకి తాకట్టు పెట్టడమే పవన్ చెప్పే నవనిర్మాణమా అంటూ ప్రశ్నించారుగతంలో తెలంగాణాపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి పొన్నం గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రజల దృష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని ఆయన ఒకప్పుడు అన్నారు. అలాంటి వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.పవన్ కళ్యాణ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక తెలంగాణ ఏర్పడిన తర్వాత 11 రోజులు అన్నం మానేశానని పవన్ కల్యాణ్ గతంలో చెప్పారని, అలా చెప్పడం ఎంత బాధాకరం అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచే వ్యాఖ్యలు చేయడం మానాలని హితవు పలికారు. మా రాష్ట్రంలోకి వచ్చి రాజకీయ లాభాల కోసం సభలు పెట్టి, ప్రజల మధ్య విభేదాలు