
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు సరసన 'వారణాసి' అనే భారీ చిత్రం కోసం ఆమె హైదరాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం కాస్త సమయం దొరకడంతో పూర్తి రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లారు. తన సండే సరదాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.ఆదివారం సాయంత్రం ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారు. స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరుతున్న దృశ్యాలు, ఫేస్ మాస్క్‌తో స్కిన్‌కేర్ తీసుకుంటున్న ఫొటో, నేరేడు పళ్లు తింటున్న క్షణాలను ఆమె షేర్ చేశారు. "ఆదివారం అంటే ఇలా ఉండాలి.. ఇక వేసవి కోసం సిద్ధం" అనే క్యాప్షన్‌ను ఈ పోస్ట్‌కు జోడించారు. అంతేకాకుండా, అరుదైన నీలి రంగులో కనిపించి వార్తల్లో నిలిచిన పౌర్ణమి చంద్రుడి ఫొటోను కూడా ఆమె పంచుకున్నారు.ప్రియాంకకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో మరోసారి రుజువైంది. తన సోషల్ మీడియా స్టోరీస్‌లో పెద్ద స్క్రీన్‌పై ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను చూస్తున్న ఫొటోను షేర్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు మద్దతుగా ఒక స్టిక్కర్‌ను జోడించి, "ఫైనల్ చూడకుండా ఎలా ఉంటాం" అని రాసుకొచ్చారు. గత కొన్ని నెలలుగా ప్రియాంక తన వృత్తిపరమైన కమిట్‌మెంట్ల కోసం అమెరికా, భారత్ మధ్య ప్రయాణిస్తూనే ఉన్నారు. 'వారణాసి' షూటింగ్‌తో పాటు పలు అంతర్జాతీయ ప్రాజెక్టులతోనూ ఆమె బిజీగా ఉన్నారు.
