translateexpand_more

Good News News

Latest updates from Telugu Digital news sources.

Sakshi29 May, 12:14 pm
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో తొలి విడత రూ. 2,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన రూ.4000 కోట్లు కూడా త్వరలోనే జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్‌ (GPF) బకాయిలు 100 శాతం ప్రభుత్వం క్లియర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ (ఫొటోలు) ఎన్టీఆర్‌ పార్టీకి ఇదేం దుస్థితి? (చిత్రాలు) పూల చీరలో రాశీసింగ్ మరింత అందంగా (ఫొటోలు) కోడలు చనిపోతే.. ” మొక్కలకు నీళ్లు పోసేది కాదని అసలు వెటకారం ఏంటి స్టాక్ మార్కెట్ లో కాఫీ డే షేర్లకు రెక్కలు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ప్రీమియర్ షోస్ ఫిక్స్... నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ