translateexpand_more

Government Employees News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy31 May, 12:32 am
కొలువులో చేరిన చోటే రిటైర్మెంట్

ప్రభుత్వ కొలువంటే బదిలీలు సహజం. శాఖను బట్టి రెండేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య కనీసం ఒక్కసారైనా బదిలీ అవుతుంటారు. కానీ, వైద్యారోగ్యశాఖలో కొందరు ఉద్యోగంలో చేరినచోటే దశాబ్దాలుగా ..... వైద్యశాఖలో దశాబ్దాలుగా ఒకేచోట కొందరు వైద్యులు 10-30 ఏళ్ల వరకు బదిలీ కాని దాదాపు 100 మంది ఎక్కువ మంది హైదరాబాద్‌లోనే.. జాబితా విడుదల హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కొలువంటే బదిలీలు సహజం. శాఖను బట్టి రెండేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య కనీసం ఒక్కసారైనా బదిలీ అవుతుంటారు. కానీ, వైద్యారోగ్యశాఖలో కొందరు ఉద్యోగంలో చేరినచోటే దశాబ్దాలుగా తిష్టవేసి అక్కడే రిటైర్‌ అవుతున్నారు. కొందరు 30 ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పెద్దాస్పత్రుల్లో రెండున్నర దశాబ్దాలుగా పనిచేస్తున్న వైద్యులు ఉన్నారు. బదిలీ అన్న మాటే లేకుండా ఇలా 10 నుంచి 30 ఏళ్లుగా ఓకేచోట పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది 100 మందికిపైగానే ఉన్నట్లు లెక్క తేలింది. వైద్యశాఖలో ప్రభుత్వం తాజాగా సాధారణ బదిలీలు చేపట్టింది. నాలుగేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారి వివరాలను శనివారం విడుదల చేసింది. వైద్యవిద్య సంచాలకులు (డీఎంఈ), వైద్యవిధాన పరిషత్‌ (టీవీవీపీ), ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌), ఆయుష్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగాల్లో నాలుగేళ్లకు పైగా ఒకేచోట పనిచేస్తున్న వారి జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచింది. హైదరాబాద్‌లోనే పోస్టింగ్‌, ఇక్కడే రిటైర్మెంట్‌ డీఎంఈ, డీహెచ్‌ పరిధిలోని కొందరు వైద్యులు దీర్ఘకాలంగా హైదరాబాద్‌లోనే ఉండిపోతున్నారు. డీఎంఈ వైద్యుల్లో కొందరు హైదరాబాద్‌లో పోస్టింగ్‌ తీసుకొని, ఇక్కడే రిటైర్‌ అవుతున్నారు. స్పౌజ్‌, సంఘాల పేరుతో ప్రతిసారీ బదిలీల నుంచి మినహాయింపు పొందుతున్నారు. అలాగే సూపర్‌ స్పెషాలిటీకి సంబంధించిన పోస్టులు హైదరాబాద్‌ బయటి ఆస్పత్రుల్లో లేకపోవడంతో వారంతా ఇక్కడే ఉంటున్నారు. మెడికల్‌ ఆంకాలజీ, సర్జికల్‌

Zee Telugu31 May, 11:18 am
కార్డులు ఇవ్వకముందే కోతలు.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో పెరుగుతున్న ఆందోళన

Telangana EHS:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో ప్రస్తుతం EHS (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్) 1.5 శాతం కోతలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి మార్గదర్శకాలు, హెల్త్ కార్డుల పంపిణీ ఇంకా పూర్తికాకముందే జీతాల్లో కోతలు కనిపిస్తున్నాయని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం అప్‌లోడ్ అవుతున్న పేస్లిప్‌లలో EHS పేరుతో 1.5 శాతం కోతలు నమోదవుతున్నాయి. అయితే ఇది కేవలం సాంకేతిక పరీక్షలో భాగమా లేక నిజంగానే అమలులోకి తీసుకొచ్చారా అనే విషయంలో స్పష్టత లేదని వారు పేర్కొంటున్నారు. మరోవైపు, భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న కుటుంబాల్లో కూడా ఇద్దరి జీతాల నుంచి కోతలు పడుతున్నట్లు సమాచారం వస్తోంది. సాధారణంగా ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే కోత ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఇద్దరికీ కోతలు కనిపిస్తున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు చెబుతున్న వివరాల ప్రకారం, ఇంకా అనేక ఆస్పత్రులతో ఒప్పందాలు పూర్తి కాలేదని, హెల్త్ కార్డుల పంపిణీ ప్రక్రియ కూడా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని అంటున్నారు. అలాగే ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, డీడీఓలకు స్పష్టమైన సూచనలు అందించకుండా కోతలు విధించడం సరైన విధానం కాదని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ నాయకులు కటకం రమేష్, మారెడ్డి అంజిరెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో అనేక సందేహాలు ఉన్నాయని, ప్రభుత్వం త్వరగా స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు, విద్యా విధానంపై స్పష్టత వంటి పలు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు గుర్తుచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో EHS కోతల అంశం కొత్త ఆందోళనకు కారణమైందని చెబుతున్నారు. అయితే EHS

Sakshi29 May, 12:14 pm
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. 100 రోజుల్లో రూ.6,000 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో తొలి విడత రూ. 2,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన రూ.4000 కోట్లు కూడా త్వరలోనే జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్‌ (GPF) బకాయిలు 100 శాతం ప్రభుత్వం క్లియర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ (ఫొటోలు) ఎన్టీఆర్‌ పార్టీకి ఇదేం దుస్థితి? (చిత్రాలు) పూల చీరలో రాశీసింగ్ మరింత అందంగా (ఫొటోలు) కోడలు చనిపోతే.. ” మొక్కలకు నీళ్లు పోసేది కాదని అసలు వెటకారం ఏంటి స్టాక్ మార్కెట్ లో కాఫీ డే షేర్లకు రెక్కలు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ప్రీమియర్ షోస్ ఫిక్స్... నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ

10TV Telugu27 May, 01:39 pm
వ వేతన సంఘంపై గేమ్ చేంజర్ అప్ డేట్.. ఈసారి డబుల్ కాదు ట్రిపుల్ కాదు.. 400 శాతం

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారుల్లో బిగ్ టెన్షన్.. ఈసారి 8వ వేతన సంఘంపై ప్రభుత్వ ఉద్యోగుల అంచనాలు భారీగా పెరిగాయి. ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (IRTSA) ఇచ్చిన కొత్త ఫార్ములా ప్రకారం.. ఉద్యోగ స్థాయిని బట్టి వేర్వేరు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లు పెట్టాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇదిగానీ అమలైతే కొంతమంది సీనియర్ అధికారుల కనీస జీతాలే 400 శాతం వరకు (8th Pay Commission) పెరిగే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. దీని కారణంగా కేంద్ర ప్రభుత్వంపై అధిక భారం పడొచ్చనే ఆందోళన కేంద్రంలో పెరుగుతోంది. సాధారణ వేతన సవరణ బదులుగా వివిధ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అనేక భారీ ప్రతిపాదనలను సమర్పించాయి. ప్రభుత్వ వర్గాలకు, ఉద్యోగ సంఘాలకు మధ్య జరిగిన చర్చలు, గత వేతన సంఘాలతో పోలిస్తే ఈసారి ఉద్యోగుల అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని స్పష్టంగా సూచిస్తున్నాయి. ఇంత భారీ జీతాలు, పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే ప్రత్యక్ష ప్రభావమే ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారనుంది. అందుకే, కమిషన్‌లో దీనిపై పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి. వేర్వేరు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కు డిమాండ్ : ఇకపై ఉద్యోగులందరికీ ఒకే విధమైన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను వర్తింపజేసే పరిస్థితి ఉండకపోవచ్చు. వివిధ వేతన స్థాయిల ఆధారంగా వేర్వేరు గుణకాలను వర్తింపజేయాలని ఐఆర్‌టీసీఏ ప్రతిపాదించింది. ఒకటి నుంచి 5 లెవల్‌కు 2.92, 6 నుంచి 8 లెవల్‌కు 3.50, 9 నుంచి 12 లెవల్‌కు 3.80, 13 నుంచి 16 లెవల్‌కు 4.09, అత్యంత సీనియర్ లెవల్‌కు 17, 18 లకు 4.38 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సంస్థ డిమాండ్ చేసింది. ఈ ఫార్ములా ప్రభావం భారీగా ఉండవచ్చు. ఉదాహరణకు..