translateexpand_more

Govt Jobs News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu02 Jun, 09:09 am
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఈ శాఖల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

Telangana Govt : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. కొత్తగా మూడు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మూడు నోటిఫికేషన్లకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీశాఖ, టౌన్ అండ్ కంట్రీప్లానింగ్, విద్యాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. Also Read : KTR : తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. కేటీఆర్ కీలక కామెంట్స్.. అందుకే సింహం తన కథ తను చెప్పుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 3,800 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. ప్రస్తుతం మూడు కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. వీటిలో ఆర్‌అండ్‌బీ పరిధిలో 222 ఏఈ (సివిల్‌), ఏఈ (ఎలక్ట్రికల్‌) 49, కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోని తొమ్మిది అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెలాఖరులో మరో మూడు నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం 28 కేటగిరీల పోస్టుల్లో ఒక్కొక్క ఖాళీ చొప్పున, మరో 25 కేటగిరీల పోస్టుల్లో ఐదు కంటే తక్కువ చొప్పున ఖాళీలు ఉన్నట్లు చైర్మన్ బుర్రా వెంకటేశం వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లను వరుస క్రమంలో తీసుకువచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయపరమైన సమస్యలు లేకుండా అత్యంత పారదర్శకంగా 67వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పీసీబీ, అటవీశాఖ, టౌన్ ప్లానింగ్, విద్యాశాఖలో ఉద్యోగాలకు మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయి. ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్3, గ్రూప్4తో పాటు మెగా డీఎస్సీ, వైద్యారోగ్య శాఖలో వరుసగా నియామకాలను చేపట్టామని, రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.