
CM Revanth Reddy: హీరో నాని స్పెషల్ రిక్వెస్ట్.. స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
CM Revanth Reddy : హీరో నాని స్పెషల్ రిక్వెస్ట్.. స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
© 2026 telugu.digital

CM Revanth Reddy : హీరో నాని స్పెషల్ రిక్వెస్ట్.. స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు

CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Minister Konda Surekha targets cm revanth reddy: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వివాదం అంశంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే కొండా సురేఖ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయ్యారు. అంతే కాకుండా.. సీఎం రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. పదేండ్ల పాటు తానే సీఎం అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని, తొలుత చర్యలు ఆయనపై తీసుకొవాలని ఏకీపారేశారు. బీసీ బిడ్డకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా అంటూ ఫైర్ అయ్యారు. ఇక తాజాగా.. మరల మీడియా సమావేశంలో కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలతో మా మీద బలవంతంగా మాట్లాడించారన్నారు. ఎవరూ స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడలేదు.. ఫోన్ చేసి పిలిస్తే బలవంతంగా వెళ్లామని వాళ్లే చెబుతున్నారన్నారు. వెనకనుండి మాట్లాడించిన వాళ్ల పేర్లు చెప్పదలుచుకోలేదన్నారు. కానీ ఎవరు చెప్పించారో మాకు తెలుసని కొండాసురేఖ పేర్కొన్నారు. నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడిందన్నారు. తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టమన్నారు. నేను బీసీ మహిళా మంత్రిని.. నా భర్త మున్నూరు కాపు, నేను పద్మశాలి కులమని, మా కులం ఓట్లు 16 శాతం ఉన్నాయన్నారు. నా మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా నా శాఖను నిర్వహిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఒకపక్క కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేదని గొడవ నడుస్తుందన్నారు. అసలు తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్పని మాట్లాడారు. నన్ను ఏమైనా చేయాలి

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్లో బుధవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఢిల్లీ, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఢిల్లీలోని పౌర విమానయాన శాఖ కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్లో ఈరోజు (బుధవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. తెలంగాణలో ఆదిలాబాద్, మామూనురు (వరంగల్) విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలని కోరారు. మామూనురు విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణను పూర్తి చేసి ఇచ్చామని కేంద్రమంత్రికి.. సీఎం రేవంత్ తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్, ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్) వసతులు ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్‌లో రన్ వే ఫైనలైజ్‌కు సంబంధించి రక్షణ, పౌర విమానయన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మామునూరు ఎయిర్పోర్ట్ టెండర్లను రెండు వారాల్లో పిలిచి డిసెంబర్ నాటికి ఖరారు చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ వెల్లడించారు. ఆ పనులకు అదే నెలలో శంకుస్థాపన చేస్తామని రామ్మోహన్ తెలిపారు. తెలంగాణలో ఛాపర్ల ద్వారా హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌కు.. సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. హెలీ టూరిజంతో తెలంగాణలో పర్యాటక రంగం మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. హుస్సేన్ సాగర్‌లో సీ ప్లేన్ ల్యాండింగ్‌కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేశ్ షెట్కార్, ఎం.అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) హర్కార వేణుగోపాల్, రాష్ట్ర

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Jagga reddy Strong counter on brs ktr: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల ఫిరంగులు పేలుతున్నాయి. ఒకరిపై మరోకరు పదునైన విమర్శనాస్త్రాల్ని సంధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పాలనపై బీఆర్ఎస్ చార్జీషీట్ విడుదల చేసింది. దీనిలో కేటీఆర్ కాంగ్రెస్ పాలనను ఉతికి ఆరేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కిండ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అని కొనియాడారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం లో స్వేచ్ఛ లేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన లో ఉద్యోగాలు భర్తీ జరగలేదన్నారు. 70 వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం అదించిందని చెప్పారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లో స్వేచ్ఛ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలన లో పోలీసుల నిర్బంధాలు లేవన్నారు. పద్దతి లేని కుటుంబం పద్దతిగల కుటుంబం పై మాట్లాడుతుందని కేటీఆర్ పై సెటైర్ లు వేశారు. అసలు.. రాహుల్ పై మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు కేటీఆర్ అంటూ ఏకీపారేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు. హైదరాబాద్, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు(బుధవారం) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సురేఖ మాట్లాడుతూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదని అన్నారు. అధిష్ఠానం ఏం చేస్తుందో వేచిచూస్తున్నట్లు తెలిపారు. రాజీనామా చేయాలని తనను కోరలేదని చెప్పారు. బీసీ అయిన తనకు ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయం పాటిస్తారా అని కొండా సురేఖ ప్రశ్నించారు. కేబినెట్లో ఉన్న ఇతర సామాజికవర్గాల నేతలపై పెద్దఎత్తున అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటన్నింటికీ ఏం సమాధానం చెబుతారని.. ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడిగారు. అన్ని అంశాలపై ఇప్పటికే ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా అధిష్ఠాన పెద్దలందరికీ రాతపూర్వకంగా తెలియజేసినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌పై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదేళ్లు తానే సీఎం అని రేవంత్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఖర్గేకు చెప్పినట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గొల్లగుప్ప ఘటన..చిన్నారి మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్టే కీలకం: ఆస్పత్రి సూపరింటెండెంట్ కేటీఆర్ మహాధర్నా.. ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Minister Konda Surekha sensational comments on cm revanth reddy: మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఏఐసీసీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. అంతే కాకుండా తన వ్యక్తిగత పనుల కోసమే ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం తనను పిలవలేదని కాసేటికి క్రితం చెప్పారు. అయితే.. తాజాగా.. మంత్రి కొండా సురేఖ చిట్ చాట్ లో మీడియాతో మాట్లాడారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునేముందు సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఆయన .. పదేళ్ల పాటు తానే సీఎం అని చెప్పుకుంటున్నారని అన్నారు. మంత్రులు, నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారని ఢిల్లీ వేదికగా తిరుగుబావుట ఎగురవేశారు. తనను రాజీనామా చేయమని ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం చెప్పలేదన్నారు. అంతే కాకుండా వివాదాలల్లో.. బీసీ బిడ్డకు ఒక న్యాయం, ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా?.. అంటూ ఫైర్ అయ్యారు. పలువురు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటికి ఏం సమాధానం చెబుతారు?.. ఏం చర్యలు తీసుకుంటారు?.. అంటూ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అధిష్టానంపై తన ధిక్కార స్వరం వినిపించారు. అంతే కాకుండా తన వివాదంకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ కు అన్ని విషయాల్ని రాతపూర్వకంగా తెలియజేసినట్లు మంత్రి కొండాసురేఖ తెల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లో మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో హీట్ ను పెంచేశాయి. ఇప్పటి వరకు తెలంగాణలో సీఎం రేవంత్ పై మండిపడిన మంత్రి కొండా
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65)పై ప్రయాణించే వాహనదారులతో పాటు నకిరేకల్ పరిసర ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 100 పడకల ఆస్పత్రిని ఈనెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే నకిరేకల్‌తో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువ కానున్నాయి.నకిరేకల్‌లో గతంలో పరిమిత వసతులతో ఉన్న ఆస్పత్రి ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయేది. రోజుకు 350 నుంచి 500 వరకు ఓపీ నమోదవుతున్న నేపథ్యంలో ఆస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత నేషనల్ హైవే పక్కనే రూ.32 కోట్లతో కొత్త భవనాన్ని నిర్మించారు. నిర్మాణ పనులు సుమారు 5 నెలల క్రితమే పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రికి రోజుకు 200 నుంచి 250 వరకు ఓపీ వస్తోంది.పూర్తి స్థాయి వైద్య సేవలు ప్రారంభమైతే రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను నల్గొండ, హైదరాబాద్‌కు తరలించాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో కీలకమైన గోల్డెన్ అవర్‌లో వైద్యం అందక ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉండేది. ఈ సమస్యకు కొత్త ఆస్పత్రి పరిష్కారం చూపనుంది. అత్యవసర వైద్యం, ట్రామా కేర్, ఐసీయూ, ఆర్థోపెడిక్ సేవలతో పాటు సాధారణ శస్త్రచికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.గర్భిణులకు ప్రసూతి సేవలు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువుల కోసం ప్రత్యేక వైద్య సేవలు కూడా కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. డిజిటల్ ఎక్స్‌రే, స్కానింగ్ సదుపాయాలు, 24 గంటల పాథాలజీ ల్యాబ్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tummidihatti: ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి కోరింది తెలంగాణ సర్కార్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇరు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య తొలివిడత చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షత వహించగా.. తెలంగాణ తరపున నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాధ్ దాస్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, మహారాష్ట్ర నుంచి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అయితే సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జరిగిన తొలి విడత చర్చలు అర్థవంతంగా ముగిసాయని తెలంగాణ అధికారులు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత, చేవేళ్ల సుజల స్రవంత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అయితే గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ 148 మీటర్ల ఎత్తులో మాత్రమే బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. అయితే ఈ ఎఫ్ఆర్ఎల్ ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు సరిపోదని సర్కార్ భావిస్తోంది. ఈ విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఒక లేఖ రాసింది. అదే సమయంలోప్రధానమంత్రి మోదీకి, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసిని తెలంగాణ ప్రభుత్వం.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో.. ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో.. తెలంగాణ 152 మీటర్ల పూర్తి వరద మట్టం (FRL)తో తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించగా.. ఈ ప్రతిపాదనపైనే విస్త్రుతంగా చర్చ జరిగింది. 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ వల్ల మహారాష్ట్రలో మునిగిపోయే ప్రాంతాలు, ప్రాణహిత

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Free onions distribution in Warangal: గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఉల్లి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. చాలా మంది వంటింట్లో ఉల్లిపాయలను తప్పకుండా ఉపయోగిస్తారు. ఉల్లి ధరలు పెరిగిపోతుండటంతో జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయ్యింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు వెరైటీగా కార్యక్రమాలు చేపట్టారు. వరంగల్‌లో కాంగ్రెస్ నేత రాజనాల శ్రీహరి కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజాపాలన నేపథ్యంలో..ఉచితంగా ఉల్లిగడ్డల పంపిణిని చేశారు. ట్రాలీలో ఉల్లిగడ్డ సంచులను తీసుకొనివచ్చిసీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిరోడ్డు మీద పంపిణి చేపట్టాడు. దీంతో జనాలు ఉల్లిపాయల ప్యాకెట్ ల కోసం భారీగా క్యూలు కట్టారు. Read more: Konda Surekha: కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు.. సుష్మిత వివాదంపై హీటెక్కిన రాజకీయాలు.!. ఉల్లిగడ్డలు తీసుకునేందుకు ఒకరినొకరు తోసుకోవడంతో గందరగోళల పరిస్థితి ఏర్పడింది.ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో అక్కడున్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ నేత నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్ధి పార్టీ ని టార్గెట్ చేయటానికి కొత్త ప్లాన్ చేశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చెయ్యాలని, నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన క్రమంలో ఆయన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంను టార్గెట్ చేశారు. కేసీఆర్ ప్రజా సమస్యల కోసం పని చేయకపోతే ప్రతిపక్ష నేత ఎలా అవుతారని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ రిజైన్ చెయ్యాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ గత వెయ్యి రోజుల్లో ఏం చేశారు? సీఎం రేవంత్ విమర్శలు తాజాగా అంబర్‌పేటలో మూసీ నదిపై రూ.52 కోట్లతో నిర్మించిన కొత్త వంతెనను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే జరిగిన ప్రజా సభలో బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఒక ఉద్యోగి ఏడాది పని చేయకపోతే తొలగిస్తారు. కానీ కేసీఆర్ గత వెయ్యి రోజుల్లో జీతం, భద్రత, వాహనాల కోసం ప్రభుత్వం నుంచి కోట్లు తీసుకున్నారు.మూడేళ్ళలో కేసీఆర్ తీసుకున్న జీతం, భద్రతకు అయిన ఖర్చుల లెక్క చెప్పిన సీఎం ఈ మూడేళ్ళలో కేసీఆర్ ఒక కోటి 84 లక్షల, 40 వేలు జీతంగా తీసుకున్నారని, వాహనాలు భద్రతా సిబ్బంది కోసం ప్రభుత్వం ఇప్పటివరకు 22 కోట్ల 24 లక్షల 40 వేల రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు. అయినా ఒక్క రోజు కూడా ప్రజల కోసం, రాష్ట్రం కోసం బయటకు రాలేదు. ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారు. వెంటనే రాజీనామా చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి కేసీ ఆర్ ను టార్గెట్ చేశారు.కేసీఆర్ రాజీనామా చెయ్యాలన్న డిమాండ్ తో ర్యాలీలు కేసీఆర్ రాజీనామా డిమాండ్ తో కాంగ్రెస్ కార్యకర్తలు సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు మండల, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని, 6న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద సభ నిర్వహించాలని పిలుపునిచ్చారు. 7 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ తప్పక రావాలని, పదేళ్ల పాలన

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Mla Vemula Prashanth reddy fires on kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కాక రేపుతున్నాయి. అన్ని పార్టీలు కూడా పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఫుల్ కాక మీదున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే.. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారంగా మారాయి. కవిత మాట్లాడుతూ.. వేముల ప్రశాంత్ రెడ్డి శకుని లాంటి వాడని అన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులనైన వదిలేస్తానేమో కానీ వేముల ప్రశాంత్ రెడ్డిని మాత్రం వదలనని ఆయనకు తన ఉసురు తగులుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా.. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. కవిత వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. గతంలో తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ను పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఏంపీకారంటూ మాట్లాడిన విషయంను గుర్తుచేశారు. అంతే కాకుండా కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయడం రావట్లేదని విమర్శించారని అన్నారు. సొంత వాళ్లనే కవిత ఇష్టమున్నట్లు మాటలన్నప్పుడు తామ మీద అనడంలో ఆశ్చర్యమేముందని ఆరోపణలను కొట్టిపారేశారు. కవిత మాటలకు కేసీఆర్ ఎంతో మనో వేదనకు గురౌతున్నారని అన్నారు. కవితను కేసీఆర్‌ను కలపడానికి ప్రయత్నం చేసిన, విడగొట్టడానికి చూశాడో అన్న విషయం కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు. పార్టీ లైన్ దాటడం వల్ల కేసీఆర్ కవితపై వేటు వేశారన్నారు. 2001 తెలంగాణ ఆవిర్భావానికి ముందే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని, టీఆర్ఎస్ అంటేనే ప్రశాంత్‌రెడ్డి

Nakrekal: నకిరేకల్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన వీరేశం! Nakrekal: నకిరేకల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నకిరేకల్ పర్యటన నేపథ్యంలో మినీ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను చేస్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం. కలెక్టర్ చంద్రశేఖర్ , ఎస్పీ శరత్ చంద్ర పవర్ వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుందని, గత విధ్వంస పాలన నుంచి వికాసం వైపు రాష్ట్రం సాగుతోందని అన్నారు. సీఎం పర్యటనలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఉంటాయని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని, డబుల్ బెడ్రూం, ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి వంటి హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడలేదని, వారు సభకు రానందున దళిత నేతకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదని అన్నారు. సీఎం సభను ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ 1000 రోజుల్లో రూ.1,24,40,000 జీతం తీసుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నేను.. నా ముసల్ది అని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మొత్తం తన కుటుంబాన్ని రంగంలోకి దించి రాష్ట్రాన్ని దోచుకున్నాడని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం గుంపు మందలా జమై మంది సొమ్ము తిన్నారని.. ఇప్పటికీ తింటున్నారని కీలక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయింది.. ఇన్నిరోజులు కేసీఆర్ విధులకు హాజరుకాకుండానే ఏకంగా రూ.12400000 జీతం తీసుకున్నాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.కేసీఆర్ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం రూ. 21 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే మొత్తంగా రూ. 22.24 కోట్ల ప్రభుత్వ సొమ్మును మెక్కేసిన కేసీఆర్ ఒక్కసారైనా ప్రజల గురించి ఆలోచించారా..? ఎక్కడైనా ప్రభుత్వాల వైఫల్యం చూశాం. కానీ ఇక్కడ విపక్షం వైఫల్యం చెందినందున ప్రతిపక్ష నేత రాజీనామా చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 1 నుండి 6 వరకు అంటే ఈ వారమంతా కేసీఆర్ రాజీనామాను డిమాండ్ చేస్తూ నిరసనలు తెలియజేయాలని రేవంత్ పిలుపునిచ్చారు.అలాగే మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. కేసీఆర్ రాజీనామా చేసేవరకు ఉద్యమించాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంబర్‌పేట- ముసారాంబాగ్ మధ్య మూసీ నదిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కేసీఆర్ కు నిజంగా తెలంగాణపై గౌరవం ఉంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన అలాగే తమ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్దమా అని సీఎం రేవంత్ సవాల్ విసిరారు.రూ.22 కోట్ల ప్రజల సొమ్ము తిన్న కేసీఆర్ ఏ ఒక్క రోజూ

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pcc chief Mahesh kumar goud reacts on Konda Sushmitha Comments: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొండా సురేఖ, కొండా సుష్మిత వివాదం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ డిసిప్లినరీ కమిటీ సైతం సీరియస్ అయ్యింది. ఎంపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడుతూ..కొండా సురేఖ ఇచ్చిన రీప్లై చూశామన్నారు. కొండాసుష్మిత సీఎం రేవంత్ రెడ్డిని మాములు వ్యక్తి గా అనుచిత వాఖ్యలు చేశారన్నారు. దీనిపై అందరూ ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎవరైన పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవన్నారు. కొండా సుస్మిత పార్టీ లైన్ దాటి నేరుగా ఆరోపణలు చేశారని పీసీసీ చీఫ్ చెప్పుకొచ్చారు. అనిరుధ్, రాజగోపాల్ డైరెక్ట్‌గా విమర్శలు చేయలేదని మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ లో మాట్లాడారు. మంత్రి కొండా సురేఖను గతంలో కాపాడామని.. ఇప్పుడు అవకాశం లేదన్నారు. Read more: Naveen Kumar Yadav: సీఎం పట్ల అగౌరవంగా మాట్లాడితే సహించం.!. కొండా సురేఖ వివాదంపై రంగంలోకి నవీన్ కుమార్ యాదవ్..! కొండా సురేఖపై అధిష్టానం సీరియస్‌గా ఉందన్నారు. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత లైన్ దాటి ఆరోపణలు చేశారని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. కానీ రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి లైన్ దాటలేదన్నారు. పార్టీ లైన్ ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని చిట్ చాట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Mla Naveen kumar Yadav reacts konda Sushmita row: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ, కొండా సుష్మిత అంశం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఇప్పటికే పీసీసీ డిసిప్లీనరీ కమిటీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. దీనిపై వెంటనే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక మంత్రి కొండా సురేఖ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి వచ్చాక అన్ని విషయాల్ని కలిసి చెప్తానని కూల్ గా చెప్పారు. ఈ వివాదంపై అనేక ఊహగానాలు రాజకీయా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ వివాదంపై తాజాగా.. జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ స్పందించారు. కొంత మంది నేతలు కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంను బలహీనపర్చేవిధంగా కుట్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ గా, ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెస్ ను అధికారంలోకి తెవడానికి ఎంతో శ్రమించారన్నారు. ప్రజలకు ఇచ్చిన పథకాల హమీలను నెరవెర్చే విధంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. అనేకమంది యువకులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకోసం అందుబాటులో శ్రమించినవారిని గుర్తిస్తు.., ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా, పలు బాధ్యతలు అప్పగించిందని చెప్పారు. బీసీ నాయకుడిగా తనను కూడా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించిందని చెప్పారు. కష్ట పడితే పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని అన్నారు. రెండేళ్ల తర్వాత వచ్చే

Konda Surekha Daughter Issue : ఎస్.. ఇట్స్ టైమ్ టు కైమాక్స్. జరగాల్సిన రచ్చ అంతా జరిగిపోయింది. ఒకటి రెండు కాదు.. నాలుగైదు ఇష్యూస్ అయిపోయాయి. సర్దిచెప్పాం.. సర్దుకుపోయాం. కొండా సురేఖ విషయంలో ఇక ఎంతమాత్రం ఉపేక్షించాల్సిన పనిలేదంటున్నారు హస్తం పార్టీ నేతలు. ఏకంగా సీఎం రేవంత్, అతని సోదరులను ఉద్దేశించి కొండా కూతురు సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏకంగా సీఎం రేవంత్ ఇగోను టచ్ చేసేలా సుస్మిత మాట్లాడారని పార్టీలోనే చర్చ జరుగుతోంది. సుస్మిత కామెంట్స్‌పై క్రమశిక్షణ కమిటీ నోటీసులకు కొండా సురేఖ ఇచ్చిన రిప్లైపై కూడా పార్టీ పెద్దలు సంతృప్తి చెందలేదట. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఎన్నడూలేని విధంగా దాదాపు 25మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా ముందుకు వచ్చి డైరెక్ట్‌గా సీఎం రేవంత్ మనసులో ఉన్న ఆలోచనను బహిరంగం చేశారు. క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్పుపట్టారు. కాంగ్రెస్ శాసనసభాపక్షంలో ఏకంగా 25 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ పెట్టారు. మంత్రి కొండా సురేఖ సొంత కూతురు ఏకంగా సీఎంను టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడితే.. మంత్రిగా ఉన్న కొండా సురేఖ కనీసం ఖండించకపోగా.. తనకేం సంబంధం అంటూ రిప్లయ్ ఇవ్వడం ఏంటంటూ మండిపడ్డారు. ప్రభుత్వ అధినేతగా ఉన్న సీఎంను బలహీనపరిచే కుట్ర జరుగుతుందని ధ్వజమెత్తారు. పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. పార్టీ అధిష్టానానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. సొంత కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి సురేఖ బహిరంగ క్షమాపణచెప్పాలని అంటోంది రేవంత్ వర్గం. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. సీఎంను బలహీన పరిచాలనే ప్రతిపక్షాల కుట్రకు.. కొండా సురేఖ అండగా నిలుస్తోందని విమర్శించారు. అంతేకాదు ఆమె వెనుక తమ పార్టీలోని కొన్ని గుంటనక్కలున్నాయంటూ

తెలంగాణను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో పర్యటిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి సందర్శించారు. దాదాపు 900 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయంలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను సందర్శించి, ప్రొఫెసర్ మాయా ట్యూడర్, ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీలతో పాలన, విద్య, ప్రజా విధానాలపై విస్తృతంగా చర్చించారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చదువుకున్న ఈ విశ్వవిద్యాలయంతో భారత్‌కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.హైదరాబాద్ కు ఆక్స్ఫర్డ్ బృందంతెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్‌జీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న పలు అవకాశాలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను తెలంగాణ బృందం ఆహ్వానించింది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చారిత్రక సోమర్విల్ కాలేజీని సందర్శించారు. ఈ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటాన్ని సందర్శించారు. 2002లో సోనియా గాంధీ ఈ చిత్రపటాన్ని సోమర్విల్ కాలేజీకి బహూకరించిన విషయం తెలిసిందే. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి అందుకే ఇవ్వలేదు- రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!అనంతరం ముఖ్యమంత్రి, అక్కడే జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్‌ను సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి అక్కడి సమగ్ర క్రీడా సదుపాయాలను పరిశీలించారు. ఈ ప్రాంగణంలో గోల్ఫ్ కోర్స్‌తో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, హోటల్ ఉన్నాయి. తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. konda surekha reacts on her daughter sushmita controversy: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కొండా సురేఖ ఫ్యామిలీ చుట్టు తిరుగుతున్నాయి. ఇప్పటికే కొండా సురేఖ కూతురు వరంగల్ జిల్లా గీసు కొండలో సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టిని కలవరపెట్టేదిగా మారాయి. అంతే కాకుండా ఏకంగా సీఎంను సుష్మిత టార్గెట్ చేసి మాట్లాడటం, ఆయన ప్రతిష్టను అభాసుపాలు చేసేలా ఉండటంతో తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ సైతం సీరియస్ అయ్యింది. దీనిపై ఇప్పటికే క్రమశికణ కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్ గా కొండా సురేఖ తన కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్నారు. ఇక దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగారు. మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఏంజరుగబోతుందని రచ్చ మొదలైంది. ఇక దీనిపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఆయనను కలిసి అన్ని విషయాలు బైటపెడతానని అన్నారు. ఇప్పటికే క్రమశికణ కమిటీకి చెప్పాల్సింది చెప్పానని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మా ఇంట్లో పూజలతో బిజీగా ఉన్నానని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వివాదంపై మాట్లాడేందుకు కొండా సురేఖ ఆసక్తిని చూపించలేదు. Read more: Konda Surekha: కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి.! . సీఎల్పీ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం.. మరోవైపు కొండా సుష్మిత తనకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక

ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు కేంద్ర విదేశాంగ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. యూకే, అమెరికా పర్యటనలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొంతకాలం క్రితమే కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అయితే రేవంత్‌రెడ్డి యూకే పర్యటనకు అనుమతి లభించగా.. అమెరికా పర్యటనకు మాత్రం పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు. అమెరికాలో పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం కార్యాలయం షెడ్యూల్ రూపొందించింది. ప్రముఖ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు, తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటుపై చర్చలు జరపాలని ప్రభుత్వం భావించింది. చివరికి అనుమతి రాకపోవడంతో సీఎం అమెరికా వెళ్లే కార్యక్రమం రద్దయింది. అమెరికా పర్యటనకు అనుమతి రాకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటనను రాజకీయ కోణంలో అడ్డుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకురావడం, రాష్ట్ర యువతకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం తన పర్యటన ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు. విద్య, నైపుణ్యాలు, శిక్షణ రంగాల్లో అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్నది తన లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తన విదేశీ పర్యటన ద్వారా తెలంగాణతో పాటు దేశానికీ ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దయినప్పటికీ అధికారుల బృందాన్ని మాత్రం అమెరికాకు పంపాలని సీఎం నిర్ణయించారు. ముందుగా రూపొందించిన కార్యక్రమాలను కొనసాగించాలని, ప్రతిపాదిత ఒప్పందాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హార్వర్డ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో భాగస్వామ్యాలపై చర్చలు జరపాలని సూచించారు. తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు అందేలా ఎంవోయూలు కుదుర్చుకోవాలని ఆదేశించారు