translateexpand_more

Telangana Formation Day Celebrations News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu02 Jun, 01:32 pm
నిరుద్యోగులకు బంపర్ శుభవార్త.. నుంచి ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

TGPSC announces three govt job notifications: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వేళ టీజీపీఎస్సీ మూడు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ క్రమంలో నిరుద్యోగులు మాత్రం టీజీపీఎస్సీ చెప్పిన మాటలు నిలబెట్టుకొవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పార్టీలకతీతంగా నేతలు తమపార్టీ ఆఫీసుల్లో, వివిధ ప్రాంతాల్లో జెండాలను ఎగుర వేశారు. మరోవైపు తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల త్యాగాలను కూడా స్మరించుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం జాబ్ నోటిఫికేషన్ పై టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మూడు నోటిఫికేషన్లను ప్రకటించింది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులో రోడ్లు భవనాల శాఖలో ఈఏఈ 222, సివిల్ 49 ఉద్యోగాలు ఉన్నాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడు బుర్రా వెంకటేశం తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలో 3800 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని.. వీటి భర్తీకి త్వరలో నోటిఫికేషన్స్ ఇస్తామని వెంకటేశం కీలక ప్రకటన చేశారు. టీజీపీఎస్సీ చెప్పిన విధంగానే మూడు నోటిఫికేషన్లను విడుదల చేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు సంబరాల్లో మునిగి తెలుతున్నారు. ఇందులో రోడ్లు భవనాల శాఖలో ఈఏఈ 222, సివిల్ 49, పోస్టులతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి వయోపరిమితి 18 నుంచి 44 ఏళ్లుగా నిర్ణయించారు. అంతే కాకుండా.. సివిల్ పోస్టులకు జూన్ 6 నుంచి 13 వరకు, ఎలక్ట్రిక్ పోస్టులకు జూన్ 8 నుంచి జులై 15 వరకు అప్లై చేసుకొవచ్చు. ఆ తర్వాత.. ఎన్విరాన్ మెంటల్ పోస్టులకు జూన్ 10 నుంచి జులై 17 వరకు అప్లై చేసుకొవచ్చు. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన అర్హతలు, ఎగ్జామ్ విధానం, సిలబస్ ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో కోరింది. గత కొన్ని ఏళ్లుగా నిరుద్యోగ యువతీ, యువకులు అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ లలో హస్టల్ లలో, రూమ్ లలో ఉంటూ, కొంత మంది పార్ట్ టైమ్ లో జాబ్ లు చేస్తు మరీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో గతంలో పలు మార్లు నోటిఫికేషన్ ల కోసం అభ్యర్థులు అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ లలో రోడ్డు మీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీల మేరకు అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో ఒకేసారి మూడు నోటిఫికేషన్లు విడుదల కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ప్రతినెల ఇప్పటి నుంచి నోటిఫికేషన్ లు విడుదల చేసేలా టీజీపీఎస్సీ చర్యలు తీసుకుంటుందని, ఈ ఎగ్జామ్ లు కూడా పూర్తిగా పారదర్శకంగా ఎలాంటి అక్రమాలు జరక్కుండా నిర్వహిస్తామని టీజీపీఎస్సీ తెల్చి చెప్పింది. ఎలాంటి ఫెక్ ప్రచారాలు, పుకార్లను నమ్మోద్దని టీజీపీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థుల్ని ఒక ప్రకటనలో కోరింది.

10TV Telugu02 Jun, 06:50 am
తెలంగాణ భవన్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. కేటీఆర్ కీలక కామెంట్స్.. అందుకే సింహం తన కథ

KTR : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. అనంతరం పలువురు తెలంగాణ కళాకారులను కేటీఆర్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. Also Read : Pawan Kalyan : అటు సభకు నో పర్మిషన్.. ఇటు తెలంగాణ ఆవిర్భావం వేళ పవన్ కామెంట్స్.. ‘ఈ నేల నుంచే..’ వేటగాడు చెప్పే పిట్టకథలు నిజం కావొద్దు అనుకుంటే సింహం తన కథ తను చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ గురించి మనమందరం చెప్పుకోవాలని అన్నారు. 2028 డిసెంబర్‌లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. అందరి జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆర్. అబద్ధాలు, అభూత కల్పనలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని వదిలించుకుంటుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కొనితెచ్చుకున్నారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణను మరో 20 యేండ్లు వెనక్కి నెట్టింది. కేసీఆర్ హయంలో వడ్డించిన విస్తరాకును కుక్కలు చింపిన విస్తరాకుల రేవంత్ రెడ్డి చేశాడు అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. యూరియా ఇవ్వని చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంటలు కొనలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ ఎక్కడ? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ మొత్తం సంక్షోభంలో కూరుకొని పోయింది. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్క ఇటుక పెట్టకుండా 4 లక్షల కోట్ల అప్పు చేశారు. రైతు బంధు బంద్ ఆగింది, రాహుల్ బంద్ కొనసాగుతుంది. అధికారంకోసం ఆరాటం ఏం లేదు, అధికారం వస్తే వస్తుంది లేకపోతే లేదు. పుష్కర తెలంగాణ దురదృష్టవశాత్తూ ముష్కరులపాలైందన్న కేటీఆర్.. మనమందరం కలిసి తెలంగాణను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

10TV Telugu02 Jun, 03:48 am
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. పరేడ్ మైదానంలోని వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Telangana Formation Day Celebrations : తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. జాతీయ పతాకం ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. జిల్లాల్లో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. Also Read : Divvala Madhuri : తెలంగాణ రాజకీయాల్లోకి దివ్వల మాధురి.. పోటీ చేస్తాను అంటూ.. పరేడ్ మైదానంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కల సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటినుంచి రాష్ట్రహితం కోసం పనిచేస్తున్నామని, మాది ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చే ప్రజా ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత 30నెలల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతమయ్యామని, తెలంగాణ విజన్ -2047 లక్ష్యం సాధించే దిశగా వెళ్తున్నామని, రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

Telangana Formation Day Celebrations News Keyword | Telugu Digital