translateexpand_more

Jacob Duffy News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu01 Jun, 01:01 pm
ఆర్ సీబీలో 17 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఆడిన ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని లక్కీ హ్యాండ్

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును మట్టికరిపించి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫిని ముద్దాడింది. అయితే ఈ భారీ టోర్నమెంట్‌లో ఆర్‌సీబీ విజయం వెనుక ఒక ఆసక్తికరమైన మిరాకిల్ దాగి ఉంది. ఆ జట్టుకు చెందిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ ఈ సీజన్‌లో ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ సీజన్‌లో అతను మైదానంలోకి దిగిన ఏ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆర్‌సీబీ ఓడిపోలేదు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం ఆర్‌సీబీ జట్టు తిరుగులేని పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. లీగ్ స్టేజ్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో 9 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత క్వాలిఫైయర్ 1 మ్యాచ్ గెలిచి, ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి కప్ కొట్టేసింది. అయితే ఈ సీజన్ మొత్తంలో ఆర్‌సీబీ 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కానీ జాకబ్ డఫీ ఆడిన మ్యాచ్‌ల్లో మాత్రం జట్టుకు అసలు ఓటమనేదే ఎదురుకాలేదు. జాకబ్ డఫీకి ఇది మొట్టమొదటి ఐపీఎల్ సీజన్. తొలిసారి బరిలోకి దిగిన ఈ కివీస్ బౌలర్ ఆర్‌సీబీ తరఫున ఫైనల్‌తో కలిపి మొత్తం 6 మ్యాచ్‌లు ఆడాడు. విచిత్రం ఏంటంటే, అతను ఆడిన ఆరుకు ఆరు మ్యాచ్‌ల్లోనూ ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఐపీఎల్ కప్ గెలిచిన ఆర్‌సీబీ తొలి ప్లేయర్‌గా డఫీ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి ఒక మ్యాజిక్ జరిగి సరిగ్గా 17 ఏళ్లు అవుతోంది. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ఒకే సీజన్‌లో 100 శాతం మ్యాచ్‌లు

TV9 Telugu31 May, 01:35 am
ఆ ఒక్కటి జరిగితే కప్పు దే..! కానీ హోమ్ గ్రౌండ్ లో తప్పు చేస్తుందా

ఐపీఎల్‌ 2026 మెగా సమరానికి సర్వంగా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ సీజన్‌లో చివరి మ్యాచ్‌ మొదలుకానుంది. రెండో టైటిల్‌ కోసం రెండు జట్లు.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ రంకెలు వేస్తున్నాయి. మరి ఆ రెండో కప్పు ఎవరికి దక్కుతుందో ఈ రోజు తేలిపోనుంది. ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే కప్పు కొట్టిన టీమ్‌ గుజరాత్‌ అయితే, 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కప్పును ముద్దాడిన టీమ్‌ ఆర్సీబీ. అలాంటి జట్ల మధ్య జరిగే ఈ పోరు కచ్చితంగా హోరాహోరీగా సాగనుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో తొలి క్వాలిఫైయర్‌లో ఈ రెండు టీమ్స్‌ పోటీ పడగా ఆర్సీబీ విజయం సాధించి నేరుగా ఫైనల్‌గా దూసుకెళ్లింది. మరోవైపు గుజరాత్‌ తొలి క్వాలిఫైయర్‌లో ఓడి గాయపడ్డ సింహాంలా రెండో క్వాలిఫైయర్‌లో ఆర్‌ఆర్‌ను చిత్తుచేసి మరోసారి ఆర్సీబీతో ఫైట్‌కు రెడీ అయింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీనే హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. పైగా ఆ జట్టు ఒక్క విషయంలో మాత్రం గట్టి నమ్మకంగా ఉంది. అదేంటంటే.. గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్లలో టాప్‌3ని వీలైనంత త్వరగా అవుట్‌ చేయగలిగితే కప్పు తమదే అనే ధీమాతో ఉంది. నిజానికి ఈ విషయాన్ని తొలి క్వాలిఫైయర్‌లోనే చేసి చూపింది. గుజరాత్‌ బలం మొత్తం ఓపెనర్లు సాయి సుదర్శన్‌, కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌ జోష్‌ బట్లర్‌తోనే ఉంది. ఈ ముగ్గురు ఆడితేనే గుజరాత్‌ గెలుస్తుంది. వీరు విఫలం అయితే గుజరాత్‌కు ఓటమి ఖాయంలా కనిపిస్తోంది. తొలి క్వాలిఫైయర్‌లో అదే జరిగింది. ఆర్సీబీ బౌలర్లు చెలరేగి పవర్‌ప్లేలోనే వీరిని పెవిలియన్‌ చేర్చడంతో చాలా ఈజీగా మ్యాచ్‌ గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ చేస్తే

NTV Telugu27 May, 05:22 am
బౌలింగ్ కు రెడీ అయిన కోహ్లీ.. అవాక్కైన అంపైర్ , ఫాన్స్.. చివరకు ఏమైందంటే

Virat Kohli’s Funny Bowling Run-Up Moment Goes Viral: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానులను అలరించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ధర్మశాలలో జరిగిన కీలక మ్యాచ్‌లో 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 43 రన్స్ చేశాడు. కింగ్ క్రీజులో ఉన్నంతసేపు ఆర్సీబీ ఫాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. విరాట్ తన బ్యాట్‌తో మాత్రమే కాదు.. తన చిలిపి చేష్టలతో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. క్వాలిఫయర్-1లో కోహ్లీ చేసిన ఓ ఫన్నీ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతిలో బంతి పట్టుకుని బౌలింగ్ రన్‌అప్ మార్క్ చేస్తున్నట్లు కనిపించిన కోహ్లీ.. ఆ తర్వాత అంపైర్‌తో సరదాగా నవ్వులు పంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌ ఛేజింగ్ సందర్భంగా ఆర్సీబీ ప్లేయర్స్ మైదానంలోకి వచ్చారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ చేతిలో బంతి పట్టుకుని బౌలింగ్ రన్‌అప్ మార్క్ చేస్తూ కనిపించాడు. కొద్దిసేపటి తర్వాత బంతిని పేసర్ జాకబ్ డఫీకి ఇచ్చేశాడు. అనంతరం అంపైర్ వద్దకు వెళ్లి సరదాగా మాట్లాడాడు. ఆపై అంపైర్ వద్ద ఉన్న తన క్యాప్ తీసుకుని ఫీల్డింగ్ చేయడానికి వెళ్లిపోయాడు.అంపైర్, కోహ్లీ నవ్వుకోవడంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. కొందరు అభిమానులు ‘ఇప్పుడు కోహ్లీ బౌలింగ్ కూడా చేస్తాడా?’ అంటూ సరదా పోస్టులు పెడుతున్నారు. కింగ్ చిలిపి చేష్ట అభిమానులను ఆకట్టుకుంది. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రజత్ పాటీదార్ 39 బంతుల్లో 93 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అనంతరం ఛేదనలో

NTV Telugu26 May, 05:15 am
IPL 2026: ఒకే ఒక్క మ్యాచ్‌లో హీరోలు.. ఆ తర్వాత పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిన 5 గురు ‘వన్ మ్యాచ్ వండర్స్’!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితమైన చివరి అంకానికి చేరుకుంది. ఆర్‌సీబీ, జీటీ, ఎస్‌ఆర్‌హెచ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరగా.. మిగిలిన ఆరు జట్లు ఇంటిదారి పట్టాయి. మే 31 ఆదివారం రాత్రి జరిగే ఫైనల్‌తో ఈ 19వ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ లీగ్ స్టేజ్‌లో వైభవ్ సూర్యవంశీ మెరుపు బ్యాటింగ్, భువనేశ్వర్ స్వింగ్, కోహ్లీ మాస్టర్ క్లాస్, రబాడ స్పీడ్ అభిమానులను అలరించినప్పటికీ.. కొందరు ఆటగాళ్లు మాత్రం కేవలం ‘ఒక్క మ్యాచ్ వండర్స్’ లాగే మిగిలిపోయారు. ఒకే ఒక్క మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి, ఆ తర్వాత ఘోరంగా నిరాశపరిచిన ఐదుగురు ఆటగాళ్ల ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసిన ఫాస్ట్ బౌలర్ ప్రఫుల్ హింగే.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తన డెబ్యూ మ్యాచ్‌లోనే 4 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. అందులోనూ 3 వికెట్లు తన మొదటి ఓవర్లోనే తీశాడు. కానీ ఆ తర్వాత ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 7 వికెట్లే తీసి లయ తప్పాడు. ముఖ్యంగా ఆ తర్వాతి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్, రాజస్థాన్ తలపడినప్పుడు వైభవ్ సూర్యవంశీ ఈ బౌలర్‌ను చెడుగుడు ఆడుకున్నాడు. ఇక, లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2.60 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ముకుల్ చౌదరి కథ కూడా ఇంతే. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అజేయంగా 54 పరుగులు చేసి లక్నోకు 3 వికెట్ల విజయాన్ని అందించిన ముకుల్.. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత ఆడిన 9 ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను చేసినవి కేవలం 116 పరుగులే. మరోవైపు, జోష్ హేజిల్‌వుడ్ అందుబాటులో