translateexpand_more

Jana Sena Party News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu02 Jun, 02:32 pm
తెలంగాణ మీ జాగిరా.? పూర్తిగా ఓపెన్ అయిన ప వ న్ క ళ్యాణ్

తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో పార్టీ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పినా, పార్టీ కార్యకర్తలు, మద్ధతుదారుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఎన్నికల బరిలోకి దిగే అవకాశాన్ని సూచించారు. ప్రజలు కోరుకుంటే తెలంగాణలో కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమైతే జనసేన ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై సహజసిద్ధమైన వ్యతిరేకత లేదని పవన్ అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారని, ఉద్యోగాలు, వ్యాపారాలు, సినీ రంగం వంటి అనేక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతోందని చెప్పారు. కొంతమంది రాజకీయ నాయకులు లేదా వ్యక్తులు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను విడదీసే రాజకీయాల కంటే అభివృద్ధి, ఉపాధి, సంక్షేమ అంశాలపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏమైనా ఇక్క‌డి రాజ‌కీయ నాయ‌కుల జాగీరా అంటూ ప్ర‌శ్నించారు. తనను తెలంగాణకు రావొద్దని కొందరు హెచ్చరిస్తున్నారని, కానీ అలాంటి వ్యాఖ్యలకు తాను వెనక్కి తగ్గబోనని పవన్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్లే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ఎదుర్కొన్న ఒత్తిళ్లు, బెదిరింపులతో పోలిస్తే ఇవి పెద్ద విషయాలు కాదని వ్యాఖ్యానించారు. భయపెట్టి రాజకీయంగా అణచివేయాలనే ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి మీడియా సమావేశం Live Link: https://t.co/Y6j4NhJdgl #PawanKalyanTelanganaPressMeet#TelanganaFormationDay#JanaSenaTelangana#JaiTelangana తెలంగాణతో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తానని చెప్పారు. గతంలో కూడా తెలంగాణ ప్రాంతంలోని పలు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహాయం అందించానని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా వాటిపై స్పందించడం తన బాధ్యతగా భావిస్తానని అన్నారు. తెలంగాణలో జరిగే అన్యాయాలపై కూడా అవసరమైతే గళమెత్తుతానని స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటై దశాబ్దానికి పైగా గడిచిన తరువాత కూడా కొన్ని సమస్యలకు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కారణంగా చూపడం సరైన విధానం కాదని పవన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ విభేదాల కంటే ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల ముఖ్యమని చెప్పారు. రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విభజనలు సృష్టించే బదులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. తెలంగాణలో జనసేన భవిష్యత్తు పాత్ర, పార్టీ విస్తరణ అవకాశాలు, ప్రాంతీయ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రానున్న రోజుల్లో జనసేన తెలంగాణలో ఎలాంటి కార్యాచరణ చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

NTV Telugu02 Jun, 12:01 pm
తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్

Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? అంటూ ఫైర్‌ అయ్యారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో లక్షలాది మంది జనసేన కార్యకర్తలు ఉన్నారని, రాష్ట్ర ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు తమ పార్టీకి ఉందని ఆయన అన్నారు. జనసేన పార్టీని హైదరాబాద్ నడిబొడ్డునే స్థాపించామని గుర్తు చేసిన పవన్ కల్యాణ్, తెలంగాణపై తమకు కొత్తగా ప్రేమ పుట్టలేదని చెప్పారు. తెలంగాణ గురించి జనసేన ఎందుకు మాట్లాడుతోందని కొందరు ప్రశ్నిస్తున్నారని, అయితే రాష్ట్ర ప్రజల సమస్యలపై స్పందించడం రాజకీయ పార్టీగా తమ బాధ్యత అని పేర్కొన్నారు. తాను తెలంగాణలోని నాలుగు మూలలూ తిరిగానని, రాష్ట్ర అభివృద్ధిని ఎప్పుడూ కోరుకునే వ్యక్తినని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆదిలాబాద్ వంటి నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించానని, ప్రస్తుతం విమర్శలు చేస్తున్న చాలామంది అప్పట్లో అక్కడికి వెళ్లలేదని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, రాష్ట్ర విభజన జరిగిన విధానంపైనే తన అభ్యంతరం అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎలాంటి విద్వేషం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతారని కొందరు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, ఎవరూ తనను బెదిరించలేరని వ్యాఖ్యానించారు. తన ఇంటి చిరునామా చెప్పడానికే ప్రెస్‌మీట్ పెట్టానని, బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. గత 12 ఏళ్లలో కేసీఆర్ లేదా తెలంగాణ నాయకులపై తాను వ్యక్తిగత విమర్శలు చేయలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. తనను గతంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బెదిరించారని, కానీ తెలంగాణ ప్రజల నుంచి అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పారు. తెలంగాణలో ఉపాధి అవకాశాల కొరత లేదా ప్రజా సమస్యలపై మాట్లాడితే తనను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎవరైనా అన్యాయాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అందులో తాను ఉన్నా మినహాయింపు అవసరం లేదని పేర్కొన్నారు. తనపై భూకబ్జా ఆరోపణలు వస్తే వెంటనే విచారణ జరపాలని పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. తాను చెరువు లేదా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఉంటే ఆస్తులను సీజ్ చేయాలని, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ గురించి ప్రస్తావించిన పవన్ కల్యాణ్, ఆయన జీవించి ఉన్న సమయంలో చాలా మంది పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో గద్దర్ తనను సహాయం కోరగా, తాను వెంటనే వాహనం కొనిచ్చానని గుర్తు చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ తప్పకుండా ఉంటుందని, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అవసరమైతే తానే తెలంగాణ అంతటా పర్యటిస్తానని, ప్రజా సమస్యలపై ఇదే విధంగా మాట్లాడుతూనే ఉంటానని తెలిపారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

NTV Telugu02 Jun, 11:47 am
బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం

Pawan Kalyan: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారకర్తగా తిరుగుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సమస్యలు, యువత ఉపాధి అవకాశాలపై మాట్లాడటం తన బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, ఇక్కడి ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడే ప్రసక్తే లేదని, భయపెట్టే కొద్దీ తన సంకల్పం మరింత బలపడుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పలువురు వ్యక్తులు నేడు ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. యువరాజ్యం రోజుల నుంచి తెలంగాణ యువత తనకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, ప్రజల మద్దతుతో వాటిని ఎదుర్కొన్నామని అన్నారు. వేర్పాటువాదం దేశ సమగ్రతకు భంగం కలిగించనంత వరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చనీయాంశమేనని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, కాంగ్రెస్ నాయకులు ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేయవచ్చని, కానీ తాము తెలంగాణలో పర్యటిస్తే అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరైన విధానం కాదని విమర్శించారు. ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయవచ్చని, గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారని గుర్తు చేసిన పవన్ కల్యాణ్, అదే విధంగా దేశవ్యాప్తంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ అంశాలపై స్పందించాలని కోరారు. ఇక, పాశం యాదగిరిపై తనకు గౌరవం ఉందని, అయితే ఆయన కూడా తనపై విమర్శలు చేయడం బాధ కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. తాము దేశ పౌరులమని, పన్నులు చెల్లిస్తున్నామని, తెలంగాణలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఎలాంటి పాస్‌పోర్ట్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఉపాధి అవకాశాలు, యువత భవిష్యత్తు, ప్రజా సమస్యలపై చర్చిస్తుంటే వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజల కోసం గళం వినిపిస్తానని స్పష్టం చేశారు.

Andhra Jyothy02 Jun, 11:39 am
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది

తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన కుండ బద్దలు కొట్టారు. హైదరాబాద్,జూన్02: తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన కుండ బద్దలు కొట్టారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని స్పష్టం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వారే.. పదవుల్లో ఉన్నారని.. ఎమ్మెల్యేలు అయ్యారని పవన్‌ కల్యాణ్ వివరించారు. తెలంగాణ అంటే గౌరవం ఉంది కనుకే కొండగట్టు ఆలయానికి కోట్ల రూపాయిలు విరాళంగా ఇచ్చామన్నారు పవన్ కల్యాణ్. మీ తాటాకు చప్పుళ్లకు జనసేన పార్టీ భయపడదన్నారు. భయపడేవాడినే అయితే పార్టీ పెడతానా? అని ప్రశ్నించారు. తెలంగాణకు ద్రోహం జరిగితే మొట్టమొదట గొంతులేపేది జనసేన పార్టీనే అని స్పష్టం చేశారు. ఏం చేసినా ఓట్ల కోసం కాదు.. తనకు తెలంగాణపై ప్రేమ, మమకారం ఉన్నాయన్నారు. గుంటూరులో టీఆర్ఎస్ కార్యాలయం పెడితే స్వాగతించామని ఏపీ డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. ఇక్కడ ఏమైనా చేస్తే తాను సీఎం అయిపోతానా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణను తానెప్పుడు అవమానించాను? అని ఆయన స్థానిక నేతలను ప్రశ్నించారు. తన పీక కోసినా కూడా భయపడేది లేదన్నారు. తనకు రెచ్చగొట్టడం ఇష్టం లేదని తెలిపారు. తనను ఎన్ని తిట్టినా పట్టించుకోనన్నారు. తెలంగాణలో ఉపాధి లేకపోతే తాను కారణమా? అని రాజకీయ పార్టీల నాయకులను ఆయన సూటిగా నిలదీశారు. మద్రాస్‌లో ఉన్న చిత్రపరిశ్రమ ఇక్కడికి ఎలా వచ్చిందన్నారు. ఆంధ్రా వాళ్లను తిడుతుంటే వాళ్లు ఇక్కడెలా ఉంటారన్నారు. ఇంకెంతకాలం ఆంధ్రావాళ్లను తిడుతూ కాలక్షేపం చేస్తారంటూ తెలంగాణలోని నాయకులకు ఆయన సూటిగా ప్రశ్నించారు. సడెన్‌గా ఇక్కడికి రావొద్దంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఏపీ కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తనకు గౌరవం ఉందన్నారు. తాను చెరువును కబ్జా చేశానని కొందరు అంటున్నారని.. అలా చేస్తే తనను ఇక్కడ ఉండనిస్తారా? అని ఆయన సూటిగా నిలదీశారు. తన ఫామ్‌హౌస్‌ కబ్జా అని తేలిస్తే.. దానిని రాష్ట్ర ప్రభుత్వానికే రాసిస్తానన్నారు. గద్దర్‌తో తనకు చాలా సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందే తనకు గద్దర్‌ తెలుసునన్నారు. గద్దర్‌ ఒంట్లో బుల్లెట్లు దిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని రాజకీయ పార్టీల నేతలను పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. గద్దర్‌ తమ పార్టీ కార్యాలయానికి వచ్చేవారని గుర్తు చేశారు. గద్దర్‌ బతికున్నప్పుడు మీరంతా ఎక్కడున్నారు? అంటూ తనను ప్రశ్నిస్తున్న నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చురకలంటించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Andhra Jyothy02 Jun, 05:04 am
తెలంగాణ ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతి, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలు ఏర్పడినా.. తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే అని సీఎం అన్నారు. మూడున్నర కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలతో యువత బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోవాలి: చంద్రబాబు ‘తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా... తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోటీ పడి దూసుకుపోవాలి. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలి. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలి. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు దక్కాలి. అత్యుత్తమ జీవన ప్రమాణాలు పొందాలి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో మన రెండు రాష్ట్రాలు కలిసి పని చేసి, కీలక భూమి పోషించి తెలుగు వైభవాన్ని, ప్రాభవాన్ని చాటాలి’ అంటూ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు: పవన్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మూడున్నర కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలతో యువత బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జనసేన ఊపిరులూదుకొన్నది తెలంగాణ గడ్డపైనే. ఈ నేల నుంచే వారసత్వంగా పోరాట పటిమను పుణికి పుచ్చుకున్నది. అణగారినవర్గాల సంక్షేమం, యువత ఆకాంక్షలు, వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగితే గళం వినిపించే తెగువ తెలంగాణలో ఉంది. అటువంటి లక్షణం జనసేన శ్రేణుల్లోనూ నిండుగా ఉంది. ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద విలసిల్లే తెలంగాణ రాష్ట్రం సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికీ అంజలి ఘటిస్తున్నాను’ అంటూ పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏలూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి