
Pawan Kalyan: రేపు హైదరాబాద్ లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. జూన్ 2న గచ్చిబౌలిలో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు జనసేన ప్లాన్ చేసింది. అయితే, ఈ సభకు సైబరాబాద్ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. తెలంగాణ అవిర్భావ వేడుకలు, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో సభకు అనుమతి కోసం జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. జనసేన సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఈ సమాచారాన్ని ఆ పార్టీ నేతలకు తెలియజేశారు. గచ్చిబౌలిలో జనసేన ఏర్పాటు చేసిన సభకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరు కావాల్సి ఉంది. దాదాపు 2వేల మందితో రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ సమావేశానికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు జనసేన నాయకులు. దాన్ని పరిశీలించిన పోలీసులు సభకు అనుమతి నిరాకరించారు. అందుకు రెండు ప్రధానమైన కారణాలు చూపించారు. రేపు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో జనసేన సభకు రక్షణ కల్పించలేమని చెప్పారు. రెండోది శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జనసేన సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు వివరించారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో జనసేన నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కచ్చితంగా తమ సభకు అనుమతి ఇస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, హైదరాబాద్ లో పవన్ పెట్టాలనుకున్న సభ ఇప్పటికే రాజకీయ దుమారం రేపింది. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు పవన్ పై నిప్పులు చెరిగారు. పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పవన్ సభను తీవ్రంగా వ్యతిరేకించారు. పవన్