Indian-origin pilot| ఇంటర్నెట్‌డెస్క్: అప్పటివరకు వివాహ వేడుకలో సంతోషంగా గడిపిన ఓ భారత సంతతి కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లయిన కొన్నిగంటలకే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని జార్జియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. డెల్టా ఎయిర్‌లైన్స్‌లో పైలట్ అయిన డేవ్ ఫిజీ (25) (Dave Fiji) అట్లాంటాలో నివసిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే అతడి తల్లిదండ్రులు కేరళలోని ఎర్నాకుళం నుంచి అమెరికాకు వలస వెళ్లారు. మే 29న జార్జియాలోని డాసన్ విలె ప్రాంతంలో డేవ్ ఫిజీకి.. జెస్నితో వివాహం జరిగింది. ఆమెది కూడా కేరళ మూలాలున్న కుటుంబమే. ఇరు కుటుంబాలు ఈ పెళ్లిలో సంతోషంగా గడిపాయి. వివాహ వేడుకల అనంతరం రాత్రి 10 గంటల సమయంలో డాసన్‌విలెలోని వేదిక నుంచి వధూవరులు హెలికాప్టర్‌లో బయల్దేరారు. వారు అట్లాంటాలోని ఒక హోటల్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పర్వత ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో డేవ్‌తో పాటు పైలట్ చనిపోయారు. సహాయక సిబ్బంది వచ్చేవరకు శిథిలాల కింద జెస్ని చిక్కుకుపోయారు. ప్రాణాలతో బయటపడిన ఆమె.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వాతావరణం అనుకూలంగా లేదని, ఇప్పుడు ప్రయాణించనని డేవ్ మొదట చెప్పినట్లు ఆయన తండ్రి జార్జ్ ఫిజీ వెల్లడించారు. ఎక్కువ ఎత్తులో వెళ్దామని నిర్ణయించుకొని హెలికాప్టర్‌లో బయల్దేరినట్లు చెప్పారు. డేవ్ మృతితో జెస్ని షాక్‌లోకి వెళ్లిపోయిందని ఉద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక నివేదిక 30 రోజుల్లో వస్తుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త
Kerala News News
Latest updates from Telugu Digital news sources.
ఇంటర్నెట్‌డెస్క్: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పది ప్రాంతాల్లో ఈడీ దాడులు చేపట్టగా.. వాటిలో మాజీ సీఎం (Pinarayi Vijayan) నివాసం కూడా ఒకటి. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు జరిగాయి. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ (CMRL) నుంచి ఎక్స్‌లాజిక్ సొల్యూషన్స్ సంస్థకు రూ.2.73 కోట్లు దక్కాయి. దానికి బదులుగా ఎలాంటి ఐటీ సేవలు అందించలేదు. ఈ ఎక్స్‌లాజిక్ సొల్యూషన్స్ విజయన్ కుమార్తె టి.వీణకు చెందిన కంపెనీ. రెండు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం ఉన్నప్పటికీ.. అవి మోసపూరితంగా ఉన్నాయని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) తన అభియోగాల్లో పేర్కొంది. 2023 ఆగస్టులో ఆ అంశం వెలుగులోకి వచ్చింది. 2017 నుంచి 2020 మధ్యలో సీఎంఆర్‌ఎల్ నుంచి రూ.1.72 కోట్లు పొందినట్లు ఆ ఆరోపణల సారాంశం. ఆ నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఎస్‌ఎఫ్‌ఐఓకు గతంలోనే కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. ఈ కేసు విషయంలో వీణపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే మాజీ సీఎం నివాసం సహా పలు ప్రాంతాల్లో నేడు ఈడీ సోదాలు చేపట్టింది. కొయికోడ్‌లోని మాజీ మంత్రి మహమ్మద్ రియాస్ నివాసం పైనా ఈ దాడులు జరిపింది. మహమ్మద్ రియాస్.. వీణ భర్త. కేరళ సీఎం వీడీ సతీశన్ క్యాబినెట్‌లోని ఇద్దరు వ్యక్తులకు కూడా సీఎంఆర్‌ఎల్ నుంచి నిధులు అందాయని వామపక్ష నేత ఎంఏ బేబీ ఆరోపించారు. సీఎంఆర్‌ఎల్ చెల్లింపు వివాదంపై రాష్ట్రంలో వివాదం నడుస్తోన్న సమయంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి