translateexpand_more

Kiran Rao News

Latest updates from Telugu Digital news sources.

Chitrajyothy03 Jun, 04:08 pm
ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ మూడో పెళ్లి

ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఎవరెవరు ప్రేమించుకుంటారు.. ? ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారు.. ఎప్పుడు విడిపోతారు.. ? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు అనేది ఎవరికీ తెలియదు. ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఎవరెవరు ప్రేమించుకుంటారు.. ? ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారు.. ఎప్పుడు విడిపోతారు.. ? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు అనేది ఎవరికీ తెలియదు. తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) మూడో పెళ్ళికి రెడీ అయ్యినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. గత కొంతకాలంగా ఆమీర్.. గౌరీ స్ప్రాట్ అనే మహిళతో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ఎక్కడికి వెళ్ళినా ఈ జంట కలిసే కనిపిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమీర్- గౌరీ వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారట. ఎలాంటి ఆర్భాటం లేకుండా ఆమీర్ ఖాన్ నివాసంలోనే అత్యంత నిరాడంబరంగా ఈ వివాహ వేడుక జరగనుంది. జూలై 5 న జరిగే ఈ ప్రైవేట్ ఈవెంట్‌కు బాలీవుడ్ టాప్ ఖాన్స్ అయిన షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు విఫలమైనా కూడా 61 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ సరికొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు రెడీ అవ్వడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమీర్ మొదటి పెళ్ళిళ్ళ గురించి చెప్పాలంటే.. ఆయన మొదట 1986లో తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, 16 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక బంధం తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా వీరిద్దరూ 2002లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావును ఆమీర్ రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి సరోగసీ విధానం ద్వారా ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. కానీ, ఈ రెండో బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు, 2021లో వీరిద్దరూ అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ముచ్చటగా ఆమీర్ మూడో పెళ్ళికి సిద్దమయ్యాడు. మరి ఈ పెళ్ళి అయినా జీవితకాలం నిలబడుతుందో లేదో చూడాలి.

NTV Telugu03 Jun, 02:45 pm
ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్

AamirKhan Marriage: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఆ వార్తల సారాంశం ఏంటంటే.. 61 ఏళ్ల ఆమిర్ ఖాన్ మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. ఈ ప్రచారం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న ఈ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్.. తాజాగా గౌరీ స్ప్రత్ అనే మహిళతో ప్రేమలో పడ్డారని, వీరిద్దరూ త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రేజీ బాలీవుడ్ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వివాహానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వెడ్డింగ్ డేట్ కూడా లీకై నెట్టింట చక్కర్లు కొడుతోంది. జులై 5న ఆమిర్ ఖాన్ తన నివాసంలోనే చాలా సింపుల్‌గా, ఎలాంటి హడావుడి లేకుండా 'రిజిస్టర్ మ్యారేజ్' చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులైన కొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. అయితే ఈ వెడ్డింగ్ రూమర్స్‌పై ఆమిర్ ఖాన్ టీమ్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిజానికి ఆమిర్ ఖాన్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యి విడాకులు కూడా తీసుకున్నారు. మొదట రీనా దత్తాను వివాహం చేసుకున్న ఆయన, ఆ తర్వాత కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే 2021లో కిరణ్ రావుతో కూడా విడాకులు తీసుకుంటున్నట్లు ఆమిర్ అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు 61 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Kiran Rao News Keyword | Telugu Digital