translateexpand_more

Microsoft News

Latest updates from Telugu Digital news sources.

Sakshi26 May, 09:48 am
మైక్రోసాఫ్ట్ వర్సెస్ ఎంసీఏ

గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) మధ్య న్యాయ పోరాటం మరింత ముదిరింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సహా ఇతర అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్‌లపై ఢిల్లీ-హరియాణా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ) విధించిన జరిమానా ఉత్తర్వులను సవాలు చేస్తూ లింక్డ్‌ఇన్ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)ను ఆశ్రయించింది. మే 15, 2026న దాఖలైన ఈ అప్పీల్‌ను పరిశీలించిన ట్రైబ్యునల్ ఈ వివాదంపై తుది నిర్ణయం వచ్చే వరకు ఆర్ఓసీ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ (స్టే) మధ్యంతర ఉపశమనం కల్పించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. భారతదేశంలో పనిచేస్తున్న బహుళజాతి కంపెనీల (ఎంఎన్‌సీ) భవిష్యత్తుపై దీని ప్రభావం ఉండనుండటంతో లీగల్ సర్కిల్స్‌లో ఈ కేసు హాట్ టాపిక్‌గా మారింది. లింక్డ్‌ఇన్ సంస్థ మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో ఉంది. 2016లో సుమారు 26.2 బిలియన్‌ డాలర్ల డీల్‌తో మైక్రోసాఫ్ట్ దీనిని సొంతం చేసుకుంది. మైక్రోసాఫ్ట్ గ్లోబల్ సీఈఓగా సత్య నాదెళ్ల ఈ కార్పొరేట్ నిర్మాణంలో అగ్రస్థానంలో ఉండగా లింక్డ్‌ఇన్ సీఈఓ ర్యాన్ రోస్లాన్స్‌కీ మైక్రోసాఫ్ట్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలో పనిచేస్తున్నారు. అయితే, మే 5, 2024న జారీ చేసిన ఒక ఉత్తర్వులో లింక్డ్‌ఇన్ ఇండియా, లింక్డ్‌ఇన్ ఐర్లాండ్‌లతో పాటు సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్‌కీలపై ఆర్ఓసీ రూ.27 లక్షల జరిమానా విధించింది. కంపెనీల చట్టం ప్రకారం వీరు ‘గణనీయమైన ప్రయోజనకరమైన యజమానుల’ (సిగ్నిఫికెంట్‌ బెనిఫిషియల్‌ ఓనర్స్‌-ఎస్‌బీఓ) నిర్వచనం కిందికి వస్తారని, అయితే ఈ వివరాలను దాచారని ఆర్ఓసీ పేర్కొంది. లింక్డ్‌ఇన్ ఇండియా అనేది మైక్రోసాఫ్ట్ పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ. అయితే, మాతృ సంస్థలో ఏ ఒక్క నిర్దిష్ట వాటాదారుకూ గణనీయమైన వాటా లేదు. అందువల్ల ఎంసీఏ ఫైలింగ్స్‌లో తాము

Sakshi27 May, 12:38 pm
ఏఐ వినియోగానికి భారత్ సారథ్యం

అంతర్జాతీయంగా కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో తదుపరి దశకి సారథ్యం వహించేందుకు భారత్‌ సర్వసన్నద్ధంగా ఉందని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (కోర్‌ఏఐ) జయ్‌ పారిఖ్‌ తెలిపారు. దేశీయంగా డెవలపర్ల లభ్యత భారీ స్థాయిలో ఉండటం, కంపెనీలు ఏఐ వినియోగాన్ని వేగవంతం చేయడం మొదలైనవి సానుకూలాంశాలని వివరించారు. భారత్‌లో రూపొందిన హైపర్‌స్విచ్, ఈఆర్‌పీనెక్ట్స్, టూల్‌జెట్, బ్రూనో లాంటి ఓపెన్‌ సోర్స్‌ ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు ఉపయోగిస్తున్నారని ఓ బ్లాగ్‌పోస్ట్‌లో పారిఖ్‌ పేర్కొన్నారు. ‘ఏఐ తదుపరి దశ అనేది అత్యుత్తమ మోడల్స్‌ని ఎవరు రూపొందిస్తున్నారనే అంశంపై కాకుండా వాస్తవ ప్రపంచంలో ప్రభావవంతంగా పని చేసేలా, విశ్వసనీయతతో, వేగవంతంగా ఎవరు వినియోగంలోకి తేగలగుతారనే విషయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ పరివర్తనకి సారథ్యం వహించడానికి భారత్‌ సర్వసన్నద్ధంగా ఉంది‘ అని తెలిపారు. డెలాయిట్‌ నిర్వహించిన 2026 సర్వే ప్రకారం విస్తృత స్థాయిలో ఏఐ వినియోగిస్తున్న 15 దేశాల జాబితాలో భారత్‌కి అగ్రస్థానం దక్కడం ఇందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 40 శాతం ఎంటర్‌ప్రైజ్‌లు ఏఐని గణనీయంగానో లేదా పూర్తి స్థాయిలోనో వినియోగిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా ఇది సగటున 28 శాతంగా ఉంది. పటిష్టంగా డిజిటల్‌ మౌలిక సదుపాయాలు.. దేశీయంగా డిజిటల్‌ పబ్లిక్‌ మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటం భారత్‌కి మరో సానుకూలాంశమని పారిఖ్‌ చెప్పారు. ‘భారత్‌లో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ) పటిష్టంగా ఉంటోంది. గత దశాబ్దకాలంలో గుర్తింపు ధృవీకరణ వ్యవస్థ, చెల్లింపుల వ్యవస్థ, డేటా ప్లాట్‌ఫాంలను భారత్‌ విస్తృత స్థాయిలో తీర్చిదిద్దింది. డిజిటల్‌ చెల్లింపుల విధానమైన యూపీఐ ప్రస్తుతం నెలకు 2,000 కోట్ల పైగా లావాదేవీలను ప్రాసెస్‌ చేస్తోంది. ఇది అంతర్జాతీయంగా జరిగే రియల్‌ టైమ్‌ చెల్లింపుల్లో దాదాపు

AP7AM30 May, 01:30 am
యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. 11 మందికి మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) విద్యార్థులు సత్తా చాటారు. వర్సిటీలో డేటా సెంటర్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసుకున్న 11 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉద్యోగాలు సంపాదించారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఎంపికైన వీరికి ఏటా రూ.7 లక్షల ప్యాకేజీని మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసింది.ఈ కోర్సులో మొత్తం 14 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోగా, వారిలో 11 మంది మైక్రోసాఫ్ట్‌కు ఎంపిక కావడం విశేషం. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు గల మానవ వనరులను అందించాలనే లక్ష్యంతో ఈ వర్సిటీ పనిచేస్తోందని అధికారులు తెలిపారు.తమ విద్యార్థుల విజయంపై యూనివర్సిటీ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. "పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దడంలో ఇదొక గర్వించదగ్గ మైలురాయి" అని అభివర్ణించింది. తెలంగాణ ప్రభుత్వం 2024 ఆగస్టులో ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ క్యాంపస్ నుంచి ఈ వర్సిటీ కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రారంభమైన కొద్ది కాలంలోనే వర్సిటీ 17 కోర్సులను ప్రవేశపెట్టి, 418 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.