translateexpand_more

Minister Telangana News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 03:14 am
అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ ఆవిర్భావం

అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటైందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారిని గౌరవిస్తామని మాటిచ్చారు. సిద్దిపేట జిల్లా, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను చదివి మంత్రి వినిపించారు. అలాగే, హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి ఎగురవేశారు. హుస్నాబాద్ అంబేడ్కర్ సర్కిల్ దగ్గర జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటైందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారిని గౌరవిస్తామని మాటిచ్చారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ అనేది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదని, కోట్లాదిమంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పుకొచ్చారు. త్యాగాల పునాదులపై నిర్మితమైన తెలంగాణ, నేడు అభివృద్ధి సంక్షేమానికి చిరునామాగా నిలిచిందని ఉద్ఘాటించారు. తెలంగాణను ప్రజాపాలన ప్రభుత్వంలో మరింత సమానత్వంతో, మరింత ప్రగతితో ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.