translateexpand_more

Pawan Kalyan Interesting Comments On Telangana Politics News

Latest updates from Telugu Digital news sources.

AP7AM03 Jun, 01:55 pm
తెలంగాణ రాజకీయాలపై ఏపీలో పవన్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ఎవరి జాగీరు కాదని, అక్కడి రాజకీయాల్లో జనసేన భాగస్వామ్యంపై వస్తున్న విమర్శలకు అర్థం లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం అమరావతి పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పోటీ చేసే హక్కు అక్కడి భూమిపుత్రులకే ఉంటుందని అనడం సరికాదని, ఇతరులు పోటీ చేయకూడదని అభ్యంతరాలు చెప్పడం తగదని అన్నారు.అంతకుముందు, అమరావతిలోని 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సందర్శించి పవన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహనీయులను కులాలకు పరిమితం చేసే ధోరణిని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుల రాజకీయాలు విపరీతంగా పెరిగాయని, వాటిని ఎదుర్కొనేందుకే "సేనా గళం" కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.తెలంగాణలో జనసేన పార్టీ తరఫున అక్కడి స్థానికులే పోటీ చేస్తారని, ఆంధ్రప్రదేశ్ నేతలు ఎవరూ అక్కడికి వెళ్లి పోటీ చేయబోరని స్పష్టత ఇచ్చారు. "తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తే అభ్యంతరం ఎందుకు?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. గద్దర్ కుటుంబం పట్ల, కేటీఆర్ పట్ల తనకు గౌరవం ఉందని, అయితే దేశ సమగ్రతకు భంగం కలిగించే చర్యలను వ్యతిరేకిస్తానని అన్నారు. కేటీఆర్ తనకు సోదరుడితో సమానమని అన్నారు.

Pawan Kalyan Interesting Comments On Telangana Politics News Keyword | Telugu Digital