translateexpand_more

Pawan Kalyan On Ap Telangana Highway Name News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu02 Jun, 12:45 pm
ఏపీ-తెలంగాణ హైవేకు ఆ మాజీ సీఎం పేరు పెట్టాలి.. పవన్ కళ్యాణ్ కీలక ప్రతిపాదన

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న మాటల యుద్ధం సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కించపరిస్తే, అవమానించేలా వ్యాఖ్యలు చేస్తే.. తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నేతల విగ్రహాలను కూల్చేస్తామని.. పలువురు తెలంగాణ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో.. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యా్ణ్ స్పందించారు. ఎవరి విగ్రహాలు పెట్టాలి వద్దు అనేది ప్రజల ఇష్టం అని తెలిపారు. అలా అనుకుంటూ పోతే.. స్వాతంత్య్రాన్ని సాధించిన గాంధీజీ, అంబేడ్కర్ వంటి మహనీయుల విగ్రహాలను కూడా పెట్టొద్దని.. కొందరు వాదిస్తారని పేర్కొన్నారు. తెలంగాణలోని కొంతమంది నాయకులు.. ప్రాంతీయవాదాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారని.. ఇతర రాష్ట్రాలను, ఇతర రాష్ట్రాల నేతలను ద్వేషిస్తున్నారని పవన్ కళ్యాణ్ ‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ వాదం అనేది ఉగ్రవాదం కంటే చాలా హానికరమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆంధ్రా నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయవద్దంటూ కొంతమంది నేతలు, పలు సంఘాలు డిమాండ్ చేయడం, విగ్రహాల ఆవిష్కరణలను అడ్డుకోవడం వంటి ఘటనలు ఇటీవల చోటు చేసుకోవడంతో.. పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలు ఐక్యతకు చిహ్నం మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అని.. ఆయన విగ్రహాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలిపే హైవేపై పెట్టాలని.. ఆ హైవేకు బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టాలని తాను ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. గొప్ప నేతల విగ్రహాలు వారి గుర్తులుగా ఏర్పాటు చేస్తారని.. అలాంటి నాయకులకు ప్రాంతీయ బేధాలు ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇలా చేసుకుంటూ పోతే.. మహాత్మాగాంధీ గుజరాత్ వ్యక్తి అని.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహారాష్ట్ర వ్యక్తి అని.. వారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయవద్దనే వాదనలు తెరపైకి వస్తాయని.. ఇలాంటి ప్రాంతీయ విబేధాలు దేశ ఐక్యతకు మంచివి కావని సూచించారు. అదే సమయంలో తెలంగాణలో ప్రారంభమైన మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం.. తమిళనాడులో హిందీ గో బ్యాక్ డిమాండ్లు.. దక్షిణాదిన నార్త్ ఇండియన్స్ గో బ్యాక్ అని కొందరు మాట్లాడుతున్నారని.. ఇవన్నీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే భావాలు అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మనం అందరం భారతీయులం అని గుర్తు చేశారు. ఇలాంటి కేంద్రం ఫోకస్ పెట్టాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ యాస, భాషలో హిందుస్తానీ ఉందని అలాంటి తెలంగాణలో హిందీ ఉండొద్దని మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా పశ్చిమ బెంగాల్‌లో ఇలాగే మాట్లాడారని.. బెంగాల్‌కు వస్తే తన్ని తరిమేస్తామని టీఎంసీ నేతలు మాట్లాడారని గుర్తు చేశారు. కానీ నాయకుల మాటలు వేరు ప్రజల మాటలు వేరని.. అక్కడి ప్రజలు టీఎంసీ నాయకులను తన్ని తరిమేశారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Pawan Kalyan On Ap Telangana Highway Name News Keyword | Telugu Digital