తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న మాటల యుద్ధం సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కించపరిస్తే, అవమానించేలా వ్యాఖ్యలు చేస్తే.. తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నేతల విగ్రహాలను కూల్చేస్తామని.. పలువురు తెలంగాణ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో.. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యా్ణ్ స్పందించారు. ఎవరి విగ్రహాలు పెట్టాలి వద్దు అనేది ప్రజల ఇష్టం అని తెలిపారు. అలా అనుకుంటూ పోతే.. స్వాతంత్య్రాన్ని సాధించిన గాంధీజీ, అంబేడ్కర్ వంటి మహనీయుల విగ్రహాలను కూడా పెట్టొద్దని.. కొందరు వాదిస్తారని పేర్కొన్నారు. తెలంగాణలోని కొంతమంది నాయకులు.. ప్రాంతీయవాదాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారని.. ఇతర రాష్ట్రాలను, ఇతర రాష్ట్రాల నేతలను ద్వేషిస్తున్నారని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ వాదం అనేది ఉగ్రవాదం కంటే చాలా హానికరమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆంధ్రా నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయవద్దంటూ కొంతమంది నేతలు, పలు సంఘాలు డిమాండ్ చేయడం, విగ్రహాల ఆవిష్కరణలను అడ్డుకోవడం వంటి ఘటనలు ఇటీవల చోటు చేసుకోవడంతో.. పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలు ఐక్యతకు చిహ్నం మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అని.. ఆయన విగ్రహాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలిపే హైవేపై పెట్టాలని.. ఆ హైవేకు బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టాలని తాను ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. గొప్ప నేతల విగ్రహాలు వారి గుర్తులుగా ఏర్పాటు చేస్తారని.. అలాంటి నాయకులకు ప్రాంతీయ బేధాలు ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇలా చేసుకుంటూ పోతే.. మహాత్మాగాంధీ గుజరాత్ వ్యక్తి అని.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహారాష్ట్ర వ్యక్తి అని.. వారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయవద్దనే వాదనలు తెరపైకి వస్తాయని.. ఇలాంటి ప్రాంతీయ విబేధాలు దేశ ఐక్యతకు మంచివి కావని సూచించారు. అదే సమయంలో తెలంగాణలో ప్రారంభమైన మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం.. తమిళనాడులో హిందీ గో బ్యాక్ డిమాండ్లు.. దక్షిణాదిన నార్త్ ఇండియన్స్ గో బ్యాక్ అని కొందరు మాట్లాడుతున్నారని.. ఇవన్నీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే భావాలు అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మనం అందరం భారతీయులం అని గుర్తు చేశారు. ఇలాంటి కేంద్రం ఫోకస్ పెట్టాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ యాస, భాషలో హిందుస్తానీ ఉందని అలాంటి తెలంగాణలో హిందీ ఉండొద్దని మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా పశ్చిమ బెంగాల్లో ఇలాగే మాట్లాడారని.. బెంగాల్‌కు వస్తే తన్ని తరిమేస్తామని టీఎంసీ నేతలు మాట్లాడారని గుర్తు చేశారు. కానీ నాయకుల మాటలు వేరు ప్రజల మాటలు వేరని.. అక్కడి ప్రజలు టీఎంసీ నాయకులను తన్ని తరిమేశారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Pawan Kalyan On Telangana News
Latest updates from Telugu Digital news sources.

ఆంధ్రలో తనను తిరగనివ్వనని అంటే, తన వారాహికి అనుమతి ఇచ్చింది తెలంగాణాయే అని పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తెలిపారు. ఇక్కడి జనసైనికులే తనకు అండగా నిలిచారన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేద్దామని మా నాయకులు అంటే.. ప్రజలు కోరుకుంటే చూద్దామని చెప్పినట్లు వెల్లడించారు. ఇక్కడ కూర్చొన్నా ఆంధ్రలోనే అధికారం కోరుకుంటానని, తెలంగాణలో కేవలం మార్పు మాత్రమే కోరుకుంటానన్నారు. ఈ మధ్య మాట్లాడితే ఆంధ్ర ఆంధ్ర అంటున్నారని, తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్ర మీద విద్వేషం లేదని, వాళ్లంతా విద్వేషం చూపించి ఉంటే ఆంధ్ర ప్రాంత వ్యక్తులు ఇక్కడ ఉండే వారు కాదన్నారు. దీన్ని ఎవరూ మర్చిపోరన్నారు. హైదరాబాద్ లో ఎలా అడుగుపెడతావని, ఇక్కడేం పని అని అడుగుతున్నారని, మీరెవరు నన్ను బెదిరించడానికి అన్నారు. బెదిరించే వాళ్ల అయ్య జాగీరా తెలంగాణా అని ప్రశ్నించారు. తెలంగాణలో కంటే ఆంధ్రాలోనే తనకు బెదిరింపులు ఎక్కువన్నారు. తెలంగాణలో రానివ్వనంటారని, ఆంధ్రలో అయితే కోనసీమలో తల తీసేయమంటారన్నారు.తాను 2019లో ఓడిపోయినప్పుడు తెలంగాణ నాయకులు ఇక్కడ ఉంటే అలాంటి పరిస్ధితి రానిచ్చే వాళ్లం కాదన్నారు. తెలంగాణలో తాను సాధించేది ఏమీ లేదన్నారు. ప్రెస్ మీట్ కూడా ఇంట్లోనే ఎందుకు పెట్టానంటే, దాడి చేసే వాళ్లకు అవకాశం కోసమేననన్నారు. బాంచెన్ సారు కాల్మొక్తా అనే వాళ్లం అయితే పార్టీ ఎందుకు పెడతామన్నారు. మీ ఇష్టానికి మాట్లాడితే భయపడాలా అన్నారు. 12 ఏళ్లలో ఒక్క తెలంగాణ నాయకుడిని అయినా ఒక్క మాట అనలేదన్నారు. తనకు పౌరుషం చచ్చిపోలేదని, తెలంగాణపై ప్రేమ కూడా చావలేదన్నారు. ప్రజలు కోరుకున్నప్పుడు మాట్లాడతానన్నారు. తెలంగాణలో జనసేన ఎదగాలని కోరుకుంటున్నానని, ఇక్కడి జర్నలిస్ట్ కాలనీలో ఉన్న జనసేన హెడ్ ఆఫీసును మంగళగిరిలో పెట్టుకున్నానన్నారు. తన గుండెల్లో తెలంగాణ ఉందని, తనను ఎంత తిట్టినా బెదిరిపోనున్నారు. ఏపీలో వైసీపీ గూండాల బెదిరింపుల కంటే ఇక్కడి వాళ్ల బెదిరింపులు ఎక్కువేమీ కాదన్నారు. ఓ విశ్లేషించే వ్యక్తి వల్లే ఈ గొడవ ప్రారంభమైందన్నారు. ఆయన మీడియాలో అమిత్ షా, తాను మాట్లాడుకున్నట్లు చెప్తే దాన్ని ఖండించామన్నారు. తనను ఓ మాట అంటే జనసైనికులు కేసులు పెట్టారని, ఆ విషయం తెలిసి వదిలేయమని చెప్పానన్నారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లు అయినా అభివృద్ది లేకపోవడానికి ఇంకా ఆంధ్రోళ్లు, పవన్ కళ్యాణే కారణమా అని అడిగారు. ఆంధ్రా ప్రజలు, తెలుగు సినీ ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి కారణం మర్రి చెన్నారెడ్డి వంటి నాయకులే అన్నారు. పాలకులు వేరు, ప్రజలు వేరన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన వారిలో పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన్నూ ఉరి తీయాలన్నారు. గుజరాతీలు సూరత్ లో, నాందేడ్ లో స్థానికులు తెలుగు వాళ్లు వద్దని తరిమేస్తే దేశం నిలబడుతుందా అని పవన్ అడిగారు. నాగేశ్వర్ ను ప్రశ్నిస్తే తనకు తెలంగాణ అంటే పడదు, వ్యతిరేకం అని, చెరువు కబ్జా చేశానని ఆరోపణలు చేస్తున్నారని, తనకేం పనిలేదా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అంటే తనకు గౌరవమని, పవన్ కళ్యాణ్ కనుక ఆ చెరువును ఆక్రమించుకున్నాడని తేలితే దాన్ని తెలంగాణ ప్రభుత్వానికి రాసిచ్చేస్తానన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అన్న ఓ అనలిస్ట్ .. వామపక్ష భావజాలాన్ని వదిలి ప్రాంతీయవాదానికి వచ్చారన్నారు. గద్దర్ మీద తన ప్రేమ ఈనాటిది కాదన్నారు. ఆయనకు తాను బండి కొనిచ్చానన్నారు. బతికున్నప్పుడు గద్దర్ కు మీరేం చేశారని ప్రశ్నించారు. ఒకప్పుడు తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పిన వైఎస్ కు కొమ్ముకాసిన వ్యక్తులు ఇవాళ తన నాలుకలు కోస్తామంటున్నారని పవన్ విమర్శించారు. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టి ఆంధ్రకు వస్తే తాను స్వాగతించానని, గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం పెట్టి, గతంలో జనసేనలో పనిచేసిన వ్యక్తిని ఏపీకి అధ్యక్షుడిగా పెడితే స్వాగతించామన్నారు. ఆంధ్రాలో సీఎంకు దిక్కులేని పవన్ కళ్యాణ్.. ఇక్కడ ముఖ్యమంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించారు. కానీ ఇక్కడి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తామనే భయం అన్నారు. 2 వేల మంది జనసైనికులతో సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇవ్వనంటే ఎలా అన్నారు. ఓ అనలిస్ట్ కూర్చుని అమిత్ షా గురించి మాట్లాడితే, తాను దాన్ని ప్రశ్నిస్తే ఇందులో ప్రాంతీయత ఎక్కడ ఉందని, తెలంగాణలో అవమానం ఎక్కడుందని, కులాలు ఎక్కడ వచ్చాయని, మాకు నొచ్చుకునే హక్కు కూడా లేదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పీకలు కోసుకుంటా కానీ తనకు భయం అయితే రాదన్నారు. తెలంగాణలో ఆంధ్రా వాళ్లకు ఏం పని అడుగుతున్నారని, అక్కడి కాంట్రాక్టర్లు ఇక్కడ బాగానే ఉన్నారని, మీరు ఎవరిని పిచ్చోళ్లని చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నిజంగా వద్దనుకుంటే పవన్ కళ్యాణ్ ను రానివ్వబోమని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టాలన్నారు. తన ప్రేమను శంకిస్తే .. ఇప్పటిదాకా నిర్ణయించుకోలేదని, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా.. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేం పోటీ చేస్తామన్నారు. అవసరమైతే తెలంగాణలో తిరిగేందుకు సిధ్దమన్నారు. ప్రతీ సమస్య మీదా మాట్లాడతామనని, ప్రతీ అన్యాయాన్నీ ఎదుర్కొంటానన్నారు. తెలంగాణ భారత్ లో అంతర్భాగమని మర్చిపోవదన్నారు. మీరు బెదిరిస్తే భరించేది లేదన్నారు. దశాబ్దం

జనసేన పార్టీని తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్ లోనే స్థాపించామని, తెలంగాణ మీద తమ పార్టీకి ఉన్న ప్రేమ రాజకీయాలకు అతీతమైందని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తెలిపారు. తన చుట్టు పక్కల ఉన్న నాయకులంతా 2007-08 నుంచి అప్పటి యువరాజ్యంలో ఉన్న నాయకులే అన్నారు. ఈ రోజు కొత్తగా తెలంగాణ మీద తెచ్చుకున్న ప్రేమ తనది కాదన్నారు. తెలంగాణ విభజన సమయంలో వచ్చిన ప్రేమ కాదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆలోచన రాక ముందే ఇక్కడి సంస్కృతి, పోరాట స్ఫూర్తి నుంచి ఉత్తేజం పొందామని, సినిమాలు, సంస్కృతి పరంగా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నామన్నారు. ఇవాళ తమను విమర్శించే గొంతులు 2007లో లేవన్నారు. తాను తెలంగాణ నలుమూలలా పెరిగిన వాడిని, వెళ్లిన వాడిని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని కార్పోరేషన్లలో మువ్వన్నెల జెండా తాము ఎగురవేశామన్నారు. ఇది కొత్తగా వచ్చిన ప్రేమ కాదన్నారు. ఆదిలాబాద్ జిల్లాల్లో, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు తనను విమర్శిస్తున్న నాయకులు ఎప్పుడూ తిరగలేదన్నారు. ఆదిలాబాద్ గోండు తండాల్లో, గెలుస్తానో లేదో తిరగని పరిస్ధితుల్లో తాను తిరిగామన్నారు. ఓట్లు పడతాయని కాదని, తనకు తెలంగాణ అంటే ఇష్టమన్నారు. తెలంగాణపై తనకు ఎంత ప్రేమ ఉందో నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. వారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు జనసేన వ్యతిరేకం కాదని, విభజించిన తీరుకు మాత్రమే వ్యతిరేకమన్నారు. సామాజిక తెలంగాణలో అన్ని కులాలు బాగుండాలని చెప్పి మరీ వచ్చామన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ, ఆంధ్రను విభజించిన తీరు తప్పని మాత్రమే చెప్పానన్నారు. తెలంగాణ సంస్కృతీ, ఇక్కడి ప్రజలకు ఎప్పుడూ తాను వ్యతిరేకం కాదన్నారు.