translateexpand_more

Peddi Teaser News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu01 Jun, 12:43 pm
గ్రాండ్ గా పెద్ది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీగా చేరుకున్న అభిమానులు

పెద్ది ఈవెంట్ గ్రాండ్ జరగనుండటంతో భారీగా అభిమానులు చేరుకోవడంతో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.. విజయవాడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఏర్పాటు చేసిన మూవీ టీమ్.. రామ్ చరణ్ కటౌట్స్ తోపాటు బుచ్చిబాబు, జాన్వీకపూర్ కటౌట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా బుచ్చిబాబు పహిల్వాన్ గెటప్ లో ఉన్న కటౌట్స్ వైరల్ అవుతున్నాయి మరికాసేపట్లో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్ మొదలు కానుంది. ఇప్పటికే స్టేడియం కు భారీగా అభిమానులు చేరుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా జూన్ 1వ తేదీన ( నేడు) విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు ‘పెద్ది’ టీమ్. ఈ వేడుకకు ‘పెద్ది’ చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. అభిమానులు ఇప్పటికే స్టేడియం బయట భారీగా చేరుకున్నారు.. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

TV9 Telugu01 Jun, 05:01 pm
మీకోసం చేతులు విరగకొట్టుకోవడమే కాదు రక్తం చిందిస్తా

రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఇదివరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదివరకే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం దేశవ్యాప్తంగా ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. విజయవాడలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు .. సక్సెస్ మీట్ లా ఉంది. విజయవాడలో చెయ్యాలని అనుకున్నాం.. ఇది మాకు లక్కీయాస్ట్ సిటీ.. ఆ లక్కు కోసమే ఇక్కడకి వచ్చాము.. పెద్ది అన్ని విజువల్స్ చూశారు.. ఎన్నో కథలు వింటుంటాం.. కొన్ని కథలు నచ్చుతాయి, కొన్ని కథలు ఆశ్చర్యపరుస్తాయ్.. కానీ పెద్ది కథ నా గుండెలను తాకిన కథ.. నిజంగా ఇలాంటి సినిమాలు పదేళ్లకు ఒకసారి వస్తాయ్. పెద్ది సినిమా చాలా చేసింది.. వ్యక్తిగతంగా నన్ను ఒక మంచి దారిలోకి మార్చింది.. ఒక యాక్టర్ గా చాలా సంతృప్తి ఇచ్చింది. ఇది మామూలు సబ్జెక్ట్ కాదు.. కిందకి పడి.. పడిన మనిషి లేని ఎలా నిల్చుంటాడో తెలిసేలా చేసిన కథ ఇది.. ఇలాంటి కథ కోసం కాకపోతే ఎప్పుడు కష్టపడతాం..? బహుశా మగధీర, రంగస్థలం, ట్రిపుల్ ఆర్ తర్వాత నాకు పెద్దిలో ఆ అద్భుతం కనిపిస్తుంది.. రాసిపెట్టుకోండి.. ఇండియాలో నెంబర్ 3,4లో టాప్ డైరెక్టర్స్‌లో బుచ్చిబాబు పేరు ఉంటుంది. ఇలాంటి సినిమా ఒప్పుకోవడానికి కారణం అభిమానులే.. మీకోసం చేతులు విరగకొట్టుకోవడమే కాదు రక్తం చిందిస్తా.. నాకు తెలిసింది సినిమా మాత్రమే.. చనిపోయేవరకు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాం.. అలాగే రెహమాన్ గారు 280 రోజులు మేం పని చేస్తే.. దానికి ప్రాణం పోస్తున్నారు.. ఆయనకు థ్యాంక్యూ.. జాన్వీ గారిని చూసి శ్రీదేవి గారు ఎక్కడున్నా గర్వంగా, ఆనందంగా ఫీల్ అవుతుంటారు.. ఎప్పుడైనా ఆట ఓడిపోతే.. ఒక దేశం మొత్తం ఓడిపోయినట్లు.. అలాగే ఈ పెద్ది గాడు ఆటాడలేదు.. పోరాడాడు.. పెద్ది గాడి ఆత్మగౌరవాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్తారని మనస్పూర్తిగా దుర్గమ్మను కోరుకుంటున్నాను.. మీ కుటుంబ సభ్యులను అడిగానని చెప్పండి..

Zee Telugu27 May, 03:23 pm
తెలంగాణలో 'పెద్ది' రిలీజ్ కు లైన్ క్లియర్..మెగాస్టార్ సమక్షంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కీలక నిర్ణయం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. PEDDI Telangana Exhibitors: టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన థియేటర్ల 'పర్సంటేజ్' వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి ఎగ్జిబిటర్లతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ వివాదానికి ముగింపు పడింది. ఇటీవల కాలంలో థియేటర్ల యాజమాన్యాలు (ఎగ్జిబిటర్లు), టాలీవుడ్ నిర్మాతల మధ్య పర్సంటేజ్ విధానంపై పెద్ద చర్చ నడిచింది. అయితే, చిరంజీవి జోక్యంతో త్వరలో విడుదల కాబోతున్న 'పెద్ది' సినిమాను పాత పద్ధతి అయిన రెంటల్ (అద్దె) విధానంలోనే ప్రదర్శించేందుకు ఎగ్జిబిటర్లు అంగీకరించారు. అయితే చర్చల అనంతరం ఇరు వర్గాల మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరింది. భవిష్యత్తులో ఏ సినిమాకైనా ప్రభుత్వం ద్వారా టికెట్ ధరల పెంపును పొందితే, ఆ పెంచిన ధరల ద్వారా వచ్చే లాభాల్లో 7.5 శాతం వాటాను ఎగ్జిబిటర్లకు చెల్లించాలని నిర్ణయించారు. జూన్ 30 తర్వాత కొత్త విధానం.. తెలంగాణ ఎగ్జిబిటర్లు తమ భవిష్యత్తు కార్యాచరణను మెగాస్టార్ చిరంజీవికి వివరించారు. జూన్ 30 తర్వాత థియేటర్లలో విడుదలయ్యే అన్ని సినిమాలను ఖచ్చితంగా 'పర్సంటేజ్' (శాతాల) విధానంలోనే ప్రదర్శిస్తామని వారు స్పష్టం చేశారు. ఎగ్జిబిటర్ల అభిప్రాయాలను విన్న చిరంజీవి వారికి ఒక కీలక సూచన చేశారు. సినిమా ఇండస్ట్రీలో అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఫిలిం ఛాంబర్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం మాత్రమే

Zee Telugu23 May, 02:21 pm
PEDDI Telangana Exhibitors: రిలీజ్‌కు ముందు 'పెద్ది' నిర్మాతలకు షాక్..అడ్డం తిరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!

- జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. - నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. - 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు.