translateexpand_more

Rohit Sharma News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu30 May, 01:17 pm
ఆటగాళ్లకు ముంబై మేనేజ్ మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే

ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ (MI) జట్టులో అంతర్గత విబేధాలు ముదిరిపాకాన పడ్డాయి. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను జట్టు నుండి తప్పించడం ఇక కేవలం కాలం నిర్ణయించాల్సిన విషయమేనని తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ నుండి భారీ ట్రేడింగ్ ఒప్పందం ద్వారా ముంబై జట్టులోకి తిరిగి వచ్చిన హార్దిక్ పాండ్యాకు యాజమాన్యం కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కాదని హార్దిక్‌కు నాయకత్వం ఇవ్వడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే, హార్దిక్ రీ-ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయిందని, అక్కడ తీవ్రమైన 'చేదు అనుభవాలు', విభేదాలు నెలకొన్నాయని నివేదికలు చెబుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. హార్దిక్ జట్టులోకి వచ్చినప్పటి నుండి డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించిన అంతర్గత విషయాలు, రహస్యాలు నిరంతరం బయటకు పొక్కడంపై ముంబై మేనేజ్‌మెంట్ తీవ్ర అసంతృప్తితో ఉంది. సాధారణంగా ప్రతి జట్టులోనూ చిన్న చిన్న భేదాభిప్రాయాలు సహజమే అయినప్పటికీ, ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రస్తుతం ఉన్న గ్రూపు రాజకీయాలు, అసంతృప్తి మునుపెన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయని ఒక అధికారి పేర్కొన్నారు. ఎంతోమంది దిగ్గజాలు, కెప్టెన్సీ మార్పులను చూసిన ఈ ఫ్రాంచైజీలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మైదానంలో ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్, కొందరు ప్లేయర్లు సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద ఎమోజీల వ్యవహారం జట్టులోని చీలికను స్పష్టం చేస్తోంది. ఆటగాళ్లు కేవలం అటెండెన్స్ వేయడానికే వస్తున్నట్లు కనిపిస్తోందని, జట్టు ప్రయోజనాల కంటే సొంత ప్రాధాన్యతలే ఎక్కువయ్యాయని యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో, డ్రెస్సింగ్ రూమ్ విషయాలను బయటకు లీక్ చేసే వారిపై 'జీరో టాలరెన్స్' విధానాన్ని

AP7AM30 May, 04:55 am
రోహిత్ ను ఎంపిక చేసి.. జైస్వాల్ కు అన్యాయం చేశారు

ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను పక్కనపెట్టి, 39 ఏళ్ల రోహిత్ శర్మను ఎంపిక చేయడంపై ఆయన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని తప్పుబట్టారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సెలక్టర్లు జైస్వాల్‌కు ఫోన్ చేసి క్షమాపణ చెప్పాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక స్పోర్ట్స్ పాడ్‌కాస్ట్‌‌లో మంజ్రేకర్ మాట్లాడుతూ.. "చివరిగా ఆడిన వన్డేలో అజేయ శతకం (116) సాధించిన జైస్వాల్‌ను జట్టులోకి తీసుకోకపోవడంలో అర్థం లేదు. మరోవైపు, ఫిట్‌నెస్, ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మకు చోటు కల్పించారు. దీని వెనుక ఉన్న తర్కం ఏంటో వివరించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో రోహిత్‌ను ఎంపిక చేయాల్సి వస్తే, ముందుగా జైస్వాల్‌కు ఫోన్ చేసి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అతను అత్యున్నత స్థాయిలో అద్భుతంగా రాణిస్తున్న యువ కెరటం" అని అన్నారు.2027 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, జట్టు భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన అవసరం ఉందని మంజ్రేకర్ సూచించారు. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ వంటి యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వడం ద్వారా బలమైన జట్టును నిర్మించాలని అభిప్రాయపడ్డారు. మంజ్రేకర్ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

TV9 Telugu31 May, 04:05 am
ముంబై ఇండియన్స్ లో భారీ ప్రక్షాళన..హార్దిక్ పాండ్యాతో పాటు ఆ సీనియర్ స్టార్ బ్యాటర్ కూడా అవుట్

Mumbai Indians : ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీలో రాబోయే సీజన్ నాటికి భారీ మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లోనూ ముంబై జట్టు ఘోర ప్రదర్శనతో నిరాశపరిచింది. 2024లో పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ముంబై, ఈ 2026 సీజన్లోనూ 9వ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో జట్టును పూర్తిగా రీసెట్ చేయాలని యాజమాన్యం గట్టిగా ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వీడటం దాదాపు ఖాయం కాగా.. జట్టులోని మరో సీనియర్ స్టార్ బ్యాటర్‎ను కూడా పక్కన పెట్టేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమవుతోందనే వార్తలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆ సీనియర్ బ్యాటర్‌కు ఆట నుంచి విరామం..? టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ముంబై ఇండియన్స్ జట్టులో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఒక సీనియర్ బ్యాటర్‌ను రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ నాటికి మెల్లగా జట్టు నుంచి ఫేజ్ అవుట్ చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే ఆ ఆటగాడిని పూర్తిగా దూరం పెట్టకుండా.. ఫ్రాంచైజీలో అతనికి ఒక కొత్త బాధ్యత లేదా వేరే రోల్ ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. నివేదికలో సదరు ఆటగాడి పేరును స్పష్టంగా ప్రస్తావించనప్పటికీ, ముంబై జట్టును పూర్తిగా యువ ఆటగాళ్లతో నింపి సరికొత్తగా నిర్మించడానికే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముంబై ఫ్యూచర్ కెప్టెన్ రేసులో ముగ్గురు హార్దిక్ పాండ్యా నిష్క్రమణ వార్తల నడుమ.. ముంబై ఇండియన్స్ తదుపరి కెప్టెన్సీ కోసం ముగ్గురు స్టార్ ప్లేయర్ల పేర్లను పరిశీలిస్తోంది. అందులో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రేసులో ఉన్నారు. ఐపీఎల్ 2026 సీజన్లో

Andhra Jyothy31 May, 03:55 am
భారీ మార్పులకు సిద్ధమవుతున్న ముంబై ఇండియన్స్.. కొత్త కెప్టెన్ అతడేనా

తాజా ఐపీఎల్‌లో ఘోర వైఫల్యం అనంతరం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టులో సమూల మార్పులు జరగబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై ఇప్పటికే పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. హార్దిక్ ముంబై జట్టును వీడబోతున్నాడని, వచ్చే సీజన్‌లో వేలంలోకి వస్తాడని లేదా ట్రేడ్-ఇన్ ద్వారా వేరే జట్టుకు మారతాడని సమాచారం. ఇప్పటికే ఈ విషయమై ముంబై జట్టు యాజమాన్యానికి హార్దిక్ (Hardik Pandya) సమాచారం ఇచ్చాడట.

హార్దిక్‌తో పాటు మరో సీనియర్ బ్యాటర్‌ను కూడా జట్టు నుంచి తప్పించే ఆలోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడిని జట్టు నుంచి తప్పించే వేరే బాధ్యతలు అప్పగించాలనే యోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉన్నట్టు సమాచారం. అయితే ఆ సీనియర్ బ్యాటర్ ఎవరనేది బయటకు రాలేదు. యువ ఆటగాడు తిలక్ వర్మను రాబోయే సీజన్‌కు కెప్టెన్‌గా నియమించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందట. అలాగే జట్టును పూర్తిగా యువ ఆటగాళ్లతో నింపడానికి సిద్ధమవుతోందట (MI Captaincy).

తాజా సీజన్‌లో ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది (Mumbai Indians News). వరుసగా నిరాశాజనక ఫలితాలు రావడంతో ఫ్రాంచైజీ ఇప్పుడు 'రిఫ్రెష్ బటన్' నొక్కడానికి సిద్ధమైందని సమాచారం. ఏదేమైనా రాబోయే రోజుల్లో ముంబై జట్టులో భారీ మార్పులే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..

దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన నౌక.. అమెరికా క్షిపణి దాడి..

బంగారం

NTV Telugu29 May, 05:02 am
తప్పు సరిదిద్దుకుంటున్న ముంబై మేనేజ్ మెంట్.. ఇక అంతా రోహిత్ శర్మ చేతుల్లోనే

Mumbai Indians Captaincy Change for IPL 2027: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్‌ (ఎంఐ)లో భారీ సంక్షోభం నెలకొన్నట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. అంతేకాదు ఎంఐ మేనేజ్‌మెంట్‌తో సంబంధాలు దెబ్బతినడంతో హార్దిక్ ఫ్రాంచైజీని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నాడని సమాచారం. ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించడం ఈ మార్పులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. హార్దిక్ పాండ్యాకు ముంబై మేనేజ్‌మెంట్‌ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి ముంబై తీవ్ర విమర్శలు ఎదుర్కోంటోంది. అభిమానుల నుంచి భారీ వ్యతిరేకత రావడంతో పాటు జట్టు ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇప్పుడు ముంబై మేనేజ్‌మెంట్ తమ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి కొత్త కెప్టెన్ ఎంపికలో రోహిత్ శర్మ అభిప్రాయానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారని సమాచారం. ముంబై తదుపరి కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేసినా.. ఆ నిర్ణయానికి రోహిత్ మద్దతు తప్పనిసరిగా ఉండనుందని తెలుస్తోంది. గతంలో చేసిన తప్పును మళ్లీ పునరావృతం చేయకూడదని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ మళ్లీ ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం మాత్రం లేదని సమాచారం. ‘ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ రోహిత్ ఆశీర్వాదాలతోనే ఎంపిక అవుతాడు. కానీ రోహిత్ మళ్లీ కెప్టెన్ కాలేడు’ అని భారత మాజీ క్రికెటర్, కోచ్ ఒకరు వెల్లడించినట్లు కథనాలు చెబుతున్నాయి. మరోవైపు హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. కెప్టెన్సీ కోల్పోవడమే

10TV Telugu29 May, 06:27 am
హార్దిక్ పాండ్యా మెడ పై వేలాడుతున్న క త్తి! కెప్టెన్సీ పోవ డం ఖాయ మే! ఆట గాడిగా

Hardik Pandya : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియ‌న్స్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. హార్దిక్ పాండ్యా నాయ‌క‌త్వంలో ముంబై జ‌ట్టు లీగ్ ద‌శ నుంచే నిష్ర్క‌మించింది. లీగ్ ద‌శ‌లో 14 మ్యాచ్‌లు ఆడ‌గా నాలుగు అంటే నాలుగే మ్యాచ్‌ల్లో ముంబై విజ‌యం సాధించింది. 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. తొమ్మిదో స్థానంతో సీజ‌న్‌ను ముగించింది. ఈ సీజ‌న్‌లో ఘోర ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంలో జ‌ట్టులో మార్పులు చేయాల‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అందులో భాగంగా కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాను త‌ప్పించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు రోహిత్ శ‌ర్మ స్థానంలో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా హార్దిక్ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. జ‌ట్టులోని సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌తో హార్దిక్ పాండ్యాకు ప‌డ‌డం లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ స‌మ‌యంలోనే సొంత ప్రేక్ష‌కుల నుంచే హార్దిక్‌కు విమ‌ర్శ‌లు ఎదురుఅయ్యాయి. అదే స‌మ‌యంలో ఈ సీజ‌న్‌లో ముంబై జ‌ట్టు అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. అయిన‌ప్ప‌టికి హార్దిక్‌కు మేనేజ్‌మెంట్ మ‌ద్ద‌తు ఇచ్చింది. ఐపీఎల్ 2025లో ముంబై జ‌ట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. దీంతో అంతా చ‌క్క‌బ‌డింద‌ని అనుకున్నారు. GT vs RR : క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు! ర‌ద్దైతే గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌ల‌లో ఫైన‌ల్ చేరేది ఎవ‌రంటే? రోహిత్ శ‌ర్మ‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి భారత జట్టులోని రెగ్యులర్ ఆటగాళ్లు జ‌ట్టులో ఉండ‌డంతో ఐపీఎల్ 2026లో ముంబై ఆధిప‌త్యం చెలాయిస్తుంద‌ని అంతా భావించారు. అయితే.. అంచ‌నాలు త‌ల‌క్రిందులు అయ్యాయి.. తొమ్మిదో స్థానంలో నిల‌వ‌డంతో మేనేజ్‌మెంట్ అసంతృప్తిలో ఉన్న‌ట్లు ఆంగ్ల‌మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. కెప్టెన్సీ పోవ‌డం ఎలాగూ ఖాయ‌మ‌ని, అయితే.. ఆట‌గాడిగానైనా అత‌డు ముంబై జ‌ట్టులో కొన‌సాగుతాడా? లేదా అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఫ్రాంచైజీ అంత‌ర్గ‌త స‌మావేశంలో

Andhra Jyothy29 May, 11:07 am
ముంబై కెప్టెన్ లో మార్పు.. రోహిత్ చెప్పిన ప్లేయర్ కే పగ్గాలు

ఐపీఎల్‌ 2026లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై నుంచి ఇలాంటి ఆటతీరును ఫ్యాన్స్ ఆశించలేదు. స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2026లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై నుంచి ఇలాంటి ఆటతీరును ఫ్యాన్స్ ఆశించలేదు. చాలా మంది స్టార్ ప్లేయర్లున్నా ముంబై జట్టుకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. అయితే, కెప్టెన్ హార్దిక్ పాండ్య తీరు వల్లేనని ఫ్యాన్స్‌ కూడా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ సారథ్యం నుంచి పాండ్య వైదొలుగుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరొక అంశం నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోహిత్ శర్మ చెప్పిన ప్లేయర్‌కే ముంబై కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. 'రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదు టైటిళ్లను సొంతం చేసుకుంది. కానీ, రెండేళ్ల క్రితం రోహిత్‌ వారసుడిగా హార్దిక్‌ పాండ్యను ముంబై యాజమాన్యం నియమించింది. ఇక అప్పటి నుంచి ఎంఐ జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో వచ్చే సీజన్‌కు కొత్త సారథిని నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో చేసిన పొరపాట్లను ముంబై సరిచేసుకొనేలా నిర్ణయం తీసుకోనుంది. రోహిత్ మళ్లీ సారథిగా రాడు. కానీ, కొత్త కెప్టెన్‌కు అతడి మద్దతు తప్పనిసరిగా ఉండాలి’ అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ‘హార్దిక్ పాండ్య వచ్చే సీజన్‌లో జట్టు మారాలని భావిస్తున్నాడు. కేవలం సారథ్యం మాత్రమే కాకుండా.. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకోనున్నాడు. ఎవరైనా

NTV Telugu29 May, 06:48 am
ముంబై ఫ్లాప్ షో వెనుక అసలు కథ బట్టబయలు .. కెప్టెన్ హార్దిక్ కు మేనేజ్ మెంట్ బిగ్

Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత సంచలన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచే పరిణామం చోటుచేసుకోబోతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తొలగించడానికి మేనేజ్‌మెంట్ సిద్ధమైంది. ఈ మేరకు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్ 2026 సీజన్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు.. ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఏకంగా 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ముంబై జట్టు ఇంత ఘోరంగా విఫలం కావడంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ భవిష్యత్తుపై మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి తోడు ముంబై ప్రయాణం ముగిసిన కొన్ని రోజులకే హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేయడం (ఆ తర్వాత మళ్లీ రీయాక్టివేట్ అయింది) ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాదు, కనీసం ఒక ప్లేయర్‌గా అయినా జట్టులో ఉంచాలా వద్దా? అనే దాని అంశంపై ముంబై మేనేజ్‌మెంట్‌లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. “ఈ సీజన్ జరుగుతున్నప్పుడే అతడిని కెప్టెన్‌గా కొనసాగించడం జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇష్టం లేదనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. ముంబై క్యాంప్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్” అని జట్టుకు చెందిన ఓ వ్యక్తి ఈ మీడియా సంస్థకు వెల్లడించారు. ఈ విషయమై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి చెందిన కనీసం ముగ్గురు కీలక వ్యక్తులతో మాట్లాడినట్లు ఆ పత్రిక పేర్కొంది.

TV9 Telugu25 May, 01:59 pm
Hardik Pandya Cost Per Run: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఘోర వైఫల్యం తర్వాత ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై...

Hardik Pandya Cost Per Run: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఘోర వైఫల్యం తర్వాత ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్‌లో ముంబై జట్టు ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగింటిలోనే విజయం స...

Andhra Jyothy23 May, 12:44 pm
అభిమానికి సారీ చెప్పిన రోహిత్ శర్మ.. ఎందుకంటే?

- Home » Sports » rohit sharma apologises to young fan after emotional video goes viral ipl 2026 srav ABN , Publish Date - May 23 , 2026 | 06:14 PM ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఓ అభిమానికి క్షమాపణ చెప్పాడు. - ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియో విడుదల చేశాడు. - అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

Sakshi27 May, 02:59 am
పాటీదార్ ఒక అద్భుతం .. కప్పు గెలిస్తే చరిత్రే

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఆ జట్టును వరుసగా రెండో ఏడాది ఫైనల్ చేర్చడంలో సఫలమయ్యాడు. నాయకుడంటే ముందుండి నడిపించాలి. ఆ మాటలను ఇవాళ పాటీదార్ అక్షరాలా చేసి చూపించాడు. మొదట తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టు భారీ స్కోరు సాధించడంలో పాటీదార్ కీలకపాత్ర పోషించి షాన్‌దార్‌గా నిలిచాడు. త్రుటిలో సెంచరీ చేజారినా, బ్యాటింగ్‌లో పొరపాట్లు ఉన్నా సరే, అతడి విలువైన ఇన్నింగ్స్‌ దానిని మర్చిపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో వరుసగా తన టీమ్‌ను రెండోసారి ఫైనల్‌ చేర్చిన అతను మరో టైటిల్‌ అందిస్తే చరిత్రలో నిలిచిపోతాడనడంలో సందేహం లేదు. గుజరాత్‌పై విజయంతో ఐపీఎల్‌లో ఒక జట్టును వరుసగా రెండుసార్లు ఫైనల్ చేర్చిన కెప్టెన్ల జాబితాలో పాటీదార్ చేరిపోయాడు. గతంలో ఎంఎస్ ధోని (సీఎస్‌కే, 2010, 2011), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్ 2019, 2020), హార్దిక్ పాండ్యా ( గుజరాత్ టైటాన్స్ 2022, 2023), శ్రేయస్ అయ్యర్ (2024లో కేకేఆర్‌, 2025లో పంజాబ్‌) ఈ ఘనత సాధించారు. స్లో పాయిజన్ బ్యాటింగ్‌.. రజత్ పాటీదార్ బ్యాటింగ్ స్టైల్ స్లో పాయిజన్ అని చెప్పొచ్చు. స్లో పాయిజన్‌ మెళ్లిగా ఎక్కినా బలంగా ప్రభావం చూపుతుంది. అదే తరహాలో ముందు స్లోగా ఆడడం.. ఒకసారి కుదురుకున్నాక అతడి విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడం పాటీదార్ స్టైల్‌. 2025 సీజన్‌లో బ్యాటింగ్‌లో కూడా ఫర్వాలేదనిపించే ప్రదర్శన (143.77 స్ట్రైక్‌రేట్‌తో 312 పరుగులు) చేసిన అతను ఈసారి మరింతగా చెలరేగిపోయాడు. టైటిల్‌ సాధించిన నాయకుడిగా వచ్చిన‌ ఆత్మవిశ్వాసం కావచ్చు తాజా సీజన్‌లో అతను అసాధారణ బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తున్నాడు. తాను ఎదుర్కొన్న 247 బంతుల్లో అతను 486 పరుగులు (5 అర్ధసెంచరీలు) సాధించాడు. వీటిలో 29 ఫోర్లు,

TV9 Telugu29 May, 04:38 am
ఐపీఎల్ లో ఘోరంగా ముంచేసిన రోహిత్, పాండ్యా, పంత్.. సోషల్ మీడియాలో స్కామ్ టీమ్ కలకలం

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత కొందరు మల్టీ క్రోర్ ఇంటర్నేషనల్ సూపర్ స్టార్లు తీవ్ర ప్రజా విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ లీగ్‌లో తక్కువ ధరకు అమ్ముడైన అన్‌క్యాప్డ్ ప్లేయర్లు తమ అద్భుత ప్రదర్శనతో అదరగొడితే.. ఫ్రాంచైజీల నుంచి భారీగా జీతాలు తీసుకుని రిటైన్ అయిన కొందరు సీనియర్ స్టార్ ప్లేయర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ఫ్రాంచైజీల నమ్మకాన్ని, వందల కోట్ల రూపాయల డబ్బును బూడిదలో పోసిన పన్నీరు చేసిన ఆటగాళ్లతో కూడిన ఒక స్కామ్ ప్లేయింగ్ ఎలెవన్ లిస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫ్లాప్ లిస్టులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్‌లతో పాటు ఐపీఎల్ లెజెండ్ ఎమ్మెస్ ధోని పేరు కూడా ఉండటం క్రికెట్ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ వివాదాస్పద వైరల్ లైన్-అప్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేరు ప్రముఖంగా కనిపిస్తోంది. సిఎస్‌కే యాజమాన్యం రూ.18 కోట్ల భారీ ధరతో ఇతడిని రిటైన్ చేసుకోగా, ఈ సీజన్‌లోని 14 లీగ్ మ్యాచ్‌లలో కేవలం 28 సగటుతో 337 పరుగులు మాత్రమే చేసి అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మకు కూడా ఈ టోర్నమెంట్ ఒక పీడకలలా మిగిలింది. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా లీగ్ ప్రారంభంలో కొన్ని కీలక మ్యాచ్‌లకు దూరమైన రోహిత్, ఆ తర్వాత జట్టులోకి వచ్చినా ఫామ్ అందుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. రూ.16.30 కోట్ల భారీ ధర కలిగిన హిట్ మ్యాన్.. తాను ఆడిన 9 మ్యాచ్‌లలో కేవలం 283 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ ఏడాది ఐపీఎల్ పాయింట్ల పట్టికలో

Sakshi31 May, 12:06 pm
గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం! రోహిత్ శర్మకు భారీ షాక్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వన్డే వరల్డ్‌కప్‌-2027లో టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆడుతాడా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 39 ఏళ్ల రోహిత్‌ శర్మ ప్రస్తుతం ఫిట్‌నెస్‌ సమస్యలతో సతమవుతున్నాడు. తొడ కండరాల గాయం కారణంగా ఐపీఎల్‌-2026లో రోహిత్‌ కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత పునరాగమనం చేసినప్పటికి పూర్తి ఫిట్‌నెస్‌తో మాత్రం హిట్‌మ్యాన్‌ కనిపించలేదు. కేవలం