translateexpand_more

Tgpsc Job Notifications 2026 News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu03 Jun, 03:39 am
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మూడు నోటిఫికేషన్లు జారీ.. దరఖాస్తు, పరీక్షల తేదీలు ఇవే

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. TGPSC Job Notifications 2026: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ మూడు ఉద్యోగ నోటిఫికేషన్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. రోడ్లు, భవనాల శాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి శాఖల్లో మొత్తం 290 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మూడు నోటిఫికేషన్లలో మొత్తం పోస్టుల ఖాళీల సంఖ్య - 290 ఆర్అండ్‌బీ శాఖలో ఏఈఈ సివిల్ పోస్టుల సంఖ్య - 222 ఏఈఈ ఎలక్ట్రికల్ పోస్టుల సంఖ్య - 49 పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పోస్టుల సంఖ్య - 19 వీటిలో ఏఈఈ (సివిల్) పోస్టులకు జూన్ 6 నుంచి జూలై 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా.. ఏఈఈ (ఎలక్ట్రికల్) పోస్టులకు జూన్ 8 నుంచి జూలై 15 వరకు, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పోస్టులకు జూన్ 10 నుంచి జులై 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోనేవారికి 18 నుంచి 44 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి. ఆర్‌అండ్‌బీ శాఖలోని 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (సివిల్ ) పోస్టులకు, 49 ఏఈఈ ఎలక్ట్రికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి అక్టోబరు నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ల పోస్టులకు సెప్టెంబర్ నెలలో పరీక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ నిరంతర ప్రక్రియ అని.. ఈ నెలలోనే 1800 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. ఈ నెలలోనే టీజీపీఎస్సీ నుంచి ఇంజనీరింగ్, పీసీబీ, అటవీశాఖ, టౌన్ ప్లానింగ్, విద్యాశాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్లు రానున్నట్లు తెలిపారు. ఇప్పటికే న్యాయపరమైన సమస్యలు లేకుండా 67 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. Also Read: Dance Master Pandu Accident: లొడగలవానిపాలెం హైవేపై ఘోర ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు వాహనానికి యాక్సిడెంట్! Also Read: Tirumala: నారాయణవనం వేంకటేశ్వరునికి తిరుమల శ్రీవారి అపురూప కానుక.. ఆ నగల ప్రత్యేకత ఏంటో తెలుసా? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి