translateexpand_more

Thalliki Vandanam News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu31 May, 11:05 am
తల్లికి వందనం.. కీలక ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం.. డబ్బులు పడేది అప్పుడే

Talliki Vandanam: ఏపీలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో తల్లికి వందనం ఒకటి. ఈ పథకం ప్రతి ఏటా రూ.15 వేలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇందులో రూ.13 వేలు విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన రూ.2 వేలు సూళ్ల నిర్వహణ కోసం వినియోగిస్తారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ సాయం అందజేస్తుంది. ఈ ఏడాది తల్లికి వందనం అమలుకు చంద్రబాబు సర్కార్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కీలక ప్రక్రియను ప్రారంభించింది. స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ ఆధార్, ఇతర వివరాలు సేకరించిన ప్రభుత్వం వాటిని సచివాలయాలకు పంపింది. అక్కడ వీటిని హౌస్ హోల్డ్ డేటా బేస్ తో సరిపోలుస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తవగానే నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. జూన్ 12వ తేదీ కల్లా తల్లికి వందనం నిధులు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులైన విద్యార్థులు, వారి తల్లుల వివరాలను సచివాలయాలకు పంపారు. అక్కడ హౌస్ హోల్డ్ డేటాబేస్ తో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు. ఈ వెరిఫికేషన్ మాడ్యూల్ నవశకం లబ్దిదారుల మేనేజ్ మెంట్ పోర్టల్ లో అందుబాటులో ఉంటుంది. తల్లి అందుబాటులో ఉంటే ఆమెను హౌస్ హోల్డ్ డేటాబేస్ లో చేర్చాలి. లేదంటే తండ్రి లేదా గార్డియన్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థి, తల్లి వేర్వేరు కుటుంబాలలో ఉంటే మైగ్రేషన్ ఆప్షన్ ద్వారా ఇద్దరినీ ఒకే ఇంటి కిందకు తీసుకొస్తారు. ఇక, ఒకే తల్లికి నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లి పిల్లలందరూ ఆ తల్లికే జన్మించారా లేదా అనేది వెరిఫై చేయాల్సి

Zee Telugu31 May, 07:46 am
తల్లికి వందనం' డబ్బు అకౌంట్లో జమ కావాలంటే..ఈసారి అధికారులు ఇవి చెక్ చేస్తారు జాగ్రత్త

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Thalliki Vandanam Scheme Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. ఈ ఏడాది అర్హులైన లబ్ధిదారులకు రూ.13,000 జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వం డేటా వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. పాఠశాలల నుంచి సేకరించిన విద్యార్థుల ఆధార్, ఇతర వివరాలను ప్రభుత్వం ఇప్పటికే గ్రామ/వార్డు సచివాలయాలకు పంపింది. అక్కడ ఈ వివరాలను హౌస్‌హోల్డ్ డేటాబేస్ తో సరిపోల్చే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే నిధుల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయనుంది. సచివాలయాల్లో వెరిఫికేషన్ ఎలా? సచివాలయాల్లోని వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఈ పరిశీలన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 'నవశకం లబ్ధిదారుల మేనేజ్‌మెంట్ పోర్టల్'లో ప్రత్యేక మాడ్యూల్‌ను అందుబాటులో ఉంచారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ వెరిఫికేషన్ వర్తిస్తుంది. డేటా పరిశీలనలో ఎదురవుతున్న 5 ప్రధాన సమస్యలను పరిష్కరిస్తూ అధికారులు తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు. 1) లబ్ధిదారుల జాబితాలో తల్లి అందుబాటులో ఉంటే ఆమెను హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో చేర్చుతారు. ఒకవేళ తల్లి లేనిపక్షంలో తండ్రి లేదా సంరక్షకుడి వివరాలను నమోదు చేస్తారు. 2) ఒకవేళ విద్యార్థి, తల్లి వేర్వేరు కుటుంబ ఐడీలలో ఉంటే.. 'మైగ్రేషన్ ఆప్షన్'

10TV Telugu02 Jun, 12:30 am
తల్లికి వందనం.. మీకు డబ్బులు పడతాయో లేదో ఇలా తెలుసుకోండి.. సింపుల్ ప్రాసెస్

Talliki Vandanam: ఏపీలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో తల్లికి వందనం ఒకటి. ఈ పథకం ప్రతి ఏటా రూ.15 వేలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇందులో రూ.13 వేలు విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన రూ.2 వేలు సూళ్ల నిర్వహణ కోసం వినియోగిస్తారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ సాయం అందజేస్తుంది. మరి తల్లికి వందనం స్కీమ్ వర్తిస్తుందో లేదో, అర్హులో కాదో తెలుసుకోవడం ఎలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దానికి ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది. bm-sgsw.ap.gov.in/ సైట్‌లోకి వెళ్లాలి. అందులో స్కీమ్ ఎలిజిబిలిటీపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. స్కీమ్ టైప్‌లో తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఇయర్ లో ఇయర్ ఎంటర్ చేసి గెట్ డీటైల్స్‌పై క్లిక్ చేయాలి. వెంటనే ఆధార్ లింకైన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే లబ్ధిదారు సమాచారం కనిపిస్తుంది. అందులో ఏమైనా తప్పులుంటే సచివాలయాల్లో సంప్రదించాలి. ఇక, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.9,668 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. గతేడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్‌ 12నే అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసింది సర్కార్. ఈ ఏడాది కూడా అదే తేదీన నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒకటవ తరగతి నుంచి ఇంటర్‌ చదివే విద్యార్థుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా పథకం వర్తించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తుండగా.. ఇందులో తల్లుల ఖాతాలో రూ.13 వేలు జమ చేస్తున్నారు. మిగతా రూ.2 వేలు పాఠశాల నిర్వహణ నిమిత్తం వాడుతున్నారు. తల్లికి వందనం స్కీమ్ లబ్ధి పొందాలంటే తల్లుల బ్యాంకు ఖాతా, మొబైల్ కి ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి. కుటుంబ సభ్యుల మ్యాపింగ్‌ కూడా కీలకమే. అర్హులైన వారు బ్యాంకుకి వెళ్లి ఖాతా స్టేటస్ ను చెక్ చేసుకోవాలి. ఆధార్, బ్యాంకు ఖాతా, మొబైల్ నెంబర్ ఒకదానితో ఒకటి లింకై ఉండాలి. Also Read: మీ జాబ్ మానేశారా? EPFO పోర్టల్‌లో మీ ఎగ్జిట్ తేదీని అర్జెంట్‌గా అప్‌డేట్ చేయండి!

10TV Telugu26 May, 04:07 am
బిగ్ అలర్ట్.. తల్లికి వందనం కింద రూ.13వేలు రావాలంటే వెంటనే ఇలా చేయండి..

Thalliki Vandanam : ఏపీలోని కూటమి ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద కుటుంబంలోని పిల్లలందరినీ అర్హులుగా నిర్దారించింది. ఇందులో భాగంగా బడికి వెళ్లే ప్రతీ విద్యార్థికి రూ.15వేలు చొప్పున నగదు జమ చేస్తోంది. ఇందులో రూ.2వేలు పాఠశాల నిర్వహణ ఖర్చులకు జమ చేస్తుండగా.. మిగిలిన రూ.13వేలు విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. Also Read : Andhrapradesh : ఏపీలోని మహిళలకు గుడ్‌న్యూస్.. కేజీబీవీల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. రాత పరీక్షలేదు.. ఖాళీల వివరాలివే.. గతేడాది ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది జూన్ నెలలో మరోసారి తల్లికి వందనం నిధులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమైంది. జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈనెలలోనే పాఠశాలలు ప్రారంభమైన కొద్దిరోజులకే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సంవత్సరం ఆధార్ అనుసంధానం కాకపోవడంతో పలు జిల్లాల్లో అనేకమంది అర్హత ఉండికూడా తల్లికి వందనం పథకంకు దూరమయ్యారు. అయితే, గతంలో ఇబ్బందులు మరోసారి తలెత్తకుండా ముందస్తుగా బ్యాంకు అకౌంట్‌తో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని విద్యాశాఖ ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది. అలాగే బ్యాంకుకు వెళ్లి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసుకోవాలని పేర్కొంది.