translateexpand_more

Students News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu31 May, 11:05 am
తల్లికి వందనం.. కీలక ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం.. డబ్బులు పడేది అప్పుడే

Talliki Vandanam: ఏపీలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో తల్లికి వందనం ఒకటి. ఈ పథకం ప్రతి ఏటా రూ.15 వేలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇందులో రూ.13 వేలు విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన రూ.2 వేలు సూళ్ల నిర్వహణ కోసం వినియోగిస్తారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ సాయం అందజేస్తుంది. ఈ ఏడాది తల్లికి వందనం అమలుకు చంద్రబాబు సర్కార్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కీలక ప్రక్రియను ప్రారంభించింది. స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ ఆధార్, ఇతర వివరాలు సేకరించిన ప్రభుత్వం వాటిని సచివాలయాలకు పంపింది. అక్కడ వీటిని హౌస్ హోల్డ్ డేటా బేస్ తో సరిపోలుస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తవగానే నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. జూన్ 12వ తేదీ కల్లా తల్లికి వందనం నిధులు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులైన విద్యార్థులు, వారి తల్లుల వివరాలను సచివాలయాలకు పంపారు. అక్కడ హౌస్ హోల్డ్ డేటాబేస్ తో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు. ఈ వెరిఫికేషన్ మాడ్యూల్ నవశకం లబ్దిదారుల మేనేజ్ మెంట్ పోర్టల్ లో అందుబాటులో ఉంటుంది. తల్లి అందుబాటులో ఉంటే ఆమెను హౌస్ హోల్డ్ డేటాబేస్ లో చేర్చాలి. లేదంటే తండ్రి లేదా గార్డియన్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థి, తల్లి వేర్వేరు కుటుంబాలలో ఉంటే మైగ్రేషన్ ఆప్షన్ ద్వారా ఇద్దరినీ ఒకే ఇంటి కిందకు తీసుకొస్తారు. ఇక, ఒకే తల్లికి నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లి పిల్లలందరూ ఆ తల్లికే జన్మించారా లేదా అనేది వెరిఫై చేయాల్సి

Oneindia Telugu31 May, 06:03 am
తల్లికి వందనంపై కీలక అప్డేట్..! ఈసారి డబ్బుల జమకు ఇలా

ఏపీలో ఈ ఏడాది తల్లికి వందనం (Talliki Vandanam) పథకం కింద రూ.13 వేలు అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకోసం ముందుగా పాఠశాలల నుంచి విద్యార్దుల ఆధార్, ఇతర వివరాలు సేకరించిన ప్రభుత్వం .. వాటిని సచివాలయాలకు పంపింది. అక్కడ వీటిని హౌస్ హోల్డ్ డేటా బేస్ తో సరిపోలుస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తి కాగానే నిధుల విడుదలకు రంగం సిద్దం చేస్తున్నారు. తల్లీ వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులు, వారి తల్లుల వివరాలను ఇప్పటికే సచివాలయాలకు పంపారు. అక్కడ హౌస్ హోల్డ్ డేటాబేస్ తో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు. సచివాలయాల్లోని ల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (WEA) లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ (WWES) ఈ వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. ఈ వెరిఫికేషన్ మాడ్యూల్ నవశకం లబ్దిదారుల మేనేజ్ మెంట్ పోర్టల్ లో (Beneficiary Management Portal) అందుబాటులో ఉంటుంది. తల్లి అందుబాటులో ఉంటే ఆమెను హౌసోల్డ్ డేటాబేస్లో చేర్చాలి. లేనిపక్షంలో తండ్రి లేదా గార్డియన్ వివరాలను నమోదు చేయాలి. విద్యార్థి, తల్లి వేర్వేరు కుటుంబాలలో ఉంటే మైగ్రేషన్ ఆప్షన్ ఉపయోగించి వారిద్దరినీ ఒకే ఇంటి కిందకు తీసుకువస్తారు. ఒకే తల్లికి నలుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే .. క్షేత్రస్థాయికి వెళ్లి పిల్లలందరూ ఆ తల్లికే జన్మించారా లేదా అనేది వెరిఫై చేసి, సరైన రిమార్కులు నమోదు చేస్తారు. విద్యార్థి మరియు తల్లికి ఒకే ఐడీ నంబర్ ఉంటే సదరు ఐడీ నంబర్ ను సరైన వ్యక్తికి ట్యాగ్ చేసి, రెండో వ్యక్తి యొక్క అసలైన ఐడీ వివరాలను సేకరించి అప్డేట్ చేస్తారు. ఈ పరిశీలన ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ వర్తిస్తుంది. డేటా వెరిఫికేషన్ సకాలంలో,

Sakshi30 May, 12:43 am
సీబీఐతో విచారించాలి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శ్రీకాకుళంలో ధర్నా చేస్తున్న ధర్మాన కృష్ణదాసు, వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి నాయకులు విద్యామంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలి దగా డీఎస్సీపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనల వెల్లువ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు లోకేశ్‌కు ఉద్యోగం.. నిరుద్యోగులకు శఠగోపం అంటూ మండిపాటు సాక్షి, అమరావతి, సాక్షి నెట్‌వర్క్‌: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కారు దగా చేసిందని టీచర్‌ పోస్టుల అభ్యర్థులు,

10TV Telugu02 Jun, 12:30 am
తల్లికి వందనం.. మీకు డబ్బులు పడతాయో లేదో ఇలా తెలుసుకోండి.. సింపుల్ ప్రాసెస్

Talliki Vandanam: ఏపీలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో తల్లికి వందనం ఒకటి. ఈ పథకం ప్రతి ఏటా రూ.15 వేలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇందులో రూ.13 వేలు విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన రూ.2 వేలు సూళ్ల నిర్వహణ కోసం వినియోగిస్తారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఈ సాయం అందజేస్తుంది. మరి తల్లికి వందనం స్కీమ్ వర్తిస్తుందో లేదో, అర్హులో కాదో తెలుసుకోవడం ఎలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దానికి ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది. bm-sgsw.ap.gov.in/ సైట్‌లోకి వెళ్లాలి. అందులో స్కీమ్ ఎలిజిబిలిటీపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. స్కీమ్ టైప్‌లో తల్లికి వందనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఇయర్ లో ఇయర్ ఎంటర్ చేసి గెట్ డీటైల్స్‌పై క్లిక్ చేయాలి. వెంటనే ఆధార్ లింకైన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే లబ్ధిదారు సమాచారం కనిపిస్తుంది. అందులో ఏమైనా తప్పులుంటే సచివాలయాల్లో సంప్రదించాలి. ఇక, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.9,668 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. గతేడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్‌ 12నే అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసింది సర్కార్. ఈ ఏడాది కూడా అదే తేదీన నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఒకటవ తరగతి నుంచి ఇంటర్‌ చదివే విద్యార్థుల వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా పథకం వర్తించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇస్తుండగా.. ఇందులో తల్లుల ఖాతాలో రూ.13 వేలు జమ చేస్తున్నారు. మిగతా రూ.2 వేలు పాఠశాల నిర్వహణ నిమిత్తం వాడుతున్నారు. తల్లికి వందనం స్కీమ్ లబ్ధి పొందాలంటే తల్లుల బ్యాంకు ఖాతా, మొబైల్ కి ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి. కుటుంబ సభ్యుల మ్యాపింగ్‌ కూడా కీలకమే. అర్హులైన వారు బ్యాంకుకి వెళ్లి ఖాతా స్టేటస్ ను చెక్ చేసుకోవాలి. ఆధార్, బ్యాంకు ఖాతా, మొబైల్ నెంబర్ ఒకదానితో ఒకటి లింకై ఉండాలి. Also Read: మీ జాబ్ మానేశారా? EPFO పోర్టల్‌లో మీ ఎగ్జిట్ తేదీని అర్జెంట్‌గా అప్‌డేట్ చేయండి!

Zee Telugu29 May, 04:58 pm
రేపు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు! ఎక్కడ? ఎందుకంటే

Tomorrow Public Holiday On May 20th: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఒక సెలవు ముగిసిన తర్వాత ఒక రోజు విరామం తర్వాత మరో సెలవు వచ్చేసింది. అన్నీ విద్యా సంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు రేపు సెలవు రానుంది. ఎందుకు? ఎక్కడ ఈ సెలవు లభించిందో తెలుసుకుందాం. ఒక రోజు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు మరో సెలవు లభించింది. దీంతో ఒక రోజు విరామం తర్వాత వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ప్రాథమిక, ఇంటర్‌ విద్యార్థులకు ఇప్పటికే సెలవులు ఉండగా ఉన్నత స్థాయి ఉద్యోగులకు సెలవు రేపు ఉండనుంది. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు స్థానిక వ్యాపారాలు, ఇతర విద్యాసంస్థలకు రేపు సెలవు ఉండనుంది. అందాల తీర ప్రాంతం.. కేంద్ర పాలిత ప్రాంతమైన గోవాలో రేపు పబ్లిక్‌ హలీడే ఉంది. ఎందుకంటే మే 30వ తేదీ గోవా ఆవిర్భావ దినోత్సవం. భారతదేశంలో గోవా ప్రాంతం మే 30వ తేదీన విలీనమైనది. ఈ సందర్భంగా ప్రతియేటా ఈ రోజు గోవా అవతరణ దినోత్సవం నిర్వహించుకుంటున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో పబ్లిక్‌ హలీడే ఉంది. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు, అన్నీ విద్యా సంస్థలతోపాటు స్థానిక వ్యాపారస్తులకు కూడా సెలవుగా ప్రకటించారు. పబ్లిక్‌ హలీడే అంటే ఆరోజు అన్నీ బంద్‌ ఉంటాయి. విద్యాసంస్థలు.. దుకాణాలు, మార్కెట్లు బంద్‌ ఉంటాయి. ఆర్‌బీఐ సెలవుల క్యాలెండర్‌లో రేపు సెలవు లేకపోయినా బ్యాంకులు సెలవు ఉండే అవకాశం ఉంది. ప్రాంతీయపరంగా రేపు బ్యాంకులు సెలవు తీసుకోనే అవకాశం ఉంది. గోవా పర్యాటక ప్రాంతం కావడంతో పర్యాటకంగా కూడా మే 30వ తేదీన అన్నీ బంద్‌ ఉండే అవకాశం ఉంది. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలి. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కూడా ఉండడంతో ప్రజలు ఈ

Sakshi28 May, 12:39 am
ఎస్ ఎస్ సీ బోర్డు నిర్లక్ష్యం

ఇష్టానుసారంగా పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన విద్యార్థికి ఇంగ్లిష్‌ రీవాల్యుయేషన్‌లో పెరిగిన 11 మార్కులు.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఓ విద్యార్థికి ఫిజిక్స్‌లో 5 మార్కులు కోత బేతంచెర్ల: ఎస్‌ఎస్‌సీ బోర్డు నిర్లక్ష్యం మరో సారి వెలుగులోకి వచ్చింది. ఇష్టానుసారంగా జవాబు పత్రాలు మూల్యాంకనం చేయడంతో విద్యార్థుల మార్కులు తలకిందులయ్యాయి. కనీసం రాసిన జవాబులు కూడా మూల్యాంకనం చేయకపోవడం వాల్యూయేషన్‌ జరిగిన తీరుకు అద్దంపడుతోంది. మరి కొందరికి వచ్చిన మార్కులు కూడా కలపలేదు. తమకు మార్కులు తక్కువ వచ్చాయని రీవాల్యూయేషన్, రీ వెరిఫికేషన్‌కు పలువురు విద్యార్థులు వెళ్లడంతో బోర్డు వైఫల్యం బహిర్గతమైంది. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో బోర్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇంకెంత మంది బాధితులు ఉన్నారో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాధానాలు రాసినా.. వదిలేశారు.. నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణానికి చెందిన కె.వసుప్రజ్వల (హాల్‌ టికెట్‌ నెం.2622123572)కు పదోతరగతి ఫలితాల్లో సోషల్‌లో 100, గణితం 100, సైన్స్‌లో 92, తెలుగు 92, హిందీలో 94 మార్కులు రాగా.. ఇంగ్లి‹Ùలో 65 మార్కులే రావడంతో అనుమానం వచ్చింది. దీంతో రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేయగా ఏకంగా 11 మార్కులు పెరిగి 76 మార్కులు నమోదయ్యాయి. అనంతరం ఆన్సర్‌ షీట్‌ను పరిశీలించగా 36, 37 ప్రశ్నలకు సమాధానాలు రాసినా దిద్దకుండా వదిలేసినట్లు గుర్తించారు. రీవాల్యుయేషనలో 11 మార్కులు పెరగడం ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. మిగిలిన రెండు ప్రశ్నలకు కూడా మార్కులు కేటాయిస్తే తమ కుమార్తెకు మరిన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. 12 మార్కులకు గానూ.. 7 డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం

Sakshi26 May, 05:39 am
ఇతిహాసాల్లో ఇంధన సంక్షోభానికి పరిష్కారాలు

రాజ్‌గిర్‌: బిహార్‌లోని నలంద విశ్వవిద్యాలయం అంతర్జాతీయ సంబంధాల అధ్యయనంలో నూతన పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. నేటి ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలను, రామాయణ-మహాభారతాలలోని సూత్రాలతో ఎలా పరిష్కరించవచ్చనే అంశంపై పరిశోధనలు సాగిస్తోంది. ప్రపంచంలోని 30కి పైగా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు భారతదేశ పురాణ ఇతిహాసాలను దౌత్యపరమైన ఆయుధాలుగా మలుచుకుంటూ అంతర్జాతీయ సంబంధాల (ఐఆర్‌పీఎస్‌) విభాగంలో సరికొత్త విశ్లేషణలు చేస్తున్నారు. ఇతిహాసాలే దౌత్య మార్గదర్శకాలు నలంద వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది తెలిపిన వివరాల ప్రకారం ఈ కోర్సు ముఖ్య ఉద్దేశ్యం మన పురాతన జ్ఞాన సంపదను ఆధునిక ప్రపంచ సమస్యలతో అనుసంధానించడమే. ఒక సంక్షోభ సమయంలో భారతదేశం తన వ్యూహాలను ఎలా రూపొందించుకోవాలి? అగ్రరాజ్యాల మధ్య సంబంధాలను ఎలా నిర్వహించాలి? వంటి ప్రశ్నలకు పురాతన భారతీయ గ్రంథాలు గొప్ప పరిష్కారాలను చూపుతున్నాయని ఆయన వెల్లడించారు. రామాయణం - సుగ్రీవ మైత్రి ఒక వ్యూహం ఈ కోర్సులో భాగంగా విద్యార్థులు వివిధ పరిశోధనా పత్రాలను సమర్పిస్తున్నారు. ఉదాహరణకు, ‘రామాయణంలోని కిష్కింధ కాండ’ దౌత్యం, సార్వభౌమాధికారం, నైతికతకు ఒక అద్భుతమైన ఫ్రేమ్‌వర్క్ అని ఒక విద్యార్థి తన పరిశోధనలో పేర్కొన్నారు. రాముడు-సుగ్రీవుల మధ్య కుదిరిన మైత్రి కేవలం స్నేహం మాత్రమే కాదు, అది ఆధిపత్యం లేని భాగస్వామ్యం, బాధ్యతాయుతమైన నాయకత్వానికి ప్రతీక అని విద్యార్థులు వివరిస్తున్నారు. మహాభారతం - నేటి ప్రపంచానికి సరికొత్త పాఠాలు మహాభారతంలోని శ్రీకృష్ణుడి నీతిని, ప్రస్తుత యుద్ధ తంత్రాలతో పోల్చి చూస్తున్నారు. ‘జస్ట్ వార్’ భావనను మహాభారత ఘట్టాలతో అనుసంధానిస్తూ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ఉగ్రవాద సంస్థలు లేదా అరాచక శక్తులను ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులు విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా పురాతన పర్యావరణ పరిరక్షణ పద్ధతుల ద్వారా ప్రస్తుత ఇంధన సంక్షోభాన్ని

10TV Telugu26 May, 08:03 am
విద్యార్థులకు ఊరట.. స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పెంచిన ప్రభుత్వం.. ఇదే లాస్ట్ ఛాన్స్..

Scholarship : తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు ఊరటనిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్‌లో ఫ్రెష్, రెన్యువల్ స్కాలర్‌షిప్‌ల మంజూరుకోసం కళాశాలలు, విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే చివరి తేదీని మే 31 వరకు ప్రభుత్వం పొడిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఒక ప్రకటనలో తెలిపారు. Also Read : Indiramma Bheema Scheme : ఒక్క రూపాయి చెల్లించకుండా రూ.5లక్షలు ఉచిత బీమా.. అర్హులు వీరే.. అమల్లోకి ఎప్పటి నుంచంటే? ఉపకార వేతనాల ప్రక్రియను పారదర్శకంగా అమలు చేసేందుకు వీలుగా 2025-26 విద్యా సంవత్సరంలో రిజిస్ట్రేషన్ గతేడాది జులై 1న ప్రారంభంకాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగుల నుంచి 10,89,265 మందికి గాను 10,20,688 మంది మాత్రమే నమోదయ్యారు. గతేడాది నమోదు కంటే ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 68,597 తక్కువ ఉంది. సాంకేతిక సమస్యల కారణంగా ఆ విద్యార్థులు నిర్ణీత తేదీలోపు తమ దరఖాస్తును నమోదు చేసుకోలేక పోయినట్లు అధికారులు గుర్తించారు. కాలేజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి ఎంఎస్సీ (నర్సింగ్), ఎంపీటీ, ఎన్ పీహెచ్, ఎన్ పీసీసీ, ఎన్ పీఎం తదితర కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. అయితే, సెట్ డేటా ఇంకా ఈపాస్ వెబ్ సైట్ కు అప్లోడ్ కాలేదు. అన్ని విషయాలనేు దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల సౌలభ్యం కోసం మరోసారి రిజిస్ట్రేషన్ గడువును పొడిగించినట్లు సబ్యసాచి ఘోష్త తెలిపారు.

Sakshi23 May, 09:10 pm
ఏఐతో కంబైన్డ్‌ స్టడీ!

- May 24 2026 2:02 AM | Updated on May 24 2026 2:02 AM కృత్రిమ మేధ సాయంతో విద్యార్థులకు సులువైన, ఒత్తిడిలేని చదువు చదువుకోవడానికి పక్కా టైంటేబుల్‌ ఉంటే సగం విజయం సాధించినట్లే. - ఇందుకోసం తాజాగా అందుబాటులోకి వచ్చిన ఏఐ టూల్స్‌ సహాయంతో విద్యార్థులు చాలా తేలికగా, ఒత్తిడి లేకుండా చదువుకొని పరీక్షల్లో పాసైపోవచ్చు. - –సాక్షి స్పెషల్‌ డెస్క్ పోమోడోరో టెక్నిక్‌ గంటల తరబడి బ్రేక్‌ లేకుండా చదివితే బుర్రకెక్కదు.

Sakshi27 May, 12:41 am
కొత్త కోర్సులతో దోస్తీ కట్

దోస్త్‌ పోర్టల్‌ నుంచి పది కొత్త డిగ్రీ కోర్సులు మాయం కొత్త వాటి కోసం ఉన్నవాటిని వదులుకున్న వైనం.. ఎమర్జింగ్‌ కోర్సుల నిలిపివేతపై విద్యార్థుల ఆగ్రహం మండలి, సాంకేతిక విద్య వివాదంతో విద్యార్థులకు నష్టం రంగంలోకి ప్రభుత్వం... అధికారుల మధ్య రాజీకి యత్నం ఎవరికి వారు తగ్గేదేలేదంటున్న ఉన్నతాధికారులు సాక్షి, హైదరాబాద్‌: ఏడాది కాలంగా కసరత్తు చేసి, విద్యార్థులను ఊదరగొట్టిన పది కొత్త కోర్సులకు మంగళం పాడే పరిస్థితి ఏర్పడింది. డిగ్రీ ఆన్‌లైన్‌ సిస్టమ్‌ (దోస్త్‌) నుంచి వీటిని తొలగించారు. ఈ కోర్సుల కోసం ఉన్నత విద్యామండలి వెచ్చించిన లక్షలాది రూపాయలు బూడిదపాలవుతోంది. ఈ కోర్సుల్లో చేరేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్న విద్యార్థులు తీవ్ర నిరాశలోకి వెళ్లారు. కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తులు కూడా సమర్పించిన దాదాపు 260 కాలేజీల పరిస్థితి అయోమయంలో పడింది. కొత్త కోర్సుల కోసం ఈ కాలేజీలు ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా వదులుకున్నాయి. కొత్తవి రాక, ఉన్నవి రద్దవ్వడంతో కాలేజీ యాజమాన్యాలు ఆందోళనలో ఉన్నాయి. ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యా విభాగం మధ్య కోల్డ్‌ వార్‌ దీనికి కారణం. ఈ వ్యవహారాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు కొత్త కోర్సుల రద్దుపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. రాజీకి అధికారులు మాత్రం తగ్గేదేలేదంటూ భీషి్మంచుకున్నారు. పెద్ద ఎత్తున నిధులు కొన్నేళ్లుగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. 4.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నా చేరేవారి సంఖ్య 2.25 లక్షలు దాటడం లేదు. ఇంజనీరింగ్‌తో సమానంగా డిగ్రీ కోర్సులను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆదేశం మేరకు ఉన్నత విద్యామండలి ఏడాదిపాటు నిపుణులను నియమించుకుని, దాదాపు రూ.25 లక్షల వరకూ వెచ్చించి, డిగ్రీ

Zee Telugu28 May, 04:57 am
విద్యార్థులకు బంపర్ న్యూస్.. రూ. 258 కోట్లు విడుదల.. నేరుగా వారి అకౌంట్లలోనే జమ

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Andhra Pradesh Government Releases Rs 258 Cr Fee Reimbursement: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 258 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిధులను నేరుగా ఆయా కాలేజీ బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో అనేక మార్పులు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను స్టూడెంట్స్ తల్లుల ఖాతాల్లో జమ చేసేవారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం విద్యాసంస్థల ఆర్థిక నిర్వహణను సులభతరం చేసేందుకు గాను.. నేరుగా కాలేజీల అకౌంట్లలోనే ఈ నిధులను జమ చేసేందుకు నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తుంది. గత బకాయిలతో కలిపి రాష్ట్రంలో మొత్తం రూ. 4,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు పెండింగ్ ఉండగా.. ఏపీ ప్రభుత్వం వాటిని విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించింది. దీని గురించి ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ విడుదల ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం ఒకేసారి దాదాపు రూ. 1,200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసి విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాలకు భారీ ఊరట కలిగించింది. తాజాగా విడుదల చేసిన రూ.

Zee Telugu30 May, 03:00 pm
స్కూల్స్ రీపెన్ వేళ డీమార్ట్ భారీ ఆఫర్లు.. తక్కువ ఖర్చుకే ఎక్కువ వస్తువులు

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Dmart School Shopping Offers: పాఠశాలలు కొన్ని రోజుల్లో తెరచుకోనున్నాయి. వేసవి సెలవులు దాదాపు ముగిసిపోతుండగా.. విద్యా సంవత్సరం కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం షాపింగ్‌ చేయడం ప్రారంభించారు. అయితే విద్యార్థులకు సంబంధించి తక్కువ ఖర్చుకే ఎక్కువ వస్తువులు పొందాలంటే డీమార్ట్‌కు వెళ్లాల్సిందే. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా డీమార్ట్‌ సంస్థ ప్రత్యేకంగా ఆఫర్లు, డిస్కౌంట్లతోపాటు ఒకటి కొంచే ఒకటి ఉచితం అనే పథకం అమలు చేస్తోంది. Also Read: Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. ఉచిత బస్సుకు మరో కానుక విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందంటే విద్యార్థులకు సంబంధించిన వస్తువులు కొనాల్సి ఉంది. పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, స్కూల్‌ బ్యాగ్‌లతోపాటు వారికి బ్యాగ్‌లు, లంచ్‌బాక్స్‌లు, వాటర్‌ బాటిల్స్‌ వంటివి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక అంతేకాకుండా పిల్లలకు అందించాల్సిన ఆహార పదార్థాలు కూడా కొన్ని ముందే కొని పెట్టుకోవాల్సి ఉంది. ఇది గమనించిన డీమార్ట్‌ సంస్థ కొన్ని ఆఫర్లు, డిస్కౌంట్లతోపాటు ప్రత్యేకమైన రాయితీలు అందిస్తోంది. డీమార్ట్‌ అందిస్తున్న ఆఫర్ల వివరాలు కేటగిరి వారీగా ఇలా ఉన్నాయి. స్టేషనరీ సామగ్రిపై భారీ డిస్కౌంట్లు బ్రాండెడ్‌ లాంగ్‌బుక్, నోట్‌ పుస్తకాలపై 15-30 శాతం తగ్గింపు లభిస్తోంది. పెన్నులు ఎంఆర్‌పీపై కనీసం 15 శాతం తగ్గింపు రూ.139 నుంచి లంచ్‌ బ్యాగ్‌లు రూ.49కు పెన్సిల్ పర్సులు పిడిలైట్‌ గ్లూ ఎంఆర్‌పీపై కనీసం 15 శాతం