translateexpand_more

Summer Holidays News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 04:55 am
మే నెలలో తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం

తిరుమల శ్రీవారి ఆలయానికి మే నెలలో భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, విద్యాసంస్థలకు విరామం కావడంతో దేశవిదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో మే మాసంలో శ్రీవారి దర్శనాలు, హుండీ ఆదాయం, తలనీలాల సమర్పణలో కొత్త రికార్డులు నమోదైనట్లు టీటీడీ తాజాగా గణాంకాలను విడుదల చేసింది.టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మే నెలలో మొత్తం 25,46,168 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, భక్తుల రద్దీ తగ్గలేదు. రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా సర్వదర్శనం భక్తులు వేచి ఉండే కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందించి వారికి ఇబ్బంది కలగకుండా చూసింది.స్వామివారిపై తమకున్న భక్తిని భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. మే నెలలో శ్రీవారి హుండీ ద్వారా రికార్డు స్థాయిలో రూ.120.28 కోట్ల ఆదాయం లభించింది. ఒకే నెలలో ఈ స్థాయిలో ఆదాయం రావడం తిరుమల చరిత్రలోనే అరుదు. నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను కూడా భక్తులు పెద్దఎత్తున సమర్పించారు. ఇక, మే నెలలో 12,29,773 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Zee Telugu24 May, 07:51 am
Summer Holidays: విద్యార్థులకు బిగ్ అలర్ట్..మే 31తో వేసవి సెలవులు ముగింపు..జూన్ 1 నుంచి క్లాసులు!

- జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. - నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. - 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు.

Asianet News Telugu01 Jun, 10:58 am
తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే న్యూస్.. వారంరోజులు ఎక్స్ట్రాగా వేసవి సెలవులు, ఎప్పటినుండి ఎప్పటివరకు

Summer Holidays : తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు వేసవి సెలవులు పెరిగాయి. జూన్ వచ్చిన ఎండల తీవ్రత తగ్గడంలేదు... వడగాలులు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వేసవి సెలవులను పొడిగించారు. ఒకటి రెండ్రోజులు కాదు ఏకంగా వారం రోజులు ఎక్ట్రా సెలవులు వస్తున్నాయి. ఏఏ విద్యాసంస్థలకు ఎప్పటివరకు సెలవులు..? పెరిగిన సెలవులెన్ని..? అనేది ఇక్కడ తెలుసుకుందాం. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యాసంస్థలకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణలోని కొన్ని యూనివర్సిటీల విద్యార్థులకు సెలవులు ముగిశాయి... ఇవాళ్టి (జూన్ 1, సోమవారం) నుండి కాలేజీలు రీఓపెన్ కావాలి. అయితే ఎండల తీవ్రత తగ్గకపోవడంతో వేసవి సెలవులను మరో వారం పొడిగించారు. దీంతో 6 నుండి 8 రోజుల సెలవులు ఎక్స్ట్రాగా వస్తున్నాయి. తెలంగాణలోకి ఉస్మానియా, పాలమూరు యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ, పిజితో పాటు ఇతర కాలేజీలకు వేసవి సెలవులు జూన్ 6 వరకు పొడిగించారు. తెలంగాణ యూనివర్సిటీ కూడా సెలవులు పొడిగించింది. అయితే జూన్ 7 ఆదివారం... కాబట్టి ఈ యూనివర్సిటీ కాలేజీలు జూన్ 8న అంటే వచ్చే సోమవారం తెరుచుకోనున్నాయి. కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలకు కూడా సెలవులు పొడిగించారు. అయితే ఈ యూనివర్సిటీ విద్యార్థులకు జూన్ 5 వరకే సెలవులున్నాయి... జూన్ 6న (శనివారం) కాలేజీలు ఓపెన్ అవుతాయి. ఈ ఒక్కరోజే నడిచాక మళ్లీ ఆదివారం సెలవులు వస్తుంది. కాబట్టి ఈ కాలేజీ విద్యార్థులు కూడా జూన్ 8 (సోమవారం) నుండి కాలేజీలకు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోని వివిధ యూనివర్సిటీలు పొడిగించిన వేసవి సెలవులు విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ కి మాత్రమే వర్తించనున్నాయి. మిగతా నాన్ టీచింగ్, యూనివర్సిటీ ఉద్యోగులకు ఎలాంటి సెలవులు

AP7AM31 May, 04:37 pm
తెలంగాణలో డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు... ఎప్పటివరకు అంటే

రాష్ట్రంలో తీవ్రమైన వడగాలుపుల కారణంగా తెలంగాణలోని యూనివర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులను జూన్ 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. వాస్తవానికి జూన్ 1న కాలేజీలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో జూన్ 6 నుంచి 8వ తేదీ మధ్య తరగతులు మొదలవుతాయి.ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని క్యాంపస్, అనుబంధ కాలేజీలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ వర్సిటీలు సెలవులను జూన్ 6 వరకు పొడిగించగా, జూన్ 7 ఆదివారం కావడంతో జూన్ 8న కాలేజీలు తెరుచుకుంటాయి. మరోవైపు, కాకతీయ, శాతవాహన వర్సిటీలు జూన్ 5 వరకు సెలవులు ప్రకటించి, జూన్ 6న తరగతులు ప్రారంభించనున్నాయి.రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్రమైన వేసవి పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీలు తమ సర్క్యులర్లలో పేర్కొన్నాయి. అయితే, ఈ సెలవులు విద్యార్థులు, టీచింగ్ సిబ్బందికి మాత్రమే వర్తిస్తాయి. ప్రిన్సిపాల్స్, పరిపాలన బాధ్యతల్లో ఉన్న సిబ్బంది యధావిధిగా విధులకు హాజరు కావాలని స్పష్టం చేశాయి.ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. అధ్యాపక సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ గవర్నమెంట్ కాలేజెస్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ తెలిపింది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు వడగాలుపుల హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో, ఈ అదనపు సెలవులు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరటనిస్తున్నాయి.

Zee Telugu30 May, 03:00 pm
స్కూల్స్ రీపెన్ వేళ డీమార్ట్ భారీ ఆఫర్లు.. తక్కువ ఖర్చుకే ఎక్కువ వస్తువులు

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Dmart School Shopping Offers: పాఠశాలలు కొన్ని రోజుల్లో తెరచుకోనున్నాయి. వేసవి సెలవులు దాదాపు ముగిసిపోతుండగా.. విద్యా సంవత్సరం కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం షాపింగ్‌ చేయడం ప్రారంభించారు. అయితే విద్యార్థులకు సంబంధించి తక్కువ ఖర్చుకే ఎక్కువ వస్తువులు పొందాలంటే డీమార్ట్‌కు వెళ్లాల్సిందే. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా డీమార్ట్‌ సంస్థ ప్రత్యేకంగా ఆఫర్లు, డిస్కౌంట్లతోపాటు ఒకటి కొంచే ఒకటి ఉచితం అనే పథకం అమలు చేస్తోంది. Also Read: Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. ఉచిత బస్సుకు మరో కానుక విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందంటే విద్యార్థులకు సంబంధించిన వస్తువులు కొనాల్సి ఉంది. పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, స్కూల్‌ బ్యాగ్‌లతోపాటు వారికి బ్యాగ్‌లు, లంచ్‌బాక్స్‌లు, వాటర్‌ బాటిల్స్‌ వంటివి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక అంతేకాకుండా పిల్లలకు అందించాల్సిన ఆహార పదార్థాలు కూడా కొన్ని ముందే కొని పెట్టుకోవాల్సి ఉంది. ఇది గమనించిన డీమార్ట్‌ సంస్థ కొన్ని ఆఫర్లు, డిస్కౌంట్లతోపాటు ప్రత్యేకమైన రాయితీలు అందిస్తోంది. డీమార్ట్‌ అందిస్తున్న ఆఫర్ల వివరాలు కేటగిరి వారీగా ఇలా ఉన్నాయి. స్టేషనరీ సామగ్రిపై భారీ డిస్కౌంట్లు బ్రాండెడ్‌ లాంగ్‌బుక్, నోట్‌ పుస్తకాలపై 15-30 శాతం తగ్గింపు లభిస్తోంది. పెన్నులు ఎంఆర్‌పీపై కనీసం 15 శాతం తగ్గింపు రూ.139 నుంచి లంచ్‌ బ్యాగ్‌లు రూ.49కు పెన్సిల్ పర్సులు పిడిలైట్‌ గ్లూ ఎంఆర్‌పీపై కనీసం 15 శాతం