translateexpand_more

Trump Statement News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 01:49 am
ఇజ్రాయెల్-హెజ్ బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్ తో చర్చలు సానుకూలం

ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్‌బొల్లా మధ్య జరుగుతున్న ఘర్షణలు శాశ్వతంగా ముగియాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆకాంక్షించారు. ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు. హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్ మధ్య దాడులు ఆగిపోవడంతో శాంతి చర్చల్లో ఇరాన్ చురుకుగా పాల్గొంటోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతా 'ట్రూత్'లో ఓ పోస్ట్ చేశారు (Israel Hezbollah ceasefire).

'ఇజ్రాయెల్‌పై కాల్పులు ఆపేందుకు హెజ్‌బొల్లా అంగీకరించింది. అలాగే ఇజ్రాయెల్ కూడా హెజ్‌బొల్లాపై దాడులు నిలిపివేయడానికి ఒప్పుకుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి. ఇది శాశ్వతంగా కొనసాగాలని ఆశిస్తున్నాను' అని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో చాలా మంచి సంభాషణ జరిగిందని ట్రంప్ చెప్పారు. అయితే పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా మారలేదని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి (Israel Lebanon conflict).

కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన తర్వాత కూడా దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లో దాడులు, రాకెట్ ప్రయోగాల వార్తలు వెలువడ్డాయి (Lebanon conflict). దీంతో ఈ ఒప్పందం ఎంతకాలం నిలుస్తుందన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా లెబనాన్‌లో ఉద్రిక్తతలు తగ్గించడం అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చలకు కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ..

పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత