translateexpand_more

Israel News News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 01:49 am
ఇజ్రాయెల్-హెజ్ బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్ తో చర్చలు సానుకూలం

ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్‌బొల్లా మధ్య జరుగుతున్న ఘర్షణలు శాశ్వతంగా ముగియాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆకాంక్షించారు. ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు. హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్ మధ్య దాడులు ఆగిపోవడంతో శాంతి చర్చల్లో ఇరాన్ చురుకుగా పాల్గొంటోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతా 'ట్రూత్'లో ఓ పోస్ట్ చేశారు (Israel Hezbollah ceasefire).

'ఇజ్రాయెల్‌పై కాల్పులు ఆపేందుకు హెజ్‌బొల్లా అంగీకరించింది. అలాగే ఇజ్రాయెల్ కూడా హెజ్‌బొల్లాపై దాడులు నిలిపివేయడానికి ఒప్పుకుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి. ఇది శాశ్వతంగా కొనసాగాలని ఆశిస్తున్నాను' అని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో చాలా మంచి సంభాషణ జరిగిందని ట్రంప్ చెప్పారు. అయితే పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా మారలేదని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి (Israel Lebanon conflict).

కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన తర్వాత కూడా దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లో దాడులు, రాకెట్ ప్రయోగాల వార్తలు వెలువడ్డాయి (Lebanon conflict). దీంతో ఈ ఒప్పందం ఎంతకాలం నిలుస్తుందన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా లెబనాన్‌లో ఉద్రిక్తతలు తగ్గించడం అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చలకు కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ..

పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత

Eenadu27 May, 03:14 am
పాక్ మధ్యవర్తిత్వమే పెద్ద సమస్య

పాకిస్థాన్‌పై అమెరికా సెనెటర్ లిండ్సేగ్రాహం తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా-ఇరాన్‌ (USA-Iran) మధ్య కొనసాగుతోన్న శాంతి చర్చల్లో పాక్‌ మధ్యవర్తిత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. పాక్‌ మధ్యవర్తిత్వం వహించడమే పెద్ద సమస్య అంటూ ఆయన విమర్శలు చేశారు. ఇరాన్‌తో శాంతిచర్చల్లో పాల్గొంటున్న దేశాలు అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇజ్రాయెల్‌తో వైరం నేపథ్యంలో పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ (Khawaja Asif) దీన్ని తోసిపుచ్చారు. ఈ క్రమంలోనే లిండ్సే (Lindsey Graham) పాక్‌ వ్యవహారంపై విరుచుకుపడుతూ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. పాక్‌ మధ్యవర్తిగా వ్యవహరించడమే అతిపెద్ద సమస్య అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ (Israel)పై సుదీర్ఘకాలంగా అది విద్వేషంతో రగిలిపోతుందన్నారు. టెల్‌అవీవ్‌కు వ్యతిరేకంగా గతంలో పాక్‌ (Pakistan) ఉన్నతస్థాయి అధికారులు చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇజ్రాయెల్‌పై నమ్మకం లేనందున అబ్రహాం ఒప్పందంలో పాల్గొనేది లేదని ఖవాజా చేసిన వ్యాఖ్యలను లిండ్సే ప్రస్తావించారు. ఆ వ్యాఖ్యలు తనను భయాందోళనకు గురిచేశాయన్నారు. అబ్రహాం ఒప్పందాలపై సంతకాలు చేయాలంటూ ట్రంప్‌ ఇచ్చిన పిలుపుపై పాక్‌ వెంటనే సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల అమెరికాతో ఘర్షణల నేపథ్యంలో ఇరాన్‌ తన సైనిక విమానాలను పాక్‌ ఎయిర్‌బేస్‌లలో పార్క్‌ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని లిండ్సే తన పోస్టులో ప్రస్తావిస్తూ.. ఈ విషయం అబద్ధమని కొట్టిపారేయలేమన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా

Eenadu29 May, 04:30 am
ఐరాస బ్లాక్ లిస్ట్ లోకి రష్యా, ఇజ్రాయెల్ దళాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: సంక్షోభ ప్రదేశాల్లో లైంగిక హింసపై ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన వార్షిక నివేదిక వివాదాస్పదంగా మారింది. దీనిలో రష్యా, ఇజ్రాయెల్‌ దళాల పేర్లను కూడా చేర్చడంతో ఆ దేశాలు మండిపడ్డాయి. దాదాపు 15 ఏళ్ల క్రితం మొదలైన ఈ నివేదికలో తొలిసారి ఇజ్రాయెల్‌ పేరును చేర్చారు. పాలస్తీనాలో ఆ దేశ దళాలు చేస్తున్న హింసకు ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ బందీలపై రష్యా సైనికులు లైంగిక హింసకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో రష్యా దళాలను కూడా తొలిసారి ఈ జాబితాలో చేర్చారు. ఈ నిర్ణయంపై ఐరాసలోని రష్యా రాయబారి వెసెల్లీ నింబెంజియా తీవ్రంగా స్పందించారు. తమ దేశాన్ని విలన్‌గా చిత్రీకరించేలా నివేదికలో అసత్య ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్‌ రాయబారి డానీ డానన్‌ ఈ నివేదికపై మాట్లాడుతూ.. తమకు ఐరాస సెక్రటరీ జనరల్‌తో పనిలేదని అన్నారు. తమ దళాలను ఐసిస్‌, హమాస్‌ వంటి ముఠాల వలే చూపించారని మండిపడ్డారు. ఈ ఏడాది డిసెంబర్‌తో ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఆంటోనీ గుటెర్రస్‌ పదవీకాలం ముగియనుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu28 May, 05:01 pm
శాతం గాజాను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించా

ఇంటర్నెట్‌ డెస్క్: గాజా భూభాగంలో 70 శాతానికి పైగా స్వాధీనం చేసుకోవాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హమాస్‌పై ఇజ్రాయెల్‌ తన పట్టు బిగిస్తోందన్నారు. ‘‘ప్రస్తుతం గాజా భూభాగంలో 60 శాతం మా చేతుల్లో ఉంది. దశలవారీగా ముందుకు సాగుతూ.. 70 శాతానికి చేరుకోవాల్సిందిగా సైన్యానికి ఆదేశాలు జారీ చేశాను’’ అని నెతన్యాహు (Benjamin Netanyahu) వెల్లడించారు. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య గతేడాది అక్టోబరులో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సమయంలో.. గాజాలో సుమారు 53 శాతం భూభాగం ఐడీఎఫ్‌ నియంత్రణలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐడీఎఫ్‌ విడుదల చేసిన మ్యాప్‌ల ప్రకారం.. అది 64 శాతానికి పెరిగింది. గాజాలోని మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం వల్ల.. దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్ల పరిస్థితి మరింత దుర్భరమవుతుందని, వారు బలవంతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Israel News News Keyword | Telugu Digital