translateexpand_more

Tuni Constituency News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 01:55 pm
చెట్టు నుంచి దింపిన తాజా కల్లు రుచి చూసిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో

ముఖ్యమంత్రి చంద్రబాబు 'పేదల సేవలో' కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నారు. సోమవారం కాకినాడ జిల్లా, తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో పర్యటించిన ఆయన, కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి స్వయంగా వెళ్లారు. ఆయనకు రావాల్సిన పింఛనును చేతికి అందించి ఆశ్చర్యపరిచారు.ఈ సందర్భంగా సింహాచలం కుటుంబ సభ్యులతో మాట్లాడిన సీఎం, వారి జీవన విధానం గురించి ఆరా తీశారు. అత్యంత శ్రమతో కూడిన కల్లుగీత వృత్తిలోని కష్టనష్టాలు, ఆదాయం వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో, తమకు సొంత ఇల్లు లేదని సింహాచలం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, ఆయన తక్షణమే స్పందించారు. ఆ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు.అనంతరం, తాటి చెట్టు నుంచి కల్లు తీసే విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. గీత కార్మికులు అప్పుడే తీసిన తాజా తాటి కల్లును రుచి చూశారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను, ఫొటోలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. పేద ప్రజల సంక్షేమమే తన ప్రభుత్వ లక్ష్యమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

Andhra Jyothy01 Jun, 10:10 am
దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు

కాకినాడ జిల్లా, జూన్ 1: తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించారు. సీఎం స్వయంగా అతని దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేసి ఫోటో దిగడంతో ఆ దివ్యాంగ యువకుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. యువకుడి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతూ, ‘మీరంటే మా కుమారుడికి ఎంతో అభిమానం’ అని తెలిపారు. వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్‌ను పిలిచిన సీఎం.. ప్రభుత్వం తరఫున దివ్యాంగ యువకుడికి అన్ని సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.

అనంతరం ప్రజా వేదిక సమీపంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు. తూర్పు గోదావరి జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవన శాఖల ద్వారా సాగుతున్న వివిధ పంటల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మైక్రో న్యూట్రియెంట్స్‌తో పాటు ప్రకృతి సేద్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

ఇవి కూడా చదవండి..

కొత్త రైల్వే జోన్.. ఇకపై మన సమస్యలు మనమే తీర్చుకోగలం: రామ్మోహన్ నాయుడు

గొడ్డలి పార్టీ కుట్రలను బయటపెట్టిన మంత్రి అనగాని సత్యప్రసాద్

Read Latest AP News And Telugu News