translateexpand_more

Unemployed News

Latest updates from Telugu Digital news sources.

10TV Telugu03 Jun, 02:35 am
నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మూడు నోటిఫికేషన్లు జారీ.. దరఖాస్తు, పరీక్షల తేదీలు ఇవే.. ఈ నెలలోనే మరో 1800

Telangana Govt : తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంవేళ మూడు ఉద్యోగ నోటిఫికేషన్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. రోడ్లు, భవనాల శాఖ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి శాఖల్లో మొత్తం 290 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. Also Read : Telangana Rains : తెలంగాణలో ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు.. మూడు నోటిఫికేషన్లలో మొత్తం 290 పోస్టులకుగాను ఆర్అండ్‌బీ శాఖలోని 222 ఏఈఈ సివిల్ పోస్టులు, 49 ఏఈఈ ఎలక్ట్రికల్ పోస్టులు ఉన్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏఈఈ (సివిల్) పోస్టులకు జూన్ 6 నుంచి జూలై 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా.. ఏఈఈ (ఎలక్ట్రికల్) పోస్టులకు జూన్ 8 నుంచి జూలై 15వరకు, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పోస్టులకు జూన్ 10 నుంచి జులై 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోనేవారికి 18 నుంచి 44 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి. ఆర్‌అండ్‌బీ శాఖలోని 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (సివిల్ ) పోస్టులకు, 49 ఏఈఈ ఎలక్ట్రికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి అక్టోబరు నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ల పోస్టులకు సెప్టెంబర్ నెలలో పరీక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే.. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ నిరంతర ప్రక్రియ అని.. ఈనెలలోనే 1800 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. ఈనెలలోనే టీజీపీఎస్సీ నుంచి ఇంజనీరింగ్, పీసీబీ, అటవీశాఖ, టౌన్ ప్లానింగ్, విద్యాశాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్లు రానున్నట్లు తెలిపారు. ఇప్పటికే న్యాయపరమైన సమస్యలు లేకుండా 67వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు.