translateexpand_more

Vaibhav Sooryavanshi Interview News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu01 Jun, 05:49 am
చెప్పట్లేదు కానీ చాలా ఒత్తిడి ఉంది.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు

Vaibhav Sooryavanshi Admits Pressure After IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, హెన్రిచ్ క్లాసెన్‌లను వెనక్కి నెట్టి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన వైభవ్.. సీజన్ ముగిసిన తర్వాత తన ఫిట్‌నెస్, ఒత్తిడి, నేర్చుకున్న పాఠాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2026 ఫైనల్ అనంతరం భారత మాజీ కోచ్ రవి శాస్త్రితో మాట్లాడిన వైభవ్ .. ఈ సీజన్ తర్వాత తనపై అంచనాలు భారీగా పెరిగాయని అంగీకరించాడు. వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల కూడా చాలా ఒత్తిడి అనిపిస్తోందని వైభవ్ సూర్యవంశీ చెప్పాడు. 'ఇంతటి గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు నాపై ఒత్తిడి కూడా పెరిగింది. ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తున్నాను. అయినప్పటికీ ఇది గర్వకారణం. వచ్చే సీజన్‌లో కూడా ఇదే స్థాయిలో రాణించేందుకు ప్రయత్నిస్తాను. నేను నా ఆటను నమ్ముతాను. కొట్టే బంతి వస్తే పూర్తిగా దాడి చేస్తాను. కానీ ఈ సీజన్‌లో నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రతి మ్యాచ్‌లో ఒకే విధంగా ఆడలేం. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుని, జట్టు అవసరాలకు అనుగుణంగా ఆటను మార్చుకోవాలి. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకున్నాను' అని చెప్పాడు. ఇటీవల కొందరు మాజీ క్రికెటర్లు వైభవ్ ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. దీర్ఘకాలం క్రికెట్‌లో కొనసాగాలంటే ఫిట్‌నెస్ కీలకమని సూచించారు. దీనిపై స్పందించిన యువ బ్యాటర్.. ఇప్పటికే తన శారీరక దారుఢ్యంపై ప్రత్యేకంగా పని చేస్తున్నానని వెల్లడించాడు. 'అవును,

Samayam Telugu01 Jun, 04:27 pm
రోజుకు ఎన్ని పాలు తాగుతావు?' రవిశాస్త్రి ప్రశ్నకు అమాయకంగా సమాధానమిచ్చిన వైభవ్

ఐపీఎల్ 2026 ముగిసింది. రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఈ సీజన్‌కు.. ఆదివారం జరిగిన ఫైనల్‌తో ఎండ్ కార్డ్ పడింది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో టైటిల్‌ను సాధించింది. అయితే ఈ టోర్నీలో అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ . రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ ప్లేయర్.. తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కులు చూపించాడు.ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 5 ప్రతిష్ఠాత్మక అవార్డులను కొల్లగొట్టాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఆరెంజ్ క్యాప్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, మోస్ట్ సిక్సర్స్ అవార్డులను ఈ 15 ఏళ్ల కుర్రాడు దక్కించుకున్నాడు. దీంతో ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రజెంటేషన్ వేడుకలో అభిమానుల దృష్టంతా ఈ బుడ్డొడిపైనే ఉంది. అయితే ఇక్కడ కామెంటేటర్‌గా ఉన్న రవిశాస్త్రి .. సూర్యవంశీతో మాట్లాడుతూ నవ్వులు పూయించాడు.ఈ సీజన్‌లో వైభవ్‌ సిక్సర్ల మోత మోగించాడు. దీంతో సూర్యవంశీ కొట్టే సిక్సర్ల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకోవాలనే రవిశాస్త్రి భావించాడు. ఇందులో భాగంగా “నువ్వు రోజుకు ఎన్ని పాలు తాగుతావు?” అని వైభవ్‌ను అడిగాడు. ఈ ఊహించని సరదా ప్రశ్నకు స్టేడియంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఈ ప్రశ్నకు వైభవ్.. అమాయకంగా సమాధానమిచ్చాడు. “ప్రస్తుతం నేను పాలు తాగడం లేదు సార్‌” అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.కాగా ఈ సీజన్​లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోయినప్పటికీ, వైభవ్ సూర్యవంశీ మాత్రం తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 16

NTV Telugu28 May, 03:02 am
నేను ఆ మూడింటి పైనే ఫోకస్ చేస్తా.. ప్రత్యర్థి బౌలర్లు ఏం ప్లాన్ చేసినా నాకు అనవసరం

Vaibhav Sooryavanshi Reveals His Match Preparation: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సులతో 97 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్)పై విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్.. రాజస్థాన్ రాయల్స్‌ (ఆర్ఆర్)ను క్వాలిఫయర్-2కు చేర్చాడు. ముందుగా రాజస్థాన్‌ 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేయగా.. ఛేదనలో సన్‌రైజర్స్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన బుడ్డోడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను వ్యక్తిగత రికార్డుల గురించి ఆలోచించనని, తన దృష్టి మొత్తం జట్టును ఛాంపియన్‌గా నిలపడం పైనే ఉంటుందని వైభవ్ స్పష్టం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లు ఏం ప్లాన్ చేసినా తనకు అనవసరం అని, నార్మల్ క్రికెట్ ఆడుతాముందుకు సాగుతా అని చెప్పుకోచ్చాడు. ‘మేము మ్యాచ్ గెలిస్తే ఆ పాజిటివ్ ఇంటెంట్‌ను అలాగే ముందుకు తీసుకెళ్తాం. గతం గురించి ఎక్కువగా ఆలోచించకుండా నెక్స్ట్ మ్యాచ్‌పై దృష్టి పెడతాం. ఇదే విధంగా తర్వాతి మ్యాచ్ కూడా గెలిచి ఫైనల్‌కు చేరాలని భావిస్తున్నాం. తదుపరి మ్యాచ్‌ గురించి ఆలోచిస్తాను కానీ మరీ ఎక్కువగా కాదు. ప్రస్తుతం ఆడుతున్న మ్యాచ్‌పైనే ఫోకస్ పెడతాను. అవసరమైతే నా ఆటలో ఏం మెరుగుపరచుకోవాలో చూసుకుంటాను. కానీ ఓవర్ థింక్ చేయను’ అని తెలిపాడు. మ్యాచ్‌కు ముందు తన ప్రిపరేషన్ గురించి కూడా వైభవ్ వివరించాడు. ‘ప్రత్యర్థి జట్టులో ఉన్న బౌలర్లు ఎవరు?, ఈ పిచ్‌పై వారిని ఎలా ఎదుర్కోవాలి?, బౌండరీలు ఎంత పెద్దగా ఉన్నాయి? లాంటి విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తాను. నేను