translateexpand_more

India News

Latest updates from Telugu Digital news sources.

TV9 Telugu01 Jun, 03:29 am
నీకు నేను నాకు నువ్వు అంటున్న మ్యూజిక్ డైరెక్టర్

సాధారణంగా ఒకే రంగంలో ఉన్న నిపుణుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని భావిస్తుంటారు. అయితే, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుల విషయంలో ఈ ధోరణికి భిన్నమైన వాతావరణం నెలకొంది. ఇక్కడ వృత్తిపరమైన పోటీ ఉన్నప్పటికీ, సంగీత దర్శకులు ఒకరికొకరు తోడుగా నిలుస్తూ, అద్భుతమైన ఐక్యతను ప్రదర్శిస్తున్నారు. "నీకు నేను, నాకు నువ్వు" అన్నట్లుగా వారి మధ్య బంధం కొనసాగుతోంది. ఇటీవలి ఉదాహరణలను గమనిస్తే, తమన్ కోసం అనిరుధ్ ఒక పాటను పాడగా, ఇట్లు అర్జున చిత్రంలోని అనిరుధ్ పాడిన "హైరే" పాటకు విశేష స్పందన లభించింది. తమన్, అనిరుధ్ ఎంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. ఇదే విధంగా, తమన్ తన స్నేహితుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలకు ఎలాంటి ఈగోలు లేకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. మొన్నటికి మొన్న చెన్నై లవ్ స్టోరీ చిత్రంలోని "వదలని" సాంగ్ రిలీజ్ ఈవెంట్‌కు కీరవాణి నుంచి సింజిత్ వరకు పలువురు సంగీత దర్శకులు హాజరయ్యారు. మొత్తంగా, టాలీవుడ్ సంగీత దర్శకుల మధ్య పోటీతో పాటు బలమైన ఐక్యత కూడా ఉంది. మరిన్ని వీడియోల కోసం : పెద్ది స్టోరీ.. చరణ్ చెప్పిన కథలాంటిదేనా? సనాతనధర్మం అంటే మతం కాదు..జీవన విధానం బాబాయ్ నుంచి అబ్బాయికి తియ్యటి కబురు! ‘పెద్ది’ సినిమాకు అన్నీ శుభ శకునాలే.. రెచ్చిపోవడమే తరువాయి..

Samayam Telugu01 Jun, 12:43 am
ఫైనల్ లో హైడ్రామా.. ఔటిచ్చినా కదలని కోహ్లి.. అంపైర్ తో గొడవ, గిల్ తో గ్రౌండ్ లోనే డిస్కషన్

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో హై డ్రామా నెలకొంది. ఆర్సీబీ విజయానికి దగ్గరగా ఉన్న సమయంలో విరాట్ కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడిన బంతిని కెప్టెన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్ విషయంలో విరాట్ కోహ్లి - శుభ్‌మన్ గిల్ - అంపైర్ల మధ్య కాసేపు హై డ్రామా నెలకొంది. క్యాచ్ విషయంలో కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్‌లో కొంత ఉత్కంఠభరిత క్షణాలు కనిపించాయి. అసలేం జరిగిందంటే.. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి అర్షద్ ఖాన్ వేసిన బంతిని కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఆ క్యాచ్ పూర్తిగా పట్టలేదని.. బంతి నేలను తాకిందని కోహ్లి భావించాడు. అయితే, కోహ్లి ఆన్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్‌తో వాగ్వాదానికి దిగాడు. తొలుత అంపైర్ కోహ్లిని పెవిలియన్‌కు వెళ్లాలని సూచించినా.. కోహ్లి రివ్యూకి వెళ్లాలని పట్టుబట్టడంతో చేసేదేం లేక నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు పంపిచారు. రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్‌కు కూడా అది స్పష్టంగా కనిపించకపోయినా.. బంతిలో కొంత భాగం నేలను తాకినట్లు గుర్తించి ఔట్ నిర్ణయాన్ని రద్దు చేసి నాటౌట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ డెసిషన్ తనకు అనుకూలంగా రావడంతో కోహ్లి గ్రౌండ్‌లోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వివాదం జరిగే సమయానికి కోహ్లి 63 పరుగులు చేశాడు. కీలక మ్యాచ్‌లో మరోసారి ఛేజ్ మాస్టర్ అనిపించుకున్న విరాట్ కోహ్లి ఆఖరి వరకు క్రీజులో కొనసాగి 42 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 156 పరుగుల లక్ష్యాన్ని

Asianet News Telugu01 Jun, 03:23 am
పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎందుకంత సీక్రెట్ గా దాచేస్తున్నారు

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది మూవీ చిత్రం మరో మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. జూన్ 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. జూన్ 3న రాత్రి ప్రీమియర్స్ తో షోలు ప్రారంభం అవుతాయి. పెద్ది చిత్రానికి సంబందించిన బిగ్గెస్ట్ ప్రమోషనల్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విజయవాడలో ప్లాన్ చేశారు. జూన్ 1న నేడు సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ లు ఎవరు వస్తారు అనేది ఇంకా రివీల్ చేయలేదు. ఈవెంట్ కి హాజరయ్యే అతిథుల విషయంలో చిత్ర యూనిట్ సీక్రెట్ మైంటైన్ చేస్తోంది. ఎందుకు ఇంతలా దాచేస్తున్నారు అనే అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి. అయితే కొన్ని రూమర్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మెగా బ్రదర్స్ ఇద్దరూ ఈవెంట్ కి హాజరైతే అభిమానుల్లో జోష్ వేరే లెవల్ లో ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరో ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఏ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం లేదు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ ఈవెంట్ ని నిర్వహించనున్నారు. పెద్ది చిత్రంలో రాంచరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించగా శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమన్ ఇరానీ

10TV Telugu01 Jun, 03:36 am
నా కలలు ముక్కలయ్యాయి.. నయనతార భర్త విగ్నేష్ శివన్ ఆవేదన

Vignesh Shivan; సినిమాలపై కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే నెగెటివ్ ప్రచారం, ట్రోలింగ్ దర్శకుల కలలను ఎలా ముక్కలు చేస్తాయో వివరిస్తూ ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన ‘ఎల్‌ఐకే’ (LIK) చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆన్‌లైన్‌లో విపరీతంగా కనిపించిన నెగెటివ్ రివ్యూల వల్లే చాలా మంది ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యామని తనకు మెసేజ్‌లు చేస్తున్నారని తెలిపారు. Peddi pre release event: ఈరోజే ‘పెద్ది’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్టుగా ఎవరెవరు వస్తున్నారో తెలుసా? చిత్ర పరిశ్రమలో పెద్దల మద్దతు లేని చిన్న సినిమాల తలరాతలను ఇలాంటి ఉద్దేశపూర్వక విమర్శలే మార్చేస్తాయని, ఇవి ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. మంచి టాక్‌తో ఓపెనింగ్స్ సాధించిన తర్వాత, ఒక్కసారిగా పరిస్థితి మారిపోవడాన్ని తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని, దీని నుంచి బయటకు రాలేకపోతున్నానని బాధపడ్డారు. ఒక సినిమాను నిర్మించి, అన్ని సవాళ్లను అధిగమించి థియేటర్ల వరకు తీసుకురావడం వెనుక ఎంతో పోరాటం ఉంటుందని, కానీ చివరికి దానికి ఇలాంటి ముగింపు రావడం ఎంతో కలచివేస్తోందని విఘ్నేశ్ శివన్(Vignesh Shivan) ఆవేదన చెందారు. ఎంతో కష్టపడి రూపొందించిన తన సినిమాకు దక్కాల్సిన ఆదరణ ఇంకా దక్కలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, సినిమా చరిత్రలో మొదట్లో పరాజయం పాలై, ఆ తర్వాత కాలంలో క్లాసిక్ చిత్రాలుగా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. భవిష్యత్తులో తన ‘ఎల్‌ఐకే’ చిత్రానికి కూడా ఖచ్చితంగా అలాంటి గుర్తింపు, ఆదరణ లభిస్తాయనే ఆశతోనే తాను ముందుకు సాగుతున్నట్లు విఘ్నేశ్ శివన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

SkyC Media01 Jun, 04:12 am
విమల్ థియేటర్లో స్పిరిట్ సినిమా షూటింగ్

రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నగరంలోని బాలానగర్ ప్రాంతంలో ఉన్న విమల్ థియేటర్లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించిన కొన్ని అత్యంత కీలక సన్నివేశాలను డైరెక్టర్ చిత్రీకరించనున్నారు. ప్రభాస్ స్వయంగా ఈ షూట్‌కు వస్తున్నారనే వార్త బయటకు రావడంతో అభిమానులు విమల్ థియేటర్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా, అభిమానుల తాకిడిని తట్టుకోవడానికి చిత్ర యూనిట్ ఇప్పటికే అక్కడ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ క్రేజీ మూవీలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన కెరీర్‌లోనే ఇది అత్యంత ఇంటెన్స్ రోల్స్‌లో ఒకటిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఫలితంగా పోలీసులు కూడా థియేటర్ పరిసరాల్లో భద్రత కోసం చిత్ర యూనిట్‌కు పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రి నటిస్తోంది. అలాగే టాలీవుడ్‌లో మొదటి భారీ ప్రాజెక్ట్ చేస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు. వీరితో పాటు సీనియర్ నటి కాంచన, ఐశ్వర్య మరియు మరికొందరు ముఖ్య నటులు ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర యూనిట్ తదుపరి షెడ్యూల్స్ ప్లాన్ చేయనుంది. ప్రభాస్ పోలీస్ లుక్ మరియు సందీప్ వంగా టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా

Samayam Telugu01 Jun, 01:56 am
రజినీకాంత్ జైలర్ 2’లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్?... 40 ఏళ్ల తర్వాత రీ యూనియన్

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన 'జైలర్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.600 కోట్లకు పైగా భారీ గ్రాస్ వసూళ్లు సాధించి, కోలీవుడ్ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలలో ఒకటిగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారు రూ.75 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి అగ్ర నటుల అతిథి పాత్రలు సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. దీంతో ఇప్పుడు రూపొందుతున్న సీక్వెల్ ‘ జైలర్ 2 ’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మొదటి భాగం తరహాలోనే ఈ సీక్వెల్‌లో కూడా మరిన్ని క్రేజీ క్యామియోలు ఉంటాయని దర్శకుడు నెల్సన్ ప్రకటించడంతో, ఇందులో ఎవరెవరు నటిస్తున్నారనే ఉత్కంఠ అందరిలోనూ పెరిగింది. * పొల్లాచ్చి షెడ్యూల్‌కు సిద్ధమైన ‘మెగా 158’.. చిరంజీవిపై భారీ యాక్షన్ సీక్వెన్స్! ఈ సినిమాలో ఒక అత్యంత పవర్‌ఫుల్ క్యామియో రోల్ కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. నిజానికి ఈ పాత్ర కోసం మొదట నందమూరి బాలకృష్ణను సంప్రదించగా, ఆయన తన బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు ఈ రోల్ ఆఫర్ చేయగా, ఆయన కూడా తన ‘కింగ్’ సినిమా షూటింగ్ కమిట్‌మెంట్స్ వల్ల దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్‌ను కూడా సంప్రదించారనే టాక్ నడిచింది. చివరికి ఈ

Zee Telugu01 Jun, 02:44 am
గుజరాత్ టైటాన్స్ బస్సులో మంటల కలకలం..ఫైనల్ ఓటమి కంటే పెద్ద టెన్షన్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Gujarat Titans Bus Fire Accident:ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ముందుగా పొగ రావడం గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది మరియు ఇతర సిబ్బందిని వెంటనే బస్సు నుంచి బయటకు దించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బస్సులో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. అయితే పొగ ఎక్కువగా వ్యాపించడంతో కొంతసేపు ఆటగాళ్లు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం మరో బస్సును ఏర్పాటు చేసి వారిని హోటల్‌కు తరలించారు. ఇప్పటికే ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ ఓటమి బాధ నుంచి బయటపడకముందే ఈ ఘటన జట్టును మరింత కలవరపరిచింది. గత కొన్ని రోజులుగా గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు వరుస ప్రయాణాలతో బిజీగా ఉన్నారు. ధర్మశాల నుంచి ముల్లన్‌పూర్‌కు, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితుల కారణంగా వారి ప్రయాణ షెడ్యూల్ కూడా ఆలస్యమైంది. దీంతో జట్టుపై అలసట ప్రభావం కనిపించిందనే చర్చలు కూడా జరిగాయి. అయితే జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి మాత్రం అలసటను ఓటమికి కారణంగా చెప్పడానికి ఇష్టపడలేదు. ప్రత్యర్థి జట్టు

10TV Telugu01 Jun, 01:57 am
టాలీవుడ్ చాలా బెటర్.. దీపికాకు సాలిడ్ కౌంటర్ ఇచ్చిన జాన్వీ కపూర్

Janhvi Kapoor: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దీపికా పదుకోన్ వివాదం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం ఆమె టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్స్ అయిన ప్రభాస్ ‘స్పిరిట్’, అలాగే ‘కల్కి-2’ చిత్రాల నుండి తప్పుకుందనే వార్తలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆమె రోజుకు కేవలం 8 గంటలు మాత్రమే పనిచేస్తాననే నిబంధన పెట్టడం వల్లే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీనితో టాలీవుడ్‌లో పని గంటల వ్యవధి, రోజుకు 12 నుండి 14 గంటల సుదీర్ఘ కాల్షీట్లు ఉంటాయా అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. చాలా ట్రోలింగ్ కూడా జరిగింది. AR Rahman: నా కొడుకు కూడా రామ్ చరణ్‌లా ఉండాలి.. ‘పెద్ది’ వేదికపై ఏఆర్ రెహమాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఈ నేపథ్యంలో, తాజాగా ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్(Janhvi Kapoor) తెలుగు చిత్ర పరిశ్రమలోని వర్కింగ్ కల్చర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్‌లో పని గంటలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని, ఇక్కడి వాతావరణం తనకు ఎంతగానో నచ్చిందని ఆమె ప్రశంసించింది. ముఖ్యంగా లంచ్ బ్రేక్ సమయంలో ప్రతి ఒక్కరూ చక్కగా విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్‌లో పాల్గొంటారని జాన్వి వెల్లడించింది. తెలుగులో తాను చేసిన ‘దేవర’, ‘పెద్ది’ చిత్రాల షూటింగ్స్ సమయంలో రోజుకు 9 గంటలకు మించి ఎప్పుడూ పని చేయలేదని ఈ ముద్దుగుమ్మ స్పష్టం చేసింది. పని గంటల విషయంలో టాలీవుడ్‌ను అపార్థం చేసుకునే వారికి జాన్వి మాటలు గట్టి సమాధానంగా నిలిచాయి. ఇండస్ట్రీలో పని వాతావరణం చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటుందని చెప్పడం ద్వారా, దీపికా పదుకోన్ వ్యవహారానికి ఆమె పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్లయిందని

TeluguOne01 Jun, 04:29 am
ఆర్సీబీ విజయంపై ఈసీ స్పందన.. నెటిజనులు ఫిదా

ఐపీఎల్ 2026 సీజన్ చాంపియన్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు ఆర్సీబీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ భారీ విజయంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తీరు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. యువతలో ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు ఈసీ ఆర్సీబీ ఐపీఎల్ చాంప్ గా నిలిచిన సందర్భాన్ని అత్యంత సృజనాత్మకంగా ఉపయోగించుకుంది. ఆర్సీబీ అద్భుతవిజయాన్ని ఓటర్ల చైతన్యానికి అనుసంధానిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ఐపీఎల్ 2026 ట్రోఫీని ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హృదయపూర్వక అభినందనలు. నిజమైన ఛాంపియన్లు ఎప్పుడూ తమ సరైన సమయం కోసం ఎంతో ఓపికగా సిద్ధంగా ఉంటారు. సరిగ్గా అలాగే మీరు కూడా మీ బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధం కావాలి. మీకు ప్రస్తుతం 18 ఏళ్లు నిండుతున్నాయా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఫారం 6 నింపండి. ఒక ఛాంపియన్‌ తరహాలో మీ ప్రజాస్వామ్య విధిని విజయవంతంగా నెరవేర్చడానికి నడుం బిగించండి. గుర్తుంచుకోండి.. దేశ భవిష్యత్తును మార్చే మీ ఓటు ఎంతో విలువైంది అంటూ ఈసీ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. ఈ ఆసక్తికరమైన పోస్టుకు రన్ మిషన్ విరాట్ కోహ్లీతో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు ఐపీఎల్ ఛాంపియన్ ట్రోఫీతో ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్న ఫొటోను జత చేసింది. నిజానికి యువతను ఓటు నమోదు దిశగా ప్రోత్సహించేందుకు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని

NTV Telugu31 May, 01:30 am
తలా అజిత్ నివాసానికి తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. వెంట వచ్చిన స్టార్ హీరోయిన్ త్రిష

CM Vijay: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన సంగతి తెలిసిందే. ఆయన తల్లి మోహిని మణి (85) వయోభారంతో శనివారం కన్నుమూశారు. తల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అజిత్ కుమార్ కుటుంబానికి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి తీవ్ర సంతాపం వ్యక్తమవుతోంది. విషయం తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు జోసెఫ్ విజయ్‌తో పాటు నటి త్రిష.. చెన్నైలోని అజిత్ నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. అజిత్ నివాసానికి సీఎం విజయ్, త్రిష విషయం తెలిసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు జోసెఫ్ విజయ్ శనివారం రాత్రి నేరుగా చెన్నైలోని అజిత్ నివాసానికి చేరుకున్నారు. ఆయనతో పాటు స్టార్ హీరోయిన్ త్రిష కూడా అజిత్ ఇంటికి వచ్చారు. తీవ్ర విచారంలో ఉన్న అజిత్‌ను విజయ్ ఆలింగనం చేసుకుని ఓదార్చారు. మోహిని మణి భౌతికకాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. భారీ భద్రత, అభిమానుల కోలాహలం మధ్య విజయ్ తెల్లటి షర్టు ధరించి కారు దిగడం, చేతిలో పూలమాలతో అజిత్ ఇంటికి వెళ్లడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అజిత్, విజయ్ మధ్య ఉన్న స్క్రీన్ రైవల్రీని పక్కన పెట్టి, ఒకరికొకరు తోడుగా నిలిచిన తీరుపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఎంత పోటీ ఉన్నా.. వ్యక్తిగత జీవితంలో స్నేహానికి, గౌరవానికి వారు ఇచ్చే ప్రాధాన్యతను నెటిజన్లు అభినందిస్తున్నారు. అదే సమయంలో విజయ్‌తో పాటు త్రిష కూడా ఒకే కారులో హాజరు కావడంపై సామాజిక మాధ్యమాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది. అజిత్ కుమార్ కుటుంబానికి పలువురు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు తమ గాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

SkyC Media01 Jun, 05:41 am
జాన్వి కపూర్ వ్యాఖ్యలు దీపికా పదుకొణ్ వివాదానికి పరోక్ష కౌంటర్

తాజా ప్రమోషన్స్‌లో భాగంగా నటి జాన్వి కపూర్ పెద్ది సినిమా సందర్భంగా టాలీవుడ్ వర్క్ కల్చర్ పై చాలా పాజిటివ్ కామెంట్స్ చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేసే వాతావరణం ఎంతో ప్లాన్‌డ్‌గా మరియు డిసిప్లైన్డ్‌గా ఉంటుందని ఆమె స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇక్కడ పని గంటలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా ప్రశంసించింది. టాలీవుడ్ వర్క్ కల్చర్ గురించి జాన్వి కపూర్ మాట్లాడుతూ షూటింగ్ సమయంలో లంచ్ బ్రేక్ ను పక్కాగా పాటిస్తారని చెప్పింది. లంచ్ బ్రేక్ సమయంలో అందరూ సరిగ్గా తిని, తగిన విశ్రాంతి తీసుకుంటారని ఆమె పేర్కొంది. దీనివల్ల అందరూ తిరిగి రెట్టించిన ఎనర్జీతో పనిలోకి వస్తారని ఆమె వెల్లడించింది. ఇదిలా ఉండగా ఆమె దేవర మరియు పెద్ది షూటింగ్స్ సమయంలో రోజుకు 9-10 గంటలకు మించి ఎప్పుడూ పని చేయలేదని వివరించింది. దీంతో టాలీవుడ్ లోని క్రమశిక్షణ గల వాతావరణంపై నెటిజన్ల మధ్య జాన్వి మాటలు ప్రస్తుతం చాలా వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జాన్వి కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలను దీపికా పదుకొణ్ వివాదానికి పరోక్ష కౌంటర్‌గా నెటిజన్లు చూస్తున్నారు. గతంలో దీపికా రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పి స్పిరిట్ మరియు కల్కి 2 చిత్రాల నుండి బయటపడింది. ఫలితంగా అప్పట్లో దీపికాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చాలా ఎక్కువగా జరిగింది. ప్రస్తుతం జాన్వి కపూర్ చేసిన వ్యాఖ్యల వల్ల ఈ అంశం సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్‌గా మారిపోయింది. చాలామంది నెటిజన్లు దీన్ని బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ వర్క్ కల్చర్ డిబేట్‌గా మారుస్తూ పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.

10TV Telugu01 Jun, 05:09 am
విమల్ థియేటర్ లో 'స్పిరిట్' షూటింగ్.. ప్రభాస్ రావడంతో ఫ్యాన్స్ రచ్చ

Prabhas Spirit: రెబల్ స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్పిరిట్(Prabhas Spirit)’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సరికొత్త షెడ్యూల్ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమా కీలక సీన్ల చిత్రీకరణ కోసం చిత్రబృందం నగరంలోని నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన బాలానగర్ ‘విమల్ థియేటర్’ను ఎంపిక చేసింది. Preethi asrani: నిమ్మపండు రంగు చీరలో నవయవ్వన సోయగం.. ప్రీతీ అస్రాణి క్యూట్ ఫొటోలు ఈ ప్రసిద్ధ సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో ప్రభాస్‌పై కొన్ని ఇంటెన్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ షూటింగ్‌లో పాల్గొంటున్నారనే వార్త తెలియడంతో విమల్ థియేటర్ వద్దకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. అది కూడా ఒక్కరోజు షూటింగ్ మాత్రమే. ఫ్యాన్స్ హడావుడి పెరగడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చిత్రయూనిట్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలీసుల సహాయంతో జనసందోహాన్ని నియంత్రిస్తూ షూటింగ్‌ను ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామా నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మలుస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ విలన్‌గా అలరించనున్నారు. కాంచన, ఐశ్వర్య దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

10TV Telugu01 Jun, 06:05 am
అబ్బబ్బా అనిపిస్తున్న నాభా నటేష్ అందాలు.. క్రేజీ ఫోటోలు వైరల్

టాలీవుడ్ ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నభా నటేష్(Nabha Natesh) సరికొత్త స్టైలిష్ అండ్ గ్లామరస్ లుక్‌తో కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతోంది. ట్రెండీ అవుట్‌ఫిట్‌లో తన నాజూకు నడుము, హాట్ అందాలను ఆరబోస్తూ ఆమె ఇచ్చిన క్రేజీ పోజులు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ నయా ఫొటోషూట్‌పై నెటిజన్లు లైకులు, ఫైర్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తూ నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.

Andhra Jyothy01 Jun, 03:08 am
స్టార్ సింగర్ సుమన్ కళ్యాణ్ పూర్ కన్నుమూత

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ (89) కన్నుమూశారు. వృద్ధాప్య కారణంగా ఆదివారం(మే 31) సాయంత్రం తన నివాసంలో మరణించారని ఆమె సన్నిహితులు తెలిపారు. ఆశా భోస్లే మరణించిన కొన్ని వారాలకే సుమన్ కళ్యాణ్‌పూర్ కూడా మరణించడంతో సంగీత ప్రియులు విషాదంలో మునిగిపోయారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

బంగ్లాదేశ్ ఏర్పడక ముందు అవిభక్త భారతదేశంలోని ఢాకాలో సుమన్ 1937లో జన్మించారు. ఆమె బాల్యంలో ఉన్నప్పుడే.. వారి కుటుంబం ముంబైకి చేరుకుంది. సుమన్ కళ్యాణ్‌పూర్‌కు పెయింటింగ్‌పై ఆసక్తి ఉన్నప్పటికీ, సంగీతం వైపు అడుగులు వేశారు. పండిట్ కేశవ్‌రావ్ భోలే, ఉస్తాద్ ఖాన్ అబ్దుల్ రెహ్మాన్ ఖాన్ వంటి దిగ్గజాల వద్ద శిక్షణ పొందారు. 1954లో వచ్చిన ‘మంగు’ చిత్రంతో ఆమె సినీ ప్రస్థానం ప్రారంభమైంది. తన ఆరు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆమె ‘నా నా కర్తే ప్యార్’, ‘ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కే చర్చే’, ‘నా తుమ్ హమే జానో’ వంటి ఎన్నో ఆల్‌టైమ్ క్లాసిక్ హిట్స్ అందించారు.

హిందీ, మరాఠీ, బెంగాలీ, ఒడియా భాషల్లో ఆమె వేలాది పాటలు పాడారు. కళారంగంలో ఆమె చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆమెను ‘పద్మ భూషణ్’ అవార్డుతో సత్కరించింది. ఆమె మరణం పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 'భారతీయ సంగీత ప్రపంచంలో ఓ గొప్ప స్వరం శాశ్వతంగా మూగబోయింది' అని ఎక్స్ వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాళులర్పించారు.

ఇవి కూడా చదవండి:

నర్మదా-క్షిప్రా పైప్‌లైన్ లీక్ కావడంతో భారీ విధ్వంసం..

బస్సులో మంటలు.. గుజరాత్ టీమ్‌కు

TeluguOne01 Jun, 06:41 am
లేడీ దురంధ ర్ రాజామ ణి స ర స్వ తి

సరస్వతి రాజమణి.. బంగారు గనుల వారసురాలిగా మొదలై, భారత తొలి మహిళా గూఢచారిగా ముగిసిన ఆ జీవిత క‌థ ఎలాంటిది? ఇందులో మొద‌టిగా క‌నిపించే చారిత్రక నేపథ్యం.. విష‌యానికి వ‌స్తే.. రంగూన్ వైభవం నుంచి ఆజాద్ హింద్ ఫౌజ్ గూఢచర్యం వరకు సాగిన ఆమె సాహ‌సోపేత‌ ప్ర‌యాణాన్ని ఒక‌సారి సునిశిత వీక్ష‌ణం చేస్తే మ‌నం ఎంద‌రో త్యాగ‌ధ‌నుల‌ను గౌర‌వించ‌డం మానేసి.. ఊహాలోకాల్లో విహ‌రిస్తున్నామ‌ని తేట‌తెల్ల‌మ‌వుతుంది. ఇరవయ్యో శతాబ్దం నాల్గవ దశకంలో, బ్రిటిష్ సామ్రాజ్యం తూర్పు ఆసియాలో తన ప్రభావాన్ని గట్టిగా చూపుతున్న కాలం. ఆనాటి బర్మా ప్రస్తుత మయన్మార్ లోని రంగూన్ నగరం, వాణిజ్య ప‌రంగా, రాజకీయంగా ఎంతో కీలకమైన‌ కేంద్రం. అక్కడి అత్యంత సంపన్న భారతీయ కుటుంబాలలో ఒకటిగా నిలిచింది రాజమణి కుటుంబం.. ఒక బంగారు గని యజమాన్యం వ‌హించేది, స్వాతంత్రోద్యమానికి ఆర్థిక స‌హాయ స‌హ‌కారం అందించే ఫ్యామిలీ కూడా. ఈ కుటుంబంలో 1927 జనవరి 11న జన్మించిన బాలిక.. తరువాత భారత తొలి మహిళా గూఢచారిగా చరిత్రలో నిలిచింది. ఆమె సరస్వతి రాజమణి. పట్టు వస్త్రాలు, వజ్రాలు, రత్నాలు, బంగారు గనుల సంపద. ఇవే ఆమె బాల్య ప్రపంచం. కానీ ఆమె జీవిత గమ్యం రాజప్రాసాదాల సౌఖ్యం మాత్ర‌మే కాదు. అరణ్య మార్గాలు, గన్‌పౌడర్ వాసన, బ్రిటిష్ సైనిక శిబిరాల మధ్య ప్రాణాంతక గూఢచర్యం కూడా. సంపదల మధ్య జన్మించినా, స్వాతంత్రం కోసం అన్నీ విడిచిపెట్టిన యువ‌ గూఢచారిణి.. సరస్వతి రాజమణి. 1942లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ రంగూన్‌కు చేరుకున్నప్పుడు, అక్కడి భారతీయ సమాజంలో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగ‌సిప‌డింది. నాకు మీ రక్తం ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్రం ఇస్తాను- అనే నేతాజీ పిలుపు, వేలాది భారతీయుల హృదయాలను కదిలించింది. ఆ

10TV Telugu31 May, 12:30 am
పోలవరం ఎమ్మెల్యేకి పవన్ కల్యాణ్ 4 వారాల డెడ్ లైన్ .. ఆంతర్యమేంటి

Pawan Kalyan-Chirri Balaraju: ఇన్నాళ్లు పాలన మీద పట్టు సాధించేందుకు టైమ్ కేటాయించిన పవన్.. ఇప్పుడు పార్టీని సెట్‌రైట్ చేసే పనిలో ఉన్నారు. వివాదాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు, నేతలకు పిలిచి మరీ క్లాస్‌లు ఇస్తున్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు.. పవన్‌ నాలుగు వారాల డెడ్‌లైన్ విధించడం ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్ అవుతోంది. ఈ నాలుగు వారాల్లో వివాదాల నుంచి ఆయన బయటపడగలరా.. ఇకపై బాలరాజుకు ఎదురుకాబోయే సవాళ్లేంటి.. పోలవరం రాజకీయాల్లో ఒక్కసారిగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో.. ఈ మధ్య జనసేనాని పవన్‌ వన్ టు వన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మాములుగా రివ్యూలు అంటే నియోజకవర్గాల అభివృద్ధిపై జరుగుతాయ్. ఐతే వివాదాలపై ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకున్న పవన్‌.. వాటిని సెట్‌రైట్ చేసుకునేందుకు నాలుగు వారాల డెడ్‌లైన్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. నాలుగు వారాల్లో బాలరాజు అంతా క్లియర్ చేసుకుంటారా.. ఒకవేళ చేసుకోకపోతే పరిస్థితి ఏంటి.. అసలు ఆయనకు ఎందుకు పవన్ డెడ్‌లైన్‌ విధించారు.. ఆయన చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి అని ఏపీ రాజకీయాల్లో డిస్కషన్ కనిపిస్తోంది. పంచాయితీల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 147 కోట్ల నిధులు కేటాయించగా.. క్షేత్రస్థాయిలో పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలుస్తోంది. దీనిపై పవన్‌ నిలదీసినట్లు తెలుస్తోంది. నిధుల కేటాయింపు, టెండర్ల వెనక తప్పులు జరిగాయని విపక్షాలతో పాటు సొంత పార్టీలోనే ఆరోపణలు వినిపించడం పవన్‌కు కోపం తెప్పించింది. దీంతో నాలుగు వారాల్లో పనులు స్పీడప్ కావాలని.. ఆరోపణలకు చెక్‌ పెట్టాలని.. నాలుగు వారాల డెడ్‌లైన్ పెట్టి ఎమ్మెల్యేకు పవన్ అల్టిమేటం జారీ చేశారని టాక్. చిర్రి బాలరాజుకు కేవలం ఆర్థిక,