translateexpand_more

Ap Political News News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy31 May, 12:50 pm
నంద్యాల వైఎస్సార్ విగ్రహ ఘటన.. వెలుగులోకి వైసీపీ డ్రామాలు

నంద్యాల, మే31 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ధ్వంసం వ్యవహారంలో మరోమారు వైసీపీ డ్రామాలు బట్టబయలయ్యాయి. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం తల ధ్వంసం చేసిన వ్యవహారంలో వెలుగులోకి వైసీపీ కుట్రలు వచ్చాయి. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా వైసీపీ డ్రామా బట్టబయలయ్యాయి. ఈ ఘటనకు పాల్పడింది వైసీపీ కార్యకర్త జమలయ్య అని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 2018 నుంచి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి, నంద్యాల వార్డు కౌన్సిలర్, వైసీపీ నేత పున్నా శేషయ్య అనుచరుడిగా నిందితుడు జమలయ్య ఉన్నారు.

వైసీపీ రాజకీయ కార్యకలాపాల్లో సుదీర్ఘ కాలంగా క్రియాశీలకంగా నిందితుడు జమలయ్య ఉన్నారు. 2022లో అప్పటి పాలకుల సిఫార్సుతో కమ్యూనిటీ రిసోర్సు పర్సన్‌గా జమలయ్య భార్య పని చేస్తున్నారు. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేసిన వ్యవహారంలో ఇతర పార్టీల ప్రమేయం ఏమి లేదని, ఈ ఘటనలో నేరుగా నిందితుడు జమలయ్య పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు. సీసీ కెమెరాల వీడియోతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించి ఈ కుట్రలో ఇతరుల భాగస్వామ్యంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఉద్దేశపూర్వకంగా ముందుగానే ఈ కుట్రకు పాల్పడ్డారా అనే అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసినా, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే ప్రయత్నం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి...

విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!

పోలీసులపై

Sakshi29 May, 02:11 pm
కాంగ్రెస్ తో చంద్రబాబు హాట్ రాజకీయాలు చేస్తున్నారు

తాడేపల్లి: మోసపూరిత రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నెంబర్‌ వన్‌ అని విమర్శించారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. బహిరంగంగా బీజేపీతో ఉంటూ తెరచాటున కాంగ్రెస్‌తో ఉంటున్నారని అం‍బటి విమర్శించారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు హాట్‌ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు అంబటి. ఈరోజు(శుక్రవారం, మే 29వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. బీజేపీని చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని కాంగ్రెస్‌ సీఎం ఆవిష్కరించడం సిగ్గుచేటు. కాంగ్రెస్‌ సీఎంకి టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీలో చంద్రబాబుకు కాంగ్రెస్‌ పార్టీ బీ టీమ్‌. తెలంగాణలో కాంగ్రెస్‌కు టీడీపీ బీ టీమ్‌. ఇలాంటి అనైతిక రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట. చంద్రబాబు వైఖరిని బీజేపీ బాగా అబ్జర్వ్‌ చేస్తుంది. రాజ్యసభలో బీజేపీకి సీటు ఇవ్వనని చంద్రబాబు అనటం అందుకు‌ సంకేతం. చీరలిచ్చి మహిళలను మహానాడుకు తీసుకెళ్లారు. డబ్బులిచ్చి జనాన్ని తీసుకెళ్లారంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహానాడులో చంద్రబాబును 25%, లోకేష్ ను 75% పొగిడారు. మెగా డీఎస్సీ పేరుతో పోస్టులు అమ్ముకున్న వ్యక్తి నారా లోకేష్. అసలు టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరారు. తర్వాత ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి, నారా రామ్మూర్తి నాయుడుని కూడా రాజకీయాల కోసం వాడుకున్న నీచ చరిత్ర చంద్రబాబుది. జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణలను కూడా తొక్కేసిన దుర్మార్గుడు చంద్రబాబు. ఇంతకుమించిన వెన్నుపోటుదారుడు ఇంకెవరైనా ఉన్నారా?, అలాంటి వ్యక్తికి జగన్ మీద విమర్శలు చేసే అర్హత లేదు. అప్పట్లో మోదీని దూషించి ఇప్పుడు వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు. కేఎన్నార్ మీద

NTV Telugu27 May, 07:14 am
వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు

YS Jagan: మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ మరియు అసెంబ్లీ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహం, ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అంశాలపై జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రజల పక్షాన చేపట్టాల్సిన పోరాటాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్. “రెండేళ్ల చంద్రబాబు పాలన మోసపూరితం” కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నాయని, ఈ కాలంలో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని విమర్శించారు జగన్‌.. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. “బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ” అని ప్రజల్లో నిరూపితమైందన్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో 143 హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారని విమర్శించారు. మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా హామీల అమలుపై ఒక్క మాట లేదన్నారు జగన్‌. “ప్రజలను మభ్యపెట్టే డైవర్షన్ పాలిటిక్స్” ప్రభుత్వం చేసిన మంచి ఏమీ లేకపోవడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని జగన్ ఆరోపించారు. గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు భారీ పన్నులు వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలపై భారం పెరిగిందని, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. “వెన్నుపోటుకు రెండేళ్లు” బుక్‌లెట్ విడుదల చంద్రబాబు పాలనలో జరిగిన మోసాలు, వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో

Andhra Jyothy28 May, 07:26 am
చంద్రబాబు బూట్లు తుడిచి మాట్లాడు.. కొడాలి నానిపై ఎమ్మెల్యే రాము ఫైర్

వైసీపీ నేత కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు బూట్లు తుడిచిన తర్వాతే కొడాలి నాని.. రాజకీయాల గురించి మాట్లాడాలన్నారు. కృష్ణా జిల్లా, మే 28: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు బూట్లు తుడిచిన తర్వాతే కొడాలి నాని రాజకీయాల గురించి మాట్లాడాలన్నారు. ‘ప్రస్తుత పరిస్థితిలో కొడాలి నాని కార్పొరేటర్‌గా కూడా గెలవలేడు.. ఇది నా చాలెంజ్’ అని ఎమ్మెల్యే అన్నారు. గుడివాడ ప్రజలు 53 వేల ఓట్ల తేడాతో ఓడించినా కొడాలి నానికి ఇంకా బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. విజయవాడలో మీడియా ముందు మాట్లాడడం కాదని.. దమ్ముంటే గుడివాడ రావాలని సవాల్ విసిరారు. చేతనైతే గుడివాడ ప్రజలకు సాయం చేసి చూపించాలన్నారు. గుడివాడలో నాని సీటు ఖాళీ అని.. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం దండగ అంటూ వెనిగండ్ల రాము వ్యాఖ్యానించారు. గుడివాడ ప్రజలు కొడాలి నానిని మరిచిపోయి చాలా కాలం అయిందన్నారు. రాజకీయాలలో కొంతమందిని ఎన్నిసార్లు అవమానించినా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సమాజం ఛీ కొడుతున్నా కొడాలి నాని సిగ్గు శరం లేకుండా విమర్శలు చేస్తున్నారన్నారు. మోదీ, చంద్రబాబు స్థాయి ఏంటి.. కొడాలి నాని స్థాయి ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఏం సాధించావని విమర్శలు చేస్తున్నావని మాజీ మంత్రిని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పేపర్ మీద రాసిన స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేని జగన్ ఎక్కడ.. రాజకీయ పరిజ్ఞానం కలిగిన చంద్రబాబు, మోదీ ఎక్కడ అని రాము అన్నారు. ‘అమరావతిపై మాట మార్చిన వ్యక్తి జగన్.. మాట

NTV Telugu27 May, 08:20 am
మహానాడు వేదికగా లోకేష్ కీలక ప్రకటన.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోయినా వారికి పెద్దపీట

TDP Mahanaadu 2026: అమరావతి వేదికగా జరిగిన టీడీపీ ‘హైబ్రిడ్ మహానాడు-2026’లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా.. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33 శాతం టికెట్లు కేటాయిస్తుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్‌పై చర్చ జరుగుతున్న సమయంలో లోకేష్ చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహిళా శక్తిని మహాశక్తిగా గుర్తించిన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడేనని లోకేష్ పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. మహిళల రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత కోసం టీడీపీ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. మహానాడు అంటే టీడీపీకి మాస్ జాతర అని వ్యాఖ్యానించిన లోకేష్.. “నేషన్ ఫస్ట్” అనేదే పార్టీ సిద్ధాంతమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సూచనల మేరకు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. వర్చువల్ విధానంలో జరిగినప్పటికీ కార్యకర్తల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా “సీబీఎన్” అనే పేరు వినిపిస్తోందని, చంద్రబాబు ఇప్పటికీ జెట్ స్పీడ్‌తో పనిచేస్తున్నారని లోకేష్ కొనియాడారు. “అప్పుడు సైబరాబాద్ నిర్మించిన చంద్రబాబు.. ఇప్పుడు అమరావతిని నిర్మిస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని లోకేష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం తమపై అనేక కేసులు పెట్టినా, కార్యకర్తలపై ఒత్తిడి తీసుకొచ్చినా పార్టీ వెనక్కి తగ్గలేదన్నారు. మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, “చేతులకు గాజులు తొడుకున్నారా” వంటి పదాలను నిషేధించామని చెప్పారు. ఇక, రాష్ట్రంలో ఏడాదిలోనే 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని,

Andhra Jyothy27 May, 04:29 am
మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు-2026 వేడుకలు అమరావతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని మహానాడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నిర్వహిస్తున్న మహానాడు-2026 వేడుకలు అమరావతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని మహానాడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. టీడీపీ జెండాను ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు. ఈసారి మహానాడును పూర్తిగా సాంకేతికత ఆధారంగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో 1851 క్లస్టర్లను పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక క్లస్టర్‌ను Two-Way కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా నేరుగా అనుసంధానిస్తూ నాయకులు, కార్యకర్తలతో మమేకం కానున్నారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రతి క్లస్టర్‌లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మహానాడు ప్రత్యేకంగా ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారత, పార్టీ నిర్మాణంలో మహిళల పాత్ర, సామాజిక సేవలో మహిళల భాగస్వామ్యంపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. అదేవిధంగా ‘కార్యకర్తే అధినేత, యువగళం, పేదల సేవలో టీడీపీ’ వంటి అంశాలపై కూడా కీలక చర్చలు జరుగనున్నాయి. మహానాడులో మొత్తం 10 కీలక తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. పార్టీ

NTV Telugu28 May, 06:35 am
మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు

RK Roja: మరోసారి తెలుగుదేశం పార్టీ, మహానాడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. టీడీపీ, సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. టీడీపీ నిర్వహిస్తున్న మహానాడును లక్ష్యంగా చేసుకుని ఆమె పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఒక “బోగస్ పార్టీ” అంటూ వ్యాఖ్యానించిన రోజా, ఆ పార్టీకి కోటి మంది సభ్యులు ఉన్నారని చెప్పుకుంటున్నప్పటికీ మహానాడును చూస్తే రాష్ట్రంలో ఎక్కడా ఉత్సాహం కనిపించడం లేదన్నారు. “మహానాడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అందుకే రికార్డ్ డ్యాన్సులు వేసి పార్టీ క్యాడర్‌ను కూర్చోబెడుతున్నారు” అంటూ ఎద్దేవా చేశారు. మహానాడును ఉద్దేశించి “ఇది మహానాడు కాదు.. దగానాడు, మాయానాడు, భూతునాడు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రోజా… సూపర్ సిక్స్ హామీల గురించి ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పకుండా తల్లి, చెల్లి, గొడ్డలి అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, చంద్రబాబు.. హెరిటేజ్ ఆస్తుల్లో తన తల్లి, చెల్లికి ఎంత ఆస్తులు ఇచ్చారో చెప్పగలరా అని రోజా ప్రశ్నించారు. “వాళ్లు ఎక్కడ ఉన్నారో కూడా ప్రజలకు తెలియదు. తల్లికి, చెల్లికి సహాయం చేసినట్టు ఒక్క ఫోటో అయినా చూపించగలరా?” అని విమర్శించారు. ఈ దేశంలో జగన్ తన చెల్లికి ఇచ్చినంత ఆస్తులు మరెవ్వరూ ఇవ్వలేదని రోజా వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసుపై ప్రశ్నలు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై కూడా రోజా స్పందించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే వివేకా హత్య జరిగిందని గుర్తుచేస్తూ, అప్పట్లో నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. వివేకా కేసులో నిందితుడైన దస్తగిరికి టీడీపీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. “చంద్రబాబు కేసులు వాదించే లాయరే ప్రస్తుతం

Andhra Jyothy26 May, 12:20 am
Home » Andhra Pradesh » MP Kalishetti Appalanaidu Slams YS Jagan Over Faction Politics and Corruption Allegations ABN...

Home » Andhra Pradesh » MP Kalishetti Appalanaidu Slams YS Jagan Over Faction Politics and Corruption Allegations ABN , Publish Date - May 26 , 2026 | 05:50 AM ఫ్యాక్షన్‌ సంస్కృతి, రాజకీయాలు చేసేది వైఎస్‌ జగన్‌ మాత్రమే...

Andhra Jyothy23 May, 10:29 pm
బాబాయ్‌ హత్యపై తడబాటెందుకు జగన్‌?

- Home » Andhra Pradesh » TDP Leaders Target Jagan Over Viveka Case, Accuse YSRCP of Violence Politics in Andhra Pradesh ABN , Publish Date - May 24 , 2026 | 03:59 AM జగన్‌ తనను తాను మంచివాడికి చెప్పుకోవడాన్ని టీడీపీ నేతలు... - హత్యా రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రెస్‌, గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్‌... - అహింసావాదిగా చెప్పుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

Sakshi27 May, 12:42 pm
ఈ బుక్ లెట్ ప్రతి ఇంటికీ చేరాలి

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ( మే 27, బుధవారం) పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలపై వైఎస్‌ జగన్‌.. కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైఎస్‌ జగన్‌ బుక్‌ విడుదల చేశారు. జూన్‌ 4 నుంచి జూన్‌ 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరుపుతున్నట్టు వైఎస్‌ జగన్‌ తెలిపారు. వైఎ‍స్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు నిరసనల్లో పాల్గొనాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. ఈ బుక్‌లెట్‌ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు) మోహినీ రూపంలో అవతారంలో శ్రీగోవిందరాజస్వామి (ఫొటోలు) చిట్టి గౌనులో నజ్రియా క్యూట్‌ లుక్స్‌(ఫోటోలు) మెరిసిపోతోన్న కాజల్... అదిరిపోయిన అందాల చందమామ లేటెస్ట్ ఫోటో షూట్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..? బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్ సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు

Andhra Jyothy26 May, 03:17 am
Home » Andhra Pradesh » Ananthapuram » Topudurthi Raja Reddy Detained in Maheshwar Reddy Death Case VK ABN...

Home » Andhra Pradesh » Ananthapuram » Topudurthi Raja Reddy Detained in Maheshwar Reddy Death Case VK ABN , Publish Date - May 26 , 2026 | 08:47 AM రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి...

Andhra Jyothy28 May, 06:29 am
గాయపడిన సింహాన్ని.. మరింత కసితో వేటాడతా

భరోసా పార్టీ అధినేత, క్రైస్తవమత ప్రచారకుడు అభినయ్ దర్శన్ నర్సీపట్నం సబ్‌జైల్ నుంచి విడుదలయ్యారు. పోలీసులు, జైలు సిబ్బంది తనను చాలా గౌరవంగా చూసుకున్నారని అభినయ్ తెలిపారు. అనకాపల్లి, మే 28: భరోసా పార్టీ అధినేత, క్రైస్తవమత ప్రచారకుడు అభినయ్ దర్శన్ ఈరోజు(గురువారం) నర్సీపట్నం సబ్‌జైల్ నుంచి విడుదలయ్యారు. గత 8 రోజులుగా నర్సీపట్నం సబ్‌జైల్‌లో రిమాండ్‌లో అభినయ్ ఉన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియా ముందుకు వచ్చిన ఆయన.. ‘నన్ను అరెస్ట్ చేసిన చింతపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు, ఎస్పీకి కృతజ్ఞతలు’ అని అన్నారు. పోలీసులు, జైలు సిబ్బంది తనను చాలా గౌరవంగా చూసుకున్నారన్నారు. తనపై ఎవరూ చెయ్యి చేసుకోలేదు, ఇన్వెస్టిగేషన్‌లో కూడా మర్యాదగా వ్యవహరించారని తెలిపారు. ఖైదీలు, పోలీసులు, జైలు సిబ్బంది ఎవరూ కూడా ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదని వెల్లడించారు. పాదయాత్ర ఆగిపోతుందంటూ వస్తున్న రూమర్స్‌పై అభినయ్ దర్శన్ స్పష్టతనిచ్చారు. గాయపడిన సింహం లాంటివాడిని, మరింత కసితో వేటాడతానని స్పష్టం చేశారు. పాదయాత్రకు ఎలాంటి విరామం లేదని, పాడేరు నియోజకవర్గం నుంచే యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రజల కోసం, ప్రజా వ్యక్తిగా పోరాడటానికి తాను ఎప్పుడూ సిద్ధమే అని అభినయ్ దర్శన్ స్పష్టం చేశారు. విశాఖలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.. ఎంపీ శ్రీభరత్ నివాళులు వడదెబ్బ బాధితుల కోసం కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు: డాక్టర్ వాణి

Andhra Jyothy27 May, 08:26 am
నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్

మహానాడు వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): మహానాడు వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఘాటు విమర్శలు చేశారు. ‘వేట కొడవళ్ల నుంచి గొడ్డళ్లకు మారడం వైసీపీ విధానం... ఐటీ నుంచి క్వాంటం వరకు మారడం మన విధానం... బోత్ ఆర్ నాట్ సేమ్. నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్’ అంటూ వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లు రాష్ట్రం ఎదుర్కొన్న పరిస్థితులే ‘క్రూయల్ మెంటాలిటీ’కి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. లెగసీ వేస్ట్ క్లీన్ చేశామని... డోర్ టూ డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నామని తెలిపారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌ను రద్దు చేశామని, ఆస్తుల భద్రత కోసం ప్రతి ఒక్కరికీ క్యూ ఆర్ కోడ్‌తో బ్లాక్‌చైన్ టెక్నాలజీ అమలు చేస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ పరిణామాలు కూడా రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ఇరాన్‌లో యుద్ధం జరిగిందని... ఏపీలో గ్యాస్ సమస్య వచ్చిందని ప్రస్తావించారు. ఆక్వా, అరటికి రేట్లు పడిపోయాయని చెప్పారు. సంక్షేమాన్ని అవకాశంగా మార్చి ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నామని వివరించారు. యువతకు కావాల్సింది గొడ్డలి వేటు కాదని... ఉద్యోగాలని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీ ముసుగులో ‘గొడ్డలి పార్టీ’ వచ్చిందని విమర్శించారు. ‘ఐటీ నుంచి క్వాంటంకు మారడం మన నినాదం’ అంటూ టెక్నాలజీ ఆధారిత అభివృద్ధిపైనే తమ దృష్టి అని తెలిపారు. పార్టీ కేడర్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని

Andhra Jyothy23 May, 10:33 pm
ప్రజల విశ్వాసం కోల్పోతే నష్టపోతాం

- Home » Andhra Pradesh » CM Chandrababu Naidu Warns TDP Cadre on Public Trust, Reviews Puthalapattu Performance ABN , Publish Date - May 24 , 2026 | 04:03 AM క్షేత్ర స్థాయిలో ప్రజల విశ్వాసం కోల్పోతే తీవ్రంగా నష్టపోతామని,... - చిత్తూరు/యాదమరి, మే 23 (ఆంధ్రజ్యోతి): క్షేత్ర స్థాయిలో ప్రజల విశ్వాసం కోల్పోతే తీవ్రంగా నష్టపోతామని, వారి విశ్వాసాన్ని నిలుపుకొనేలా నాయకులు పనిచేయాలని పూతలపట్టు నియోజకవర్గం కార్యకర్తలను టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తం... - సంజీవని ప్రజావేదిక అనంతరం 14 కండ్రిగలో ఏర్పాటు చేసిన 39వ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.