translateexpand_more

Career Change News

Latest updates from Telugu Digital news sources.

Eenadu01 Jun, 02:49 pm
ఐటీ రంగంలో పని చేసి.. ఆటో డ్రైవర్ గా.. ఎందుకంటే

ఈ రోజుల్లో పనివిధానం పూర్తిగా మారిపోయింది. ఈతరం యువత కేవలం జీతంలో అంకెలెక్కువుంటే సంతోషపడడం లేదు.. జీవితంలోనూ సంతోషం ఉండాలంటున్నారు. ఈ క్రమంలో ఏళ్ల అనుభవమున్న ఉద్యోగాన్ని వదులుకోవడానికీ వెనకాడడం లేదు. ఈ రోజుల్లో పనివిధానం పూర్తిగా మారిపోయింది. ఈతరం యువత కేవలం జీతంలో అంకెలెక్కువుంటే సంతోషపడడం లేదు.. జీవితంలోనూ సంతోషం ఉండాలంటున్నారు. ఈ క్రమంలో ఏళ్ల అనుభవమున్న ఉద్యోగాన్ని వదులుకోవడానికీ వెనకాడడం లేదు. కేరళకు చెందిన ఓ యువతి ఇదే కోవకు చెందుతుంది. తొమ్మిదేళ్ల పాటు ఐటీ రంగంలో పనిచేసిన ఆమె.. ఇప్పుడు ఆటో నడుపుతోంది. ఈ క్రమంలో ఇటీవల డాక్టర్‌ నెజ్రిన్‌ మిధ్లాజ్‌ అనే ఓ వ్యాపారవేత్త కంటపడింది. నెజ్రిన్ ఆ యువతితో మాట కలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోకి ఓ క్యాప్షన్‌ జోడించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది నెజ్రిన్. అది వైరల్‌గా మారడమే కాకుండా.. నెటిజన్ల నుంచి చక్కటి స్పందన అందుకుంటోంది. ‘కొన్నిసార్లు అపరిచితులతో అనుకోకుండా మాట్లాడడం వల్ల స్ఫూర్తిదాయకమైన కథనాలు బయటకు వస్తుంటాయి. నాకు కూడా అలాంటి సంఘటనే ఎదురైంది. ఈ రోజు ఒక మహిళా ఆటో డ్రైవర్‌ను కలిశా. తను చక్కటి వస్త్రధారణతో, నిండైన ఆత్మవిశ్వాసంతో, జీవితంపై స్పష్టమైన అవగాహన ఉన్నట్టుగా కనిపించింది. దాంతో ఆమెను పలకరించా. పురుషాధిక్య రంగంలో పనిచేయడం ఎలా ఉందని అడిగా. దానికి ఆమె ఇచ్చిన సమాధానంతో మరికొంతసేపు మాట్లాడాలనిపించింది. ‘మేడమ్.. ఇప్పుడు చాలా బాగుంది. మహిళలుగా మనం చాలా ధైర్యవంతులం. మనసు పెడితే ఏదైనా సాధించగలుగుతాం. నేను తొమ్మిదేళ్ల పాటు ఐటీ రంగంలో పనిచేశా. అయితే తీవ్రమైన పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత, వర్క్‌ లైఫ్‌ బ్యాలన్స్‌ లేకపోవడం వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశా. ఆ తర్వాత ఈ ఆటో కొని నడుపుతున్నా.

TV9 Telugu30 May, 06:09 am
ఉద్యోగం పోయిందని సంబరాలు.. ఇప్పుడే నా జీవితం మొదలైంది అంటున్న యువతి

ఉద్యోగం పోతే చాలామంది కుంగిపోతారు. ఇక పెద్ద కంపెనీలో పని చేసే వాళ్లైతే మరింత ఆందోళనతో ఉంటారు. కానీ ఓ యువతి మాత్రం తన ఉద్యోగం పోయిందనే వార్త విన్న వెంటనే ఆనందంతో ఎగిరి గంతేసింది. “ హమ్మయ్యా.. నా ప్రాణం మళ్లీ తిరిగొచ్చినట్లు అనిపిస్తోంది” అంటూ చెబుతున్న మాటలు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీశాయి. అమెరికాలో మెటా కంపెనీలో నాలుగేళ్లు పని చేసిన ఆశా ఈ మధ్య లేఆఫ్‌ అయింది. ఇలాంటి సమయంలో బాధపడాల్సింది పోయి ఆమె మాత్రం సంతోషంతో మనసులో మాట బయటపెట్టింది. పెద్ద జీతం, సౌకర్యాలు, పేరు ప్రతిష్ట అన్నీ ఉన్నా ప్రతి రోజూ ఓకేలా జరిగే మీటింగ్స్‌ గంటల కొద్దీ కూర్చుని డాక్యుమెంట్లు తయారుచేయడం విసుగనిపించాయనీ తెలిపింది. బయటికి మంచి జీవితం కనిపించినా లోపల మాత్రం ఖాళీగా అనిపించేదని తెలిపింది. రొటీన్ వర్క్‌తో లోలోపల చనిపోయినట్లు ఫీలయ్యేదానినని ఆ బాధతో కుంగిపోయాననీ చెప్పుకొచ్చింది. ఉద్యోగం పోయిన తర్వాత మొదటిసారి ప్రశాంతంగా నిద్రపోయానని కూడా ఆమె చెప్పింది. ఇకపై తనకు నిజంగా ఇష్టమైన..క్రియేటివ్‌ పనులు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. కొత్తగా ప్రారంభమైన ఓ చిన్న సంస్థలో చేరి.. కొత్త ఆలోచనలతో పని చేయబోతున్నానని తెలిపింది. ఆమె మాటలు ఇప్పుడు వేలాది ఉద్యోగుల మనసుల్లో ఉన్న భావాలు బయటపడినట్లయింది. “ఉద్యోగం పోయినా ఇంత ఆనందపడతారా?” అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. “ఆమె చెప్పిందే నిజం” అంటూ మరికొందరు తమ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకుంటున్నారు. “డబ్బు కోసం మనసుకు నచ్చని పని చేస్తూ జీవితం మొత్తం గడపాలా?.. లేదంటే మనసు కోరిన దారిలో నడవాలా?” అనే కోణంలో చర్చ నడుస్తోంది. మార్స్ లో మనుషులు జీవించడానికి మొదటి అడుగు! మృత్యువు ఇలా కూడా వస్తుందా..! భోజనం చేస్తుండగానే

Eenadu25 May, 02:53 pm
ఇటీవలి కాలంలో పలు సంస్థలు లేఆఫ్‌లు ప్రకటించడం సాధారణమైంది. టెక్‌ దిగ్గజం మెటా సంస్థ కూడా ఇటీవలే కొంతమంది ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించింది. ఇలా...

ఇటీవలి కాలంలో పలు సంస్థలు లేఆఫ్‌లు ప్రకటించడం సాధారణమైంది. టెక్‌ దిగ్గజం మెటా సంస్థ కూడా ఇటీవలే కొంతమంది ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించింది. ఇలా ఉద్యోగాలు కోల్పోయినప్పుడు దిగులు చెందడం సాధారణం. ఇటీవలి కాలంలో పలు సంస్థలు ల...