translateexpand_more

Ipl 2026 Highlights News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu02 Jun, 11:31 am
ఐపీఎల్ 2026 సీజన్ హైలెట్స్.. ఈ 7 వీడియోలు తప్పక చూడండి

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. IPL 2026 Top Viral Moments: ఐపీఎల్ 2026 సీజన్ అద్భుతంగా ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 155 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 75 పరుగుల నాటౌట్‌గా నిలిచి ఆర్‌సీబీని విజేతగా నిలిపాడు. కోహ్లీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా, వైభవ్ సూర్యవంశి 'ప్లేయర్ ఆఫ్ ది సీజన్'గా ఎంపికయ్యారు. ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన ఆటతీరుతో ఆద్యాంతం అభిమానులను అలరించాడు. ఈ సీజన్‌లో అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ఏడు విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఒకే రీతిలో హిట్ వికెట్ అవ్వడం అభిమానులకు చాలా కాలం గుర్తిండిపోతుంది. ఐపీఎల్ చరిత్రలోనే కాదు.. క్రికెట్ చరిత్రలో కూడా ఇలా ఎన్నడూ జరగలేదు. ఐపీఎల్‌లో మొత్తం మూడుసార్లు హిట్ వికెట్ అయిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. క్వాలిఫయర్ 1లో ఆర్‌సీబీపై, క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌పై సాయి సుదర్శన్ చేతిలో నుంచి బ్యాట్ జారిపోయి వికెట్లను తాకింది. దీంతో బ్యాట్‌కు చేయికి పట్టి కట్టించి ఆడించాలంటూ రకరకాల మీమ్స్‌ వైరల్ అయ్యాయి. — Sanjeev । సంజీవ్ 🇮🇳 (@sanjusayz) May 30, 2026 విరాట్ కోహ్లీ మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లపై ఎప్పుడు దూకుడుగా ఉంటాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ట్రావిస్ హెడ్‌తో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీతో ట్రావిస్ హెడ్ కరచాలనం చేయసేందుకు ప్రయత్నించినా.. కోహ్లీ అతను నిరాకరించాడు. ట్రావిస్ హెడ్ భార్యపై కూడా కోహ్లీ అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేశారు. క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలింగ్ సమయంలో అంపైర్‌తో విరాట్ కోహ్లీ సరదా పని అందరిని నవ్వించింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 254 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం మైదానంలోకి రాగానే కోహ్లీ బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు.. అంపైర్ చేతికి తన టోపీని ఇచ్చాడు. మొదటి ఓవర్ నిజంగా కోహ్లీ వేస్తాడా అని అంపైర్ ఆశ్చర్యపోగా.. నిజానికి అంపైర్‌ను సరదాగా ఆటపట్టించాడు. కోహ్లీ, అంపైర్ మధ్య జరిగిన ఈ వీడియో వైరల్ అయింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ విన్యాసాలతో అద్భుతాలు సృష్టించాడు. ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్ల క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. ఎలిమినేటర్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 28 బంతుల్లో 97 పరుగులతో ఉన్న సమయంలో భారీ షాట్ ఆడేందుకు యత్నించి వికెట్ కోల్పోయాడు. ఆ బంతి బౌండరీకి వెళ్లిపోయి ఉంటే 29 బంతుల్లో సెంచరీ బాదిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించేవాడు. వైభవ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడినా.. తీవ్రంగా నిరాశ చెందాడు. సీజన్‌కు ముందు గేల్ 30 బంతుల రికార్డును బ్రేక్ చేయాలనుకుంటున్నట్లు చెప్పిన వైభవ్.. రికార్డుకు చేరువగా వచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌ తరువాత కృనాల్ పాండ్యా కాలర్‌ను నికోలస్ పూరన్ పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే వారిద్దరి మధ్య ఎలాంటి గొడవ ఏం జరగలేదు. ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌తో అలా సరదగా పూరన్ కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి లక్నో టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలక్ట్రిక్ సిగరేట్ తాగడం ఈ సీజన్‌లో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనపై బీసీసీఐ స్పందించి.. పరాగ్‌పై చర్యలు తీసుకుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మంచి ఆటతీరును కనబర్చింది. నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న రాజస్థాన్.. ఎలిమినేటర్‌ పోరులో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించింది. క్వాలిఫైయర్-2 గుజరాత్‌పై వైభవ్ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడినా.. రాజస్థాన్ ఓటమిపాలు కావడం అభిమానులను బాధించింది. ఐపీఎల్ 2026లో మనీష్ పాండే పట్టిన క్యాచ్‌కు బెస్ట్ అవార్డు లభించింది. అయితే ఈ రేసులో బార్ట్‌లెట్ పట్టిన క్యాచ్ కూడా పోటీలో నిలిచింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ను దాటుతున్న బంతిని పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాలిలోనే పట్టుకుని.. దాన్ని లోపలికి విసిరాడు. వెంటనే బార్ట్‌లెట్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను అక్కడే డగౌట్‌లో చూసిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ చూసి షాక్ అయ్యారు.

Ipl 2026 Highlights News Keyword | Telugu Digital