translateexpand_more

Jana Nayagan News

Latest updates from Telugu Digital news sources.

SkyC Media31 May, 10:50 am
విజయ్ జననాయగన్ ఆలస్యం మాట్లాడే ధైర్యం లేదన్న హెచ్ వినోద్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న 'జననాయగన్' సినిమా విడుదల నిరంతరం ఆలస్యమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు హెచ్ వినోద్ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొని సినిమా ఆలస్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ జననాయగన్ ఆలస్యం వ్యవహారం ఇప్పుడు తమిళ సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా విడుదల ప్రక్రియ ప్రస్తుతం తమ చేతుల్లో ఏమాత్రం లేదని దర్శకుడు స్పష్టం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన నిజాలను బహిరంగంగా మాట్లాడే ధైర్యం తనకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సినిమా అసలు ప్రణాళిక ప్రకారం జనవరి 2026 లో సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే పొలిటికల్ కంటెంట్ కారణంగా ఈ చిత్రం తీవ్రమైన సెన్సార్షిప్ సమస్యలను ఎదుర్కొంటోంది. దీంతో సినిమా అనుకున్న సమయానికి థియేటర్లలోకి రాలేకపోయింది. ఈ వివాదం కాస్తా కోర్టు మెట్లు ఎక్కడంతో ఒక ప్రత్యేక రివైజింగ్ కమిటీని కూడా నియమించారు. అయినప్పటికీ ఆ కమిటీ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా సినిమాకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని నిర్మాత వెంకట్ కే నారాయణ్ ధృవీకరించారు. దర్శకుడు వినోద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాను ఒకవేళ ధైర్యం చేసి నిజాలు మాట్లాడినా, వాటిని ప్రసారం చేసే ధైర్యం మీడియాకు ఉండకపోవచ్చని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు సంబంధించిన అడ్డంకులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థమవుతోంది. విజయ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈ సినిమా కంటెంట్‌లోని రాజకీయ సున్నితత్వం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఫలితంగా సినిమా భవిష్యత్తుపై అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ప్రస్తుతానికైతే సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్

Chitrajyothy31 May, 09:25 am
చెప్పే దమ్ము నాకున్నా.. ప్రసారం చేసే దమ్ము మీకు లేదు

విజయ్‌ హీరోగా నటించిన ‘జన నాయగన్‌’ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. విజయ్‌ హీరోగా నటించిన ‘జన నాయగన్‌’ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు హెచ్‌ వినోద్‌ ఓ కార్యక్రమంలో పాల్గొనగా ఈ సినిమా విడుదలపై ఓ ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జన నాయగన్‌’ సినిమా విడుదల మన చేతుల్లో ఉండదు. ఈ చిత్రానికి సంబంధించిన నిజాలు గురించి మాట్లాడేందుకు నాకు ధైౖర్యం లేదు. ఒకవేళ ధైౖర్యం చేసి మాటాడినా.. దానిని ప్రసారం చేసే దమ్ము మీకు లేదు’ అని అనడం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో దర్శకుడు ఎందుకిలా మాట్లాడడనే దానిపై చర్చ మొదలైంది. ఈ చిత్రం అసలు సంక్రాంతికి విడుదల కావల్సింది. కానీ సెన్సార్‌ బోర్ట్‌ నిబంధనలు, ఆంక్షల కారణంగా కోర్టు వరకే వెళ్లింది. రివైజింగ్‌ కమిటీ ఈ సినిమా చూసి రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని నిర్మాత ఇటీవల తెలిపారు. అయితే ఇప్పుడు విజయ్‌ సీఎం అయ్యారు కాబట్టి సమస్యలన్ని ఓ కొలిక్కి వచ్చి త్వరగా విడుదలవుతుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ ఇ్కఆ వ్యవహారం చక్కబడలేదు. అందుకే ఇంకా రిలీజ్‌ డేట్‌ కూడా ఇవ్వలేదు.

Telugu Times31 May, 11:55 am
జ న నాయ గ న్ డైరెక్ట ర్ సెన్సేష న ల్ కామెంట్స్

తమిళ స్టార్ విజయ్(Vijay) నటించిన చివరి ఫీచర్ ఫిల్మ్‌గా ప్రచారం పొందిన జన నాయగ‌న్(Jana Nayagan) రిలీజ్ విష‌యంలో నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితి ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. మొదట ఈ సినిమాను సంక్రాంతి 2026 సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసిన‌ప్ప‌టికీ, అనేక కారణాలతో సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఐదు నెలలు గడిచినా రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాకపోవడంతో అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కొత్త రిలీజ్ డేట్లపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నా, చిత్ర యూనిట్‌ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో డైరెక్ట‌ర్ హెచ్ వినోద్(H Vinod) చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నిజం చెప్పే ధైర్యం నాకు లేదు. ధైర్యం ఉన్నా, దాన్ని మీరు పంచుకునే ధైర్యం ఉండదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ఈ మాటల వెనుక అసలు అర్థం ఏంటి? సినిమా ఆలస్యానికి మరేదైనా పెద్ద కారణం ఉందా? అనే ప్రశ్నలు అభిమానులను వెంటాడుతున్నాయి. కొందరు ఇది సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమేనని భావిస్తుండగా, మరికొందరు సినిమా రిలీజ్ వెనుక పెద్ద స్థాయి అడ్డంకులు ఉన్నాయేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సెన్సార్ బోర్డు అధికారులు ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపినట్లు సమాచారం. కమిటీ స్క్రీనింగ్ ప్రక్రియ పూర్తయినప్పటికీ, ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ జారీ కాలేదని తెలుస్తోంది. దీంతో రిలీజ్ డేట్‌పై స్పష్టత రాకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. సామాజిక అంశాలతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ కలిగిన ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) నిర్మిస్తోంది. విజయ్ ఫ్యాన్స్ మాత్రం

Eenadu31 May, 06:14 am
జన నాయగన్ ’ దర్శకుడి కీలక వ్యాఖ్యలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ (Vijay) నటించిన ‘జన నాయగన్‌’ (Jana Nayagan) వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఈ మూవీ విడుదల వివాదంపై ప్రశ్న ఎదురవగా దర్శకుడు హెచ్‌.వినోద్‌ (H Vinoth) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సినిమా విడుదల మన చేతుల్లో ఉండదు. ఈ చిత్రానికి సంబంధించిన నిజాల గురించి మాట్లాడేందుకు నాకు ధైర్యం లేదు. ఒకవేళ ధైర్యం చేసి మాట్లాడినా.. దానిని టెలీకాస్ట్‌ చేసే ధైర్యం మీకు లేదు’’ అని అనడం నెట్టింట చర్చనీయాంశమైంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలోనే రావాల్సి ఉంది. కానీ, సెన్సార్‌ విషయంలో కోర్టుల వరకూ వెళ్లింది. ప్రత్యేకంగా ఏర్పాటైన రివైజింగ్‌ కమిటీ ఈ మూవీని చూసి, రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదని నిర్మాత వెంకట్‌ కె. నారాయణ ఇటీవల తెలిపారు. విజయ్‌ సీఎం అయ్యారు కాబట్టి వెంటనే సినిమా రిలీజ్‌ అవుతుందని అభిమానులు ఆశించారు. కానీ, ఈ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అజిత్‌ ఇంటికి సీఎం విజయ్‌, త్రిష కలిసి వెళ్లారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.