translateexpand_more

Lokesh Kanagaraj News

Latest updates from Telugu Digital news sources.

AP7AM31 May, 04:26 pm
మళ్లీ సినిమాల్లో నటిస్తున్న జయం రవి... 'బెంజ్'లో కీలక పాత్ర

ప్రముఖ నటుడు జయం రవి అభిమానులకు శుభవార్త. కొద్ది రోజుల క్రితమే వ్యక్తిగత కారణాలతో నటనకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు ప్రకటించిన ఆయన, ఇప్పుడు అనూహ్యంగా లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో అడుగుపెట్టారు. ఇందులో భాగంగా రాఘవ లారెన్స్ హీరోగా వస్తున్న 'బెంజ్' చిత్రంలో జయం రవి ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు అధికారికంగా వెల్లడైంది.ఇవాళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. 'బెంజ్' షూటింగ్ స్పాట్‌లో రవితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ, "LCUలోకి స్వాగతం" అని పేర్కొన్నారు. ఈ చిత్ర కథానాయకుడు రాఘవ లారెన్స్ కూడా జయం రవికి సాదర స్వాగతం పలికారు.కొద్ది రోజుల క్రితమే జయం రవి ఓ మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన భార్య ఆర్తి రవితో విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు, తనపై జరుగుతున్న సైబర్ వేధింపులు ఆగే వరకు ఏ సినిమాలోనూ నటించనని కన్నీటితో స్పష్టం చేశారు. అదే సమయంలో గాయని కెనీషా ఫ్రాన్సిస్‌తో తన బ్రేకప్‌ను కూడా అంగీకరించారు.ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకే ఆయన 'బెంజ్' సెట్లో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివిన్ పౌలీ విలన్‌గా నటిస్తున్నారు. 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' చిత్రాల మాదిరిగానే డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఇంత త్వరగా రవి తన నిర్ణయాన్ని ఎలా మార్చుకున్నారని, ఆయన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యాయా అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Sakshi31 May, 11:31 am
ఎల్ సీయులో మరో స్టార్ హీరో.. లోకేశ్ గ్రాండ్ వెల్ కమ్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌ సినిమాటిక్ యూనివర్స్‌లో పలు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఎల్‌సీయూలో భాగంగా వస్తోన్న మరో యాక్షన్‌ సినిమా బెంజ్. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీకి సంబంధించి బిగ్‌ అప్‌డేట్ వచ్చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో మరో స్టార్ హీరో జాయినయ్యారు. ఇటీవల భార్యతో విడాకుల వివాదంతో

Chitrajyothy31 May, 11:03 am
బెంజ్ లో మరో నటుడు.. లోకేశ్ ప్రకటన

లోకేశ్‌ కనకరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో ‘బెంజ్‌’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! లోకేశ్‌ కనకరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో (LCU)‘బెంజ్‌’ (Benz movie)) చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ఇందులో ఇప్పుడు మరో పాత్ర కోసం జయం రవి చేరినట్లు దర్శకుడు లోకేశ్‌ ప్రకటించారు. సెట్‌లో ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. లారెన్స్‌ రాఘవ హీరోగా దర్శకుడు బక్కియరాజ్‌ కన్నన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో ఇప్పటికే మలయాళ నటుడు నివిన్‌ పౌలీ విలన్‌గా నటిస్తున్నారు. అయితే ఇందులో రవి మోహన్‌ (Ravi mohan)పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. ఒక సినిమాలో పాత్రను మరో సినిమాలో పాత్రకు లింక్‌ చేసి సినిమాటిక్‌ యూనివర్స్‌ పేరుతో నయా ట్రెండ్‌ ప్రారంభించారు లోకేశ్‌. కార్తి ‘ఖైదీ’, కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’, విజయ్‌ ‘లియో’ చిత్రాలు దీని నుంచి వచ్చినవే! గతేడాది ఆయన నుంచి కూలీ చిత్రం వచ్చింది. తదుపరి ఖైదీ 2 ప్లాన్‌ చేస్తారేమో అనుకున్నారంతా. కానీ ఆయన అల్లు అర్జున్‌తో సినిమాను ప్రకటించారు. పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌ మీదకెళ్లనుంది. మరో పక్క లోకేశ్‌ హీరోగా ‘డీసీ’ సినిమా తెరకెక్కుతోంది.