translateexpand_more

Mega Dsc News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy01 Jun, 12:50 am
మెగా డీఎస్సీపై జగన్ ఆరోపణలు అర్థరహితం

మెగా డీఎస్సీపై జగన్‌ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. డైవర్షన్‌ రాజకీయాలు ఆయన నైజమని విమర్శించారు. డైవర్షన్‌ రాజకీయాలు ఆయన నైజం: మంత్రి కొల్లు ఒంగోలు కార్పొరేషన్‌, మే 31(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీపై జగన్‌ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. డైవర్షన్‌ రాజకీయాలు ఆయన నైజమని విమర్శించారు. ఆదివారం ఒంగోలులో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ అమలు చేయకుండా నిరుద్యోగులను దగా చేసిన జగన్‌... ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. యువత, నిరుద్యోగులను రోడ్డున పడేయడమే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ పీఏ అవినీతి బాగోతం బయటికి వస్తుండటంతో డీఎస్సీపై అసత్య ప్రచారం ప్రారంభించారని, పీఏనే అలా ఉంటే ఇక నాయకుడి అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

Oneindia Telugu30 May, 01:50 pm
మెగా డీఎస్సీపై తేల్చేసిన ఏపీ సర్కార్..! ఎంపిక, మెరిట్ లిస్ట్ పైనా

ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీ (Mega DSC)లో అక్రమాలు జరిగాయంటూ జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం ఇవాళ స్పందించింది. విద్యాశాఖ తరఫున అధికారులు ఈ మేరకు వివరణ ఇచ్చారు. మెగా డీఎస్సీ నిర్వహణపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, డీఎస్సీని పూర్తి పారదర్శకంగా నిర్వహించామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. కమిషనర్, ఇతర అధికారులతో కలిసి ఆయన డీఎస్సీ జరిగిన తీరుపై వివరణ ఇచ్చారు.2024 జూన్ 13న మెగా డీఎస్సీ ఫైల్‌పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారని, 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించామని కోన శశిధర్ తెలిపారు. మెరిట్ ఆధారంగానే డీఎస్సీలో నియామకాలు జరిగాయని ఆయన వెల్లడించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా ఇతర రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. టాటా ఆయన్ ఆధ్వర్యంలో, మల్టీ లెవెల్ డిజిటల్ సెక్యూరిటీతో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రశ్నపత్రాల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. సీబీటీ విధానంలో మెగా డీఎస్సీ నిర్వహణతో, ప్రశ్నపత్రాల లీకేజీకి అవకాశం లేదని కోన శశిధర్ తెలిపారు.డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్ధుల మార్కులను వెబ్ సైట్ లో ప్రచురించినట్లు ఆయన తెలిపారు. తాము వెబ్ సైట్ లో మెరిట్ లిస్ట్ పెట్టలేదన్న ఆరోపణల్ని ఖండించారు. దరఖాస్తు సమయంలోనే అన్ని సర్టిఫికెట్లు సమర్పించాలని తాము కోరామని, అయితే కొందరు అభ్యర్ధులు ఈ నిబంధన సడలింపు కోరడంతో మార్చినట్లు వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 1-3 నిష్పత్తిలో అభ్యర్ధుల్ని పిలిచామని తెలిపారు. అర్హత ఉన్న వారిని ఎవరినీ పక్కనబెట్టలేదని, పూర్తి పారదర్శకతతోనే పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చామని కోన శశిధర్ తెలిపారు.

AP7AM01 Jun, 05:01 pm
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాల్లేవు.. అంతా పారదర్శకమే

రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియ గతంలో ఎన్నడూ లేనంత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా, ఎటువంటి అవకతవకలకు తావులేకుండా జరిగిందని క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. సోమవారం నాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కొత్త క్రీడా విధానం, పెరిగిన రిజర్వేషన్లు రాష్ట్ర విభజన తర్వాత 2017లో తొలిసారిగా క్రీడా విధానాన్ని తీసుకొచ్చామని, అది 2022 వరకు అమల్లో ఉందని అజయ్ జైన్ తెలిపారు. ఆ తర్వాత రెండేళ్లు పాలసీ లేకపోవడంతో, కొత్త ప్రభుత్వం డిసెంబర్ 2024లో జీవో 18 ద్వారా నూతన క్రీడా విధానాన్ని అమల్లోకి తెచ్చిందని వివరించారు. ఈ విధానంలో క్రీడలను ప్రోత్సహించడం, పారా-స్పోర్ట్స్ అథ్లెట్లకు గుర్తింపు, మహిళలు, వెటరన్లకు ప్రాధాన్యత వంటి అంశాలు చేర్చామన్నారు. ముఖ్యంగా, ఉద్యోగాల్లో క్రీడాకారులకు ఉన్న 2 శాతం రిజర్వేషన్‌ను 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్‌గా పెంచినట్లు గుర్తుచేశారు. ఈ రిజర్వేషన్లు కేవలం ఉద్యోగాలకే కాకుండా, ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలకు కూడా వర్తిస్తాయని అన్నారు.కేంద్ర ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖ 2024 మార్చి 4న జారీ చేసిన మెమోరాండం ఆధారంగా 65 క్రీడాంశాలను గుర్తించి, వాటిని కేటగిరీ 'ఏ', 'బీ'లుగా విభజించినట్లు తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో

Andhra Jyothy31 May, 01:22 am
నిరుద్యోగ యువతపైనా వైసీపీ గొడ్డలి వేటు

మెగా డీఎస్సీపై వైసీపీ ఆరోపణలకు టీడీపీ దీటుగా సమాధానం ఇచ్చింది. ‘నిరుద్యోగ యువతపై గొడ్డలి వేటు’ పేరిట శనివారం తిరుపతిలో డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువతతో శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మెగా డీఎస్సీపై వైసీపీ ఆరోపణలపై టీడీపీ నేతల మండిపాటు తిరుపతి సిటీ, మే 30 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీపై వైసీపీ ఆరోపణలకు టీడీపీ దీటుగా సమాధానం ఇచ్చింది. ‘నిరుద్యోగ యువతపై గొడ్డలి వేటు’ పేరిట శనివారం తిరుపతిలో డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువతతో శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్‌, రాంగోపాల్‌ రెడ్డి వైసీపీ అసత్య ఆరోపణలుపై తీవ్రంగా స్పందించారు. రవి నాయుడు మాట్లాడుతూ ‘వైసీపీ నాయకుల వలే నిరుద్యోగుల రక్తపుకూడు తినాల్సిన ఖర్మ టీడీపీ నేతలకు లేదు. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారో వైసీపీకి తెలియడంలేదు. క్రీడా కోటాలో ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులకు సర్టిఫికెట్లను శాప్‌ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మంజూరు చేయదు. క్రీడా సంఘాలు, సమాఖ్యలు మాత్రమే సర్టిఫికెట్లు జారీ చేస్తాయన్న పరిజ్ఞానం కూడా వైసీపీ నేతలకు లేదు’ అని పేర్కొన్నారు. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన పలువురు మాట్లాడుతూ రాత్రింబవళ్లు కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే వైసీపీ నాయకులు తమను అవహేళన చేస్తూ మాట్లాడడం తగదన్నారు. స్వార్థ రాజకీయాలకోసం తమను బలిపశువులు చేయవద్దని పలువురు మహిళా ఉపాధ్యాయులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

AP7AM25 May, 10:47 am
ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించింది మెగా డీఎస్సీనా లేక నిరుద్యోగులను మోసం చేసిన దగా డీఎస్సీనా అని వైసీపీ అధినేత జగన్ నిలదీశారు. తమ హయాంలో...

ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించింది మెగా డీఎస్సీనా లేక నిరుద్యోగులను మోసం చేసిన దగా డీఎస్సీనా అని వైసీపీ అధినేత జగన్ నిలదీశారు. తమ హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి, కావాలనే ఆలస్యం చేస్తూ కొత్త నోటిఫికేషన్‌తో పబ్లిసిటీ...

Eenadu26 May, 12:55 pm
Fact Check: మెగా డీఎస్సీపై ఆరోపణలు పూర్తిగా అవాస్తవం: ఏపీ ప్రభుత్వం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీలో గతేడాది జరిగిన మెగా డీఎస్సీపై కొందరు చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. మెగా డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తేల్చి చెప్పింది. ఇది వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వసాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారమని పేర్కొంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం ‘ఎక్స్‌’ వేదికగా ఓ పోస్టు పెట్టింది. ‘‘మెగా డీఎస్సీ పరీక్షల్ని అత్యంత పారదర్శకమైన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో, అత్యున్నత స్థాయి డిజిటల్ భద్రతా ప్రమాణాలతో నిర్వహించాం. మల్టీ-సెషన్ పద్ధతిలో వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహించిన ఈ పరీక్షల్లో ప్రశ్నాపత్రం లీక్‌ అవ్వడం సాంకేతికంగా అసాధ్యం. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులూ అందలేదు. ఇక పి. నవీన్ అనర్హత అంశానికి సంబంధించి, నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా పరీక్ష రాయడం, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు గైర్హాజరు కావడంతో రూల్ 20(vi) ప్రకారం అతడి అభ్యర్థిత్వం రద్దు చేసినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంపై ఆయన కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఉత్తర్వుల మేరకు గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కమిటీ, రాష్ట్ర స్థాయి అప్పీల్ కమిటీలు నిబంధనల ప్రకారం విచారణ జరిపి కేసును పరిష్కరించామని ప్రభుత్వం వివరించింది. మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదలైన కేవలం 148 రోజుల్లోనే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. పరీక్షలు ముగిసిన తర్వాత గతేడాది ఆగస్టు 22న అభ్యర్థుల పూర్తి వివరాలు, మార్కులు, ర్యాంకులతో కూడిన అధికారిక మెరిట్ జాబితాలను పారదర్శకంగా వెబ్‌సైట్‌లో విడుదల చేసిన తర్వాతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఎటువంటి డేటా డిలీట్ కాలేదని, డిజిటల్ రికార్డులన్నీ మల్టీ-లెవెల్ వెరిఫికేషన్ సిస్టమ్స్ ద్వారా భద్రంగా ఉన్నాయని

Andhra Jyothy31 May, 02:06 pm
మెగా డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్ కు లేదు

ప్రకాశం, మే 31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఈరోజు (ఆదివారం) ప్రకాశం జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రగతి కోసం మహానాడులో చర్చించామని అన్నారు. మహానాడు విజయవంతంగా జరగడం చూసి జగన్ రెడ్డి తట్టుకోలేక పోతున్నారని ధ్వజమెత్తారు. కనీవినీ ఎరగని రీతిలో మహానాడుకి లైవ్‌లో 24 లక్షల మంది హాజరయ్యారని ప్రస్తావించారు.

ప్రపంచంలోనే మహానాడుది ఒక చరిత్ర..

ప్రపంచంలోనే మహానాడుది ఒక చరిత్ర అని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. మెగా డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత జగన్‌కి లేదని చెప్పారు. మెగా డీఎస్సీలో అర్హత సాధించిన వాళ్లు ఏడాది కాలంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని తెలిపారు. జగన్ నేర చరిత్ర, అవినీతి బయటకు వస్తున్నాయని చెప్పారు. ఏపీ లిక్కర్ స్కాం బయటకు వచ్చినప్పుడు ఒకటి, అమరావతి గురించి మాట్లాడితే మావిగన్, మహానాడు జరుగుతుంటే డీఎస్సీ గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

తల్లినీ, చెల్లిని బయటకు గెంటేశారు..

వందల కోట్లు జగన్ పీఏకి ఎలా వచ్చాయని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. జైలు జీవితం కూడా అనుభవించిన వ్యక్తి జగన్... ప్రజలు ఈ విషయాలను కూడా గమనించాలని అన్నారు. అవినీతి పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు. మహిళలు అంటే జగన్‌కి గౌరవం‌ లేదని అన్నారు. తల్లినీ, చెల్లిని బయటకు గెంటేశారని

Andhra Jyothy31 May, 01:02 pm
మెగా డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారు.. జగన్ పై మంత్రి సవిత ధ్వజం

అమరావతి, మే31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత (AP Minister Savitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు చంద్రబాబు వస్తే జాబు... జగనొస్తే చావేనని విమర్శించారు. ఈరోజు (ఆదివారం) వెలగపూడిలోని సచివాలయంలో మీడియాతో మంత్రి సవిత మాట్లాడారు. మెగా డీఎస్సీలో అక్రమాలకు తావే లేదని స్పష్టం చేశారు. వైసీపీ నేతల బిడ్డలు సైతం డీఎస్సీలో క్వాలిఫై అయ్యి టీచర్లగా పనిచేస్తున్నారని ప్రస్తావించారు.

ముఖ్యమంత్రిగా 2 లక్షలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుదని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. టీడీపీ మహానాడులో మహిళా రిజర్వేషన్ల ప్రకటనతో జగన్ మైండ్ బ్లాంక్ అయ్యిందని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీలో అక్రమాలంటూ జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి సవిత ధ్వజమెత్తారు.

ఈ వార్తలు కూడా చదవండి...

విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!

పోలీసులపై దాడులు సహించం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: అనిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News